కర్నూలు: కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు సమీపంలో ఓ బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అయ్యవారి నార్లాపురం గ్రామానికి చెందిన సురేంద్రారెడ్డి, బూసిరెడ్డి, శ్రీనివాసరెడ్డి ఒకే బైక్‌పై వెళుతుండగా పెద్దపాడు సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.