ముదోల్(ఆదిలాబాద్): ఆటో, వ్యాన్ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ముదోల్ మండలం తక్లి గ్రామ సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఒకరు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృతి చెందారు. మృతులు నిజామాబాద్కు చెందిన మునీర్, అబ్బాస్, ఆవేశ్గా గుర్తించారు.