
రక్తదారులు
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
జిల్లాలో శనివారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. గోరంట్ల మండలం రెడ్డిచెరువు కట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పూలచెట్లపల్లికి చెందిన విశ్వనాథ్‌రెడ్డి (12), బూదిలి గ్రామ సమీపంలోని పుట్టపర్తి– బెంగుళూరు ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదంలో చిలమత్తూరు మండలం సోమఘట్టకు చెందిన లక్ష్మమ్మ (65) మృతి చెందారు. రాయదుర్గం మండలం మల్లాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బళ్లారికి చెందిన ప్రసాద్(40) దుర్మర ణం చెందాడు.
గోరంట్ల : మండలంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. మండలంలోని పూలచెట్లపల్లికి చెందిన నరేంద్రరెడ్డి, ఇందిరమ్మ కుమారులిద్దరూ విశ్వనాథ్‌రెడ్డి (12), విజయ్‌కుమార్‌రెడ్డి (13) పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8 వతరగతి చదువుతున్నారు. శనివారం వారని పాఠశాలకు పంపించేందుకు నరేంద్రరెడ్డి ఇద్దరినీ గ్రామ బస్టాప్ వద్ద దింపి వెళ్లారు. అదే సమయానికి పట్టణంలోని ఓ ఫొటో స్టూడియోలో పని చేసే యువకుడు పవన్ వీరిద్దరినీ ద్విచక్రSవాహనంపై ఎక్కించుకొని పాఠశాలకు వెళ్తుండగా రెడ్డిచెర్వు కట్ట సమీపంలో గోరంట్ల నుంచి కదిరి వైపు వేగంగా వస్తున్న టాటా సుమో ద్విచక్రSవాహనాన్ని ఢీకొనింది.
ఈ ప్రమాదంలో మధ్యలో కూర్చున్న విశ్వనాథ్‌రెడ్డి తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. విజయకుమార్‌రెడ్డికి కాలు విరిగింది. పవన్‌కు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు టాటా సుమోలో గోరంట్ల ఆస్పత్రికి తరలించారు. మార్గం మధ్యలో విశ్వనాథ్‌రెడ్డి మృతి చెందాడు. విజయ్‌కుమార్‌రెడ్డిని హిందూపురం ఆస్పత్రికి తరలించారు. మండలంలోని బూదిలి గ్రామసమీపంలోని పుట్టపర్తి– బెంగుళూరు ప్రధాన రహదారిలో చిలమత్తూరు మండలం సోమఘట్టకు చెందిన లక్ష్మమ్మ(65) అనే వృద్ధురాలిని కారు ఢీకొనింది. గాయపడిన ఆమెను హిందూపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
మల్లాపురం సమీపంలో ఒకరు
రాయదుర్గం : మండలంలోని మల్లాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి శనివారం మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు .... బళ్లారికి చెందిన ప్రసాద్æ(40), రాము అనే వ్యక్తులు శ్రావణ శనివారం సందర్భంగా రాయదుర్గం మండలంలోని మల్లాపురం విప్రమలై నవ నరసింహస్వామి దర్శనానికి ద్విచక్రవాహనంపై వస్తున్నారు. మల్లాపురం గ్రామ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ప్రసాద్ తీవ్రంగా, రాము స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు రాయదుర్గం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్ ఆసుపత్రికి తరలించారు. బళ్లారిలో చికిత్స పొందుతూ ప్రసాద్ మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చే స్తున్నారు.