నూజివీడు(కృష్ణాజిల్లా): కృష్ణాజిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మత పరమైన కార్యక్రమంలో భాగంగా.. జెండాలు కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ముగ్గురు యువకులు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణాజిల్లా ఎం.ఆర్ అప్పారావు కాలనీలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మహ్మద్ ప్రవక్త(సఅసం) పుట్టిన రోజు(మిలాదున్ నబి) సందర్భంగా ఎం. ఆర్ అప్పారావు కాలనీలో వేడుకలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా కాలనీని విద్యుద్దీపాలు, జెండాలతో అలంకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాలనీకి చెందిన షేక్ తన్వీర్, షేక్ ఇస్మాయిల్, షేక్ కాలేషాలు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులని నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
నూజివీడులో విషాదం.. ముగ్గురి మృతి
Published Mon, Dec 12 2016 8:27 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM
Advertisement
Advertisement