ఖమ్మం: ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం గూడూరు క్యాంపు తండాకు చెందిన ముగ్గురు యువకులు గోదావరి పుష్కరాల కోసం ఒకే బైక్‌పై భద్రాచలం వెళుతుండగా..తుఫాను వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ఇద్దరిని గుర్తించారు. వారిలో బాలావత్ సైదులు, రామావత్ వెంకటేష్ ఉన్నారు. మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.