ఆదిలాబాద్: వినాయక నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. ఊరేగింపుగా వినాయక నిమజ్జనానికి వెళుతున్న సమూహానికి కరెంట్ వైర్లు తగిలి షాక్ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పిప్రి గ్రామంలో చోటుచేసుకుంది.
కరెంట్ షాక్ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదే ఘటనలో తీవ్రగాయాలైన మరోవ్యక్తికి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.