ముగ్గురు యువకులు ఆదివారం ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు.
కర్నూలు: బేతంచర్ల మండలం గోరుమాన్‌కొండకు చెందిన ముగ్గురు యువకులు ఆదివారం ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. గ్రామ సమీపంలోని మైనింగ్ గుంటల్లో ఈతకొట్టడానికి వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కిషోర్(20), సురేందర్(16), సాయిసుబ్రహ్మణ్యం(16) అనే ముగ్గురు యువకులు మరణించారు. గ్రామస్తులు గుంట నుంచి మృతదేహాలను వెలికితీశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.