ఇల్లెందు : ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలంలోని నామాలపాడు వాగులో ఈతకెళ్లిన ఈనేష్(24), నాగార్జున్(24) అనే ఇద్దరు ఇంజనీరింగ్ చదివిన యువకులు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. ఆటవిడుపు కోసం హైదరాబాద్ నుంచి ఇల్లెందుకు వెళ్లిన ఆరుగురు యువకులు ఆదివారం ముకుందాపురం గ్రామంలో కల్లు తాగారు. అనంతరం ఈతకొడదామని దగ్గరలోని నామాలపాడు వాగులోకి దిగారు.
కింద పాచి ఉండటంతో జారిపడి మునిగిపోయి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతుల్లో ఈనేష్‌ది ప్రకాశం జిల్లా కాగా, నాగార్జునది తెనాలి అయినప్పటికీ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం జాబ్ వేటలో ఉన్నట్లు సమాచారం.