ఏలూరు: వేగంగా వెళ్తున్న వాహనం రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామ శివారులో బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగింది. నల్లగొండ జిల్లా నుంచి కైకరం వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం గ్రామ శివారుకు చేరుకోగానే.. రోడ్డు పక్కన నిలిచి ఉంచిన లారీని ఢీకొట్టింది.
టాటా ఏస్‌లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు.