kaikaram
-
దిన‘ధన’ గండం
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : పెద్దనోట్లు రద్దు అయిన నెల తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పులేదు. ప్రజల కష్టాలు తగ్గలేదు. సామాన్యుల పరిస్థితి దినదినగండంగా మారింది. బ్యాంకుల ముందు నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అధికశాతం ఏటీఎంలు మూతపడే ఉంటున్నాయి. ఫలితంగా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల వారు రోడ్డెక్కి ఆందోళనకు దిగాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా గురువారం యలమంచిలి, కైకరం బ్యాంకుల్లో నగదు నిల్వలు నిండుకోవడంతో ఖాతాదారులు ఆందోళనకు దిగారు. కైకరం స్టేట్ బ్యాంక్లో రెండురోజు గురువారం కూడా డబ్బులు లేవనే బోర్డు పెట్టడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్త ం చేసి రోడ్డు ఎక్కారు. మేనేజర్గానీ, సిబ్బందిగానీ స్పష్టమైన సమాధానం చెప్పలేకపోవటంతో ఖాతాదారులు ఆగ్రహంతో జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. రాస్తారోకో వల్ల ట్రాఫిక్ జామ్ కావడంతో ఉంగుటూరు తహసీల్దార్, చేబ్రోలు ఎస్ఐలు వచ్చి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. బ్యాంకులో డబ్బులు ఉన్నా తీసుకోవడానికి బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనులకు డబ్బులు ఇవ్వలేకపోవడంతో వారు పనికి రావడానికి ఇష్టపడడం లేదని, ఇలా అయితే రబీలో పంట వేసినట్లేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘ధాన్యం డబ్బులు బ్యాంకులో పడ్డాయి. మా డబ్బులు తీసుకోవడానికి కూడా వీలులేకుండా పోయింది. బాకీదారులు మా ఇళ్ల చుట్టూతిరుగుతున్నారు’ అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల కోసం తామూ పనులు మానుకుని పెద్ద సంఖ్యలో బ్యాంకుల ముందు క్యూ కట్టాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎనిమిదో తేదీ వచ్చినా పింఛను సొమ్ములు అందకపోవడంతో వృద్ధులు ఆందోళ చెందుతున్నారు. పింఛను పడని వారికి ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా వారికి సరైన సమాచారం లేక ఆందోళనగా బ్యాంకులు, పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదివరకు ఒకటో తేదీనే పింఛ¯ŒS వచ్చేది. ఇప్పుడు ఎనిమిదో తేదీకి కూడా రాకపోవడంతో అసలు వస్తుందా రాదా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు జిల్లాలో పెద్ద ఎత్తున దొంగనోట్లు చలామణి అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నోట్ల రద్దుతో చాలా వరకు పెద్ద నోట్లు బ్యాంక్ ఖాతాల్లోకి చేరుకోగా.. ప్రస్తుతం చలామణీలో ఉన్న దొంగనోట్లును కొంతమంది వ్యక్తులు కార్మికులు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులకు గుట్టుచప్పుడు కాకుండా వారి కూలీ డబ్బులు కింద చలామణీలో పెడుతున్నట్లు పలువురు చెబుతున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి రేష¯ŒSషాపులను మినీ బ్యాంకులుగా మారుస్తున్నామని రేష¯ŒS డీలర్లను బ్యాంకు కరస్పాండెంట్లుగా మార్చి బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ నిర్వహింప చేస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చేసిన ప్రకటన ఇంతవరకూ అమలులోకి రాలేదు. -
పచ్చ నేతల 'కెవ్వు కేక'
అశ్లీల నృత్యాలతో హల్చల్ డ్యాన్సర్లతో తాగి తందనాలు ఏలూరు: అధికారం దన్నుతో అడ్డగోలు సంపాదన.. అక్రమ వసూళ్లు తెచ్చిపెట్టిన నడమంత్రపు సిరితో హల్చల్ చేస్తున్న టీడీపీ నేతల్లో కొందరు ఉంగుటూరు మండలం కైకరం ప్రాంతంలో అశ్లీలనృత్యాలతో అంటకాగారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పూర్వాపరాలిలా ఉన్నాయి. ఉంగుటూరు, కైకరం ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతల్లో కొందరు ఇటీవల విచ్చలవిడిగా ఓ పార్టీ చేసుకుందామనుకున్నారు. అనుకున్నదే తడవుగా మందు, విందు సిద్ధం చేసుకున్నారు. ఈ రెండు ఎప్పుడూ ఉండేవే.. మహిళా డ్యాన్సర్లను తీసుకొచ్చి చెలరేగిపోదామని ఓ టీడీపీ నేత సలహా ఇచ్చాడు. అంతే తూర్పుగోదావరి జిల్లా నుంచి ముగ్గురు మహిళా డ్యాన్సర్లను తీసుకొచ్చారు. కైకరంలోని ఓ అట్టల ఫ్యాక్టరీలో రాత్రి పూట రికార్డింగ్ డ్యాన్సుల మోత మోగించారు. అశ్లీల నృత్యాలతో బరితెగించారు. బయటి వ్యక్తులు ఎవరూ రాకుండా కేవలం ఎంపిక చేసిన ఓ 30 మంది కార్యకర్తలను మాత్రమే లోనికి అనుమతించారు. తెలుగు యువత నాయకుడి ఆధ్వర్యంలో జరిగిన ఈ మేళాకు టీడీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి, మాజీ సర్పంచ్, ఓ ప్రజాప్రతినిధి సోదరుడు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. రాత్రి 10 గంటలకు మొదలైన మేళాను తెల్లవార్లూ కొనసాగించారు. ఆ రోజు జరిగిన డ్యాన్సుల మేళాను చిత్రీకరించిన ఓ ఔత్సాహికుడు ఆ వీడియోను ‘సాక్షి’కి పంపించడంతో టీడీపీ నేతల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఆ మధ్యన ఏలూరులో టీడీపీ కార్పొరేటర్లు ‘ఆట కావాలా.. పాట కావాలా’ అంటూ చిందులేసిన వైనాన్ని జనం మరచిపోకముందే కైకరంలో ‘పచ్చ’నేతలు చేసిన అశ్లీల నృత్యాలు ఉదంతం వారి దిగజారుడు మనస్తత్వాలను బయటపెట్టాయి. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి.
-
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
ఏలూరు: వేగంగా వెళ్తున్న వాహనం రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామ శివారులో బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగింది. నల్లగొండ జిల్లా నుంచి కైకరం వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం గ్రామ శివారుకు చేరుకోగానే.. రోడ్డు పక్కన నిలిచి ఉంచిన లారీని ఢీకొట్టింది. టాటా ఏస్లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు నల్లగొండ జిల్లా హుజూర్నగర్కు చెందిన వారిగా గుర్తించారు. -
''రుణమాఫీకి ఆర్బీఐ అంగీకరించలేదు''