గోడ కూలి ఇద్దరు మహిళల సహా ఓ చిన్నారి మృతి | Three die in Hyderabad building collapse | Sakshi
Sakshi News home page

గోడ కూలి ఇద్దరు మహిళల సహా ఓ చిన్నారి మృతి

Published Thu, Oct 24 2013 9:01 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

గోడ కూలి  ఇద్దరు మహిళల సహా ఓ చిన్నారి మృతి - Sakshi

గోడ కూలి ఇద్దరు మహిళల సహా ఓ చిన్నారి మృతి

హైదరాబాద్ : హైదరాబాద్‌లో భారీ వర్షాలు ముగ్గురిని బలిగొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఓ చిన్నారి దుర్మరణం చెందారు. మసబ్ ట్యాంక్ విజయనగరం కాలనీలో ఈ దుర్ఘటన జరిగింది. స్థానికులు ఇప్పటి వరకూ రెండు మృతదేహాలను వెలికి తీశారు. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు.

మృతులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన పార్వతి, లక్ష్మి, జనార్థన్ గా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తరం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జీహెచ్ఎంసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను వెలికి తీసే ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా రెండు నెలల క్రితం  మౌలాలీలోని అల్వాల్ లో కూడా భవనం ప్రహరీ గోడ కూలి పక్కనే నివాసం ఉంటున్న రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement