
సాక్షి,జియ్యమ్మవలస( విజయనగరం): చిత్రంలో కరోనా వ్యాక్సిన్ వేస్తున్నది జియ్యమ్మవలస మండలంలోని రావాడ–రామభద్రపురం పీహెచ్‌సీలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న అన్నపూర్ణ. ఆమె ప్రస్తుతం 8 నెలల నిండు గర్భిణి. అయితేనేం... కరోనా కట్టడికి ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నారు. సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.
కరోనా విధులకు వెళ్లొద్దని వైద్యులు వారిస్తున్నా.. తన పని తాను చేసుకుపోతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సాధారణ రోగులతో పాటు కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. కరోనా సమయంలో రిస్క్ ఎందుకంటూ ఆమెను ప్రశ్నించిన వారికి.. రోగులకు సేవలందించడంలోనే సంతృప్తి ఉంటుందని చిరునవ్వుతో సమాధానస్తున్నారు. కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు అండగా ఉండటంతో సేవలు సాఫీగా అందించగలుగుతున్నట్టు చెప్పారు.
( చదవండి: కరోనాను జయించిన నవజాత శిశువు )
Comments
Please login to add a commentAdd a comment