jiyyammavalasa
-
8 నెలల నిండు గర్భిణి.. అయితేనేం కరోనా కట్టడికి కదిలింది
సాక్షి,జియ్యమ్మవలస( విజయనగరం): చిత్రంలో కరోనా వ్యాక్సిన్ వేస్తున్నది జియ్యమ్మవలస మండలంలోని రావాడ–రామభద్రపురం పీహెచ్సీలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న అన్నపూర్ణ. ఆమె ప్రస్తుతం 8 నెలల నిండు గర్భిణి. అయితేనేం... కరోనా కట్టడికి ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నారు. సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. కరోనా విధులకు వెళ్లొద్దని వైద్యులు వారిస్తున్నా.. తన పని తాను చేసుకుపోతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సాధారణ రోగులతో పాటు కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. కరోనా సమయంలో రిస్క్ ఎందుకంటూ ఆమెను ప్రశ్నించిన వారికి.. రోగులకు సేవలందించడంలోనే సంతృప్తి ఉంటుందని చిరునవ్వుతో సమాధానస్తున్నారు. కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు అండగా ఉండటంతో సేవలు సాఫీగా అందించగలుగుతున్నట్టు చెప్పారు. ( చదవండి: కరోనాను జయించిన నవజాత శిశువు ) -
వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
వైఎస్సార్సీపీ రోజురోజుకూ బలోపేతమవుతోంది. ప్రతి గ్రామం నుంచి నాయకులు... స్థానికులు ఇతర పార్టీల మద్దతుదారులు విరివిగా వచ్చి చేరుతున్నారు. కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు నాయకులు పెద్ద సంఖ్యలో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి సమక్షంలో వైఎస్సార్సీపీలో శుక్రవారం చేరారు. స్థానిక ఎన్నికల ముందు ఈ చేరికలు మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి. జియ్మమ్మవలస: వైఎస్సార్ సీపీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖమంత్రి పాముల పుష్ఫశ్రీవాణి, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అన్నారు. మండలంలోని గవరమ్మపేట, వెంకటరాజపురం, జియ్యమ్మవలస, పొట్టుదొరవలస గ్రామాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి చినమేరంగిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. గవరమ్మపేట నుంచి 95 కుటుంబాలు, వెంకటరాజపురం నుంచి 40 కుటుంబాలు, జియ్యమ్మవలస పంచాయతీ పొట్టుదొరవలస నుంచి 20 కుటుంబాలు, జియ్యమ్మవలస నుంచి 60 కుటుంబాలవారు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీలో చేరిన నాయకులు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు వెల్లడించారు. అమ్మ ఒడి, రైతుభరోసా, ఆరోగ్యశ్రీ తదితర మంచి పథకాలతో పేదలను ఆదుకుంటున్నారని తెలిపారు. భవిష్యత్‌లో టీడీపీ పూర్తిగా ఖాళీ అవుతుందన్నారు. డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ జగనన్న చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని, ఇందులో భాగంగానే టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారన్నారు. పరీక్షిత్‌రాజు మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరూ స్థానిక సంస్థల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో వెంకటరాజపురం గ్రామానికి చెందిన మర్రాపు లక్ష్మునాయుడు, కర్రి సీతం నాయుడు, బొత్స గోవిందరావు, శ్రీరామాయూత్ సభ్యులు, గవరమ్మపేట గ్రామం నుంచి డీలర్ రౌతు అప్పలనాయుడు, కె.చంద్రశేఖర్, గవరమ్మపేట యువత ఉన్నారు. అలాగే, జియ్యమ్మవలస, పొట్టుదొరవలస నుంచి దత్తి శంకరరావు, బేత అప్పలనాయుడు, బొడ్డుపల్లి శ్రీనివాసరావు, తటిపిడకల వెంకటనాయుడు, రాయల సింహాచలం, గర్భాన చిన్న, చిలకల తిరుపతి, రంభ సత్యనారాయణ, రంభ శ్రీరాములు తదితరులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మూడడ్ల గౌరీశంకరరావు, మండల ఎన్నికల సమన్వయకర్త బొంగు సురేష్, ఆర్నిపల్లి వెంకటనాయుడు, పెద్దింటి శంకరరావు, మర్రాపు చినతాతబాబు, జోగి సురేష్ పాల్గొన్నారు. -
కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..
సాక్షి, జియ్యమ్మవలస(శ్రీకాకుళం) : మండలంలోని గవరమ్మపేట వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో మహిళ మంగళవారం మృతి చెందింది. ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ తరలించారు.ఎస్ఐ పొదిలాపు నారాయణరావు తెలిపిన వివరాల ప్రకారం పార్వతీపురం నుంచి జయ్యమ్మవలస వస్తున్న ఆటోను గుమ్మలక్ష్మీపురం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు గవరమ్మపేట మలుపు వద్ద బలంగా ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి 108లో తరలించారు. తరలిస్తున్న మార్గంలోనే రామినాయుడువలసకు చెందిన మరడాన సత్యవతి(55) మృతి చెందింది. చింతల భవాని, బొడ్డాపు అంజలీదేవి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. తెంటు దాలినాయుడు, తెంటు కార్తికేయ, తెంటు రామలక్ష్మి తీవ్రంగా గాయపడి పార్వతీపురంలోనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఎస్ఐ తెలిపారు. తెంటు మురళి పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో మరడాన సత్యవతి, చింతల భవాని, బొడ్డాపు అంజలీదేవి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ నారాయణరావు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన వారు... రామినాయుడువలసకు చెందిన మరడాన సత్యవతికి ఇద్దరు మగపిల్లలు, ఒక అమ్మాయి ఉన్నారు. వారందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. రెండవ కుమారుడు మురళితో పాటు తల్లి సత్యవతి కలసి రాయగడలో ఉన్న కుమార్తె భవాని వద్దకు వెళ్లి తిరిగి ఆటోలో రామినాయుడువలస వస్తుండగా కూతవేటు దూరంలో ఉన్న ఇంటికి చేరతారనగా గవరమ్మపేట వద్ద ప్రమాదం జరగడంతో సత్యవతి మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కళ్లెదుటే తల్లి మరణించడంతో పాటు చెల్లి భవాని పరిస్థితి విషమించడంతో మురళి కన్నీటి పర్యంతమవుతున్నాడు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
బావమరుదులు, కానిస్టేబుల్ కొట్టడమే కారణం ? పోలీసులను నిలదీసిన గ్రామస్తులు జియ్యమ్మవలస : మండలంలోని అంకవరం గ్రామానికి చెందిన ఒకరు అనుమానాస్పదంగా మృతి చెందారు. స్థానికులు, మృతుడి తండ్రి తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చందాపు అప్పలనాయుడు (40)కి వీరఘట్టాం మండలం తూడి గ్రామానికి చెందిన అమ్మాయితో పదహారు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గొడవ జరిగిన ప్రతిసారీ అమ్మారుు తన కుటుంబ సభ్యులను తీసుకురావడం, వారు వచ్చి అప్పలనాయుడును కొట్టడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఇటీవల కూడా భార్యభర్తల మధ్య గొడవ జరగ్గా అమ్మారుు తన సోదరులను రప్పించింది. వారు జియ్యమ్మవలస పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌తో కలిసి శుక్రవారం గ్రామానికి వచ్చి అప్పలనాయుడును చావబాదారు. అక్కడితో ఆగకుండా కొట్టుకుంటూ జియ్యమ్మవలస పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో మృతుని భార్య అమ్మాయి తన మామ సింహాద్రిని లేపి మీ అబ్బారుు చలనం లేకుండా పడిఉన్నాడని తెలిపింది. వెంటనే సింహాద్రి వచ్చి చూసే సరికి అప్పలనాయుడు ఇంట్లో విగతజీవిగా పడిఉన్నాడు. పోలీసులు, అమ్మారుు సోదరులు కొట్టడం వల్లే తన కుమారుడు చనిపోయూడని సింహాద్రి ఆరోపిస్తున్నాడు. తన కుమారుడు చనిపోరుునా ఇంతవరకు బావమరుదులు, అత్త,మామాలు ఎవ్వరూ రాకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించాడు. ఇదే విషయమై ఎస్సై సాంబశివరావును వివరణ కోరగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయన్న ఫిర్యాదు మేరకు అప్పలనాయుడును స్టేషన్‌కు తీసుకువచ్చి మందలించి, తర్వాత వదిలేశామన్నారు. ఆయన ఎలా చనిపోయిందీ తెలియదని చెప్పారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలున్నారు. పోలీసుల తీరు వల్లే అప్పలనాయుడు చనిపోయూడని ఆరోపిస్తూ గ్రామస్తులందరూ పోలీసులను నిలదీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో ఒకరి మృతి
జియ్యమ్మవలస: మండలంలోని బిత్రపాడు పంచాయతీ సీమనాయుడువలస గ్రామానికి చెందిన బెల్లాన వెంకటనాయుడు (38) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పశువుల మేతకు గడ్డి తీసుకురావడానికి బుధవారం సాయంత్రం పొలానికి వెళ్లి, తిరిగి వస్తుండగా విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భార్య హేమలత, పిల్లలు లోకేష్, గాయత్రి ఉన్నారు. నాయుడు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పార్వతీపురం ఏరియూ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై పాపారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వరుడు మూడడుగులు.. వధువు మూడున్నర!
జియ్యమ్మవలస: విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని బిత్రపాడు గ్రామంలో జరిగిన మూడడుగుల అబ్బాయి, మూడున్నర అడుగుల అమ్మాయి వివాహాన్ని అందరూ ఆసక్తిగా తిలకించారు. గ్రామానికి చెందిన కర్ర గంగరాజు వయస్సు 28 సంవత్సరాలు, 3 అడుగుల పొడవు ఉంటాడు. ఇతనికి తగిన అమ్మాయి కోసం చాలా సంబంధాలు చూశారు. చివరకు ఒడిశా రాష్ట్రం రాయ్‌గఢ్ జిల్లాకు చెందిన దాసరి వీరభద్రుడు, లక్ష్మి దంపతుల కనిష్టపుత్రిక మూడున్నర అడుగుల పొడవున్న సుజాత(21)తో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. వీరిద్దరికీ సాలూరుకు చెందిన రెవరెండ్ జోషెప్ క్రిష్టియన్ బుధవారం క్రైస్తవ సంప్రదాయ ప్రకారం వివాహం జరిపించారు. చిన్న పిల్లల్లా కనిపిస్తుండడంతో వీరి వివాహాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. -
ఫలించని అన్వేష్ణ
జియ్యమ్మవలస: రావాడ వట్టిగెడ్డలో సోమవారం గల్లంతైన కురుపాం విద్యార్థి అన్వేష్ కోసం మూడు రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ కానరాలేదు. జాలర్లు అదేపనిగా వెతుకుతున్నా జాడ తెలియరాకపోవడంతో బుధవారం ఉదయాన్నే జిల్లా అదనపు సంయుక్త కలెక్టరు యూసీజీ నాగేశ్వరరావు,పార్వతీపురం ఇన్చార్జ్ సబ్‌కలెక్టరు ఆర్.శ్రీలక్ష్మి ,పార్వతీపురం ఏఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చేయవలసిన ప్రయత్నాలు చేశామని, 15 అడుగుల లోతు వరకు మాత్రమే వెళ్లగలమని, జాలర్లు,అగ్నిమాపక సిబ్బంది,గజ ఈతగాళ్లు చెప్పారు. వట్టిగెడ్డలో 35 అడుగుల లోతులో నీరు ఉండడంతో లోపలకు వెళ్లలేమని ఈతగాళ్లు చెప్పడంతో చేసేది లేక విషయాన్ని కలెక్టరు ఎం.ఎం.నాయక్‌కు తెలియజేసి నేవీ బృందాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. నేవీ బృందం సాయంత్రానికి వ స్తుందని అధికారులకు సమాచారం వచ్చింది కానీ సాయంత్రం 5 గంటల వరకు ఆ బృందం రాలేదు. బుధవారం గాలింపు చర్యల్లో ఇరిగేషన్ ఈఈ జి.వి.రమణ,అసిస్టెంట్ డెరైక్టరు అఫ్ ఫిషరీష్ ఫణి ప్రకాశ్,ఫైర్ ఆఫీసరు కేవీటీ ప్రసాదరావు, సీఐ వి.చంద్రశేఖర్,చినమేరంగి,జియ్యమ్మవలస ఎస్సైలు పప్పల పాపారావు, ఎ.హరికృష్ణ, గుమ్మలక్ష్మీపురం ఫైర్ ఆఫీసరు ఎ.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
రెండోరోజూ దొరకని అన్వేష్ ఆచూకీ
జియ్యమ్మవలస:మండలంలోని రావాడ వట్టిగెడ్డలో సోమవారం గల్లంతైన విద్యార్థి జి.అన్వేష్ ఆచూకీ రెండోరోజూ లభించలేదు. జాలర్లతో వెతికించినా తమ కుమారుడి ఆచూకీ దొరకక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.కురుపాం మండల కేంద్రంలో శోభలతాదేవి కాలనీకి చెందిన అన్వేష్ అదే కాలనీకి చెందిన స్నేహితులతో వట్టిగెడ్డలో సోమవారం ఈతకొట్టి గల్లంతైన విషయం విదితమే. సోమవారం సాయంత్రం చీకటి పడినంత వరకు ఈతగాళ్లతో వెతికించినా అన్వేష్ ఆచూకీ దొరకక పోవడంతో మంగళవారం కూడా రావాడలో చేపలు పట్టే జాలర్లతో పార్వతీపురం సీఐ వి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వెతికించారు.సాయంత్రం 5 గంటల వరకు వెతికినా ఆచూకీ దొరకలేదని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పప్పల పాపారావు తెలిపారు. అన్వేష్ ఆచూకీ దొరకక పోవడంతో తల్లిదండ్రులు, దగ్గర బంధువులు,స్నేహితులు రావాడ వట్టిగెడ్డకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దర్యాప్తు ముమ్మరం చేయాలి కురుపాం: రెండో రోజు గాలించినా అన్వేష్ ఆచూకీ తెలియరాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కురుపాం పోలీస్టేషన్‌కు చేరుకుని అన్వేష్ ఏమయ్యాడో వెంటనే విచారణ వేగవంతం చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న అన్వేష్ స్నేహితులను విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే అన్వేష్ ఆచూకీ లభించడం లేదని మండిపడ్డారు. దీంతో కురుపాం ఎస్సై ఎన్.అశోకచక్రవర్తి మాట్లాడుతూ సంఘటన తమ పరిదిలో జరగక పోయినా గల్లంతైన అన్వేష్ కురుపాం వాసి కావడంతో చినమేరంగి-కురుపాం పోలీసు సిబ్బంది దర్యాప్తు ముమ్మరంగానే నిర్వహిస్తున్నామని నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామని అన్వేష్ బంధువులు, తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. -
గిరిజన వర్సిటీ తరలింపు బాధాకరం
జియ్యమ్మవలస:జిల్లాకు మంజూరైన గిరిజన యూనివర్సిటీని పక్కజిల్లాకు తరలించడం బాధాకరమని కురుపా ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. మం డలంలోని చినమేరంగి గ్రామంలో తన స్వగృహంలో ఆమె శనివారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారని, ప్రస్తుతం మాట తప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వెనుకబడిన జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తామంటే ఈప్రాంత ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని ప్రస్తుతం తరలించడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. జిల్లా నుంచి ఎక్కువ మంది అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారని వారంతా పట్టించుకోక పోవడం వింతగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని మాటలే తప్ప చేతలు లేవన్నారు. ఇప్పటికైనా ఎన్నికల హమీలను నెరవేర్చి గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఈ జిల్లాలోనే స్థాపించాలని డిమాండ్ చేశారు. అందుకు అధికార పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని హితవు పలికారు. నాయకులకు బుద్ధి చెబుతాం: గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు విజయనగరం కంటోన్మెంట్: జిల్లాకు మంజూరైన గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన నాయకులకు గట్టిగా బుద్ధి చెబుతామని ఏపీ గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్ సురేష్, కె నాగేశ్వరరావులు ఒక ప్రకటనలో హెచ్చరించారు. గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి విశాఖకు తరలించే ప్రయత్నాలు చేయడం అన్యాయమని వాపోయారు. ఎంతో వెనుకబడ్డ ఈ జిల్లా గిరిజన యూనివర్సిటీ రాకతో అభివృద్ధి చెందుతుందని ఆశించిన వారికి తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని తరగతులకు చెందిన విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో చదువుతుంటే గిరిజనులు మాత్రం ప్రాథమిక విద్యకు కూడా నోచుకోకుండా ఇక్కడే గిరిగీసినట్టుండిపోతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. గిరిజనులు సొంత కాళ్ల మీద నిలబడడానికి ఉన్నత విద్యలు అవసరమని, అందుకు ఈ గిరిజన విశ్వవిద్యాలయం వస్తే ఎంతో అనుకూలంగా ఉండేదన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం తరలింపును జీర్ణించుకోలేకపోతున్నామని అందుకోసం ఎన్ని పోరాటాలైనా చేస్తామని స్పష్టం చేశారు. వర్సిటీ తరలింపు ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోకపోతే విశాల ప్రజా ఉద్యమాన్ని చేపడతామని పేర్కొన్నారు. ఇందుకోసం త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామన్నారు. -
అమ్మను చూడాలి...నాన్నతో ఆడాలి...!
మక్కువ: మండలంలోని గైశీల శోక సంద్రంలా మారింది. ఎటువైపు చూసినా రోదనలు వేదనలతో కన్నీటి లోకంగా మారిపోయింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు భవన ప్రమాదంలో చనిపోయాడని తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు ఆపడం ఎవరి తరం కావడం లేదు. కూతురు కూడా అసువులు బాసిందని తెలిసి ఆ అమ్మానాన్నల రోదన ఆగడం లేదు. రెండురోజులుగా వారు భవన ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం ఎదురుచూస్తున్నారు. కన్నబిడ్డలపై ఆశలు వదులుకోలేక బతికి వస్తారేమోనని ఆశగా నిద్రాహారాలు మాని మరీ ఎదురుచూస్తున్నారు. కొడుకు వెంపడాపు శంకరరావు మృతిచెందాడని తెలుసుకున్న తల్లి నారాయణమ్మ, తండ్రి అప్పలనాయుడులు భోరున విలపిస్తున్నారు. కూతురు సరస్వతి కూడా చనిపోయింది. అలాగే భ ర్త మృతి చెందడంతో అతని భార్య దుర్గ రోదనను ఎవరూ ఆపలేకపోతున్నారు. ఇప్పటికే గ్రామం నుంచి పలువురు ప్రమాద స్థలానికి వెళ్లారు. ఆస్పత్రిలో ఉన్నవారిలో తమ వారిని గుర్తిస్తారని ఇక్కడి వారు ఆశగా ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు గైశీల గ్రామానికి చెందిన వెంపడాపు శంకరరావు మృతి చెందడంతో ఊహ కూడా తెలియని ఇద్దరు కుమారులు మూడేళ్ల నిఖిల్, 8 నెలలు హర్షవర్ధన్‌ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అలాగే మజ్జి సరస్వతి భవన శిథిలాల్లో చిక్కుకొని మూడో రోజు గడిచినా ఇంతవరకు ఆమె ఆచూకీ తెలియలేదు. దీంతో ఆమె పిల్లలు కిశోర్, కార్తీక్‌లు బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. అదే గ్రామానికి చెందిన రాయిపిల్లి సతీష్ గాయాలపాలై ఆస్పత్రిలో ఉండగా, అతని భార్య ఆచూకీ తెలియకపోవడంతో పిల్లలు చందూ, శ్వేతాలు అమ్మా,నాన్నలు కావాలంటూ రోదిస్తున్నారు. జియ్యమ్మవలస: మండలంలోని ఇటిక పంచాయతీ నీలమాంబపురం గ్రామానికి చెందిన వారు చెన్నై భవన ప్రమాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. చనిపోయిన వారి మృతదేహాలు ఇప్పటివరకు రాకపోవడంతో సంబంధిత కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. శనివారం జరిగిన ప్రమాదంలో గ్రామానికి చెందిన ముదిలి రామలక్ష్మి, మర్రాపు దమయంతి మృతదేహాలు లభ్యమవ్వగా మిగిలిన ముగ్గురు మర్రాపు వెంకటనాయుడు, తిరుపతినాయుడు, ముదిలి చిన్నంనాయుడుల ఆచూకీ తెలియక పోవడంతో వారి కుటుంబ సభ్యులు రెండు రోజుల నుండి తిండీతిప్పలు మాని రోదిస్తూ కూర్చుకున్నారు. చెన్నై నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో వీరు తమ వారు మళ్లీ వస్తారేమోనని ఆశగా ఉన్నారు. తండ్రి కోసం... శిథిలాల కింద చిక్కుకున్న మర్రాపు తిరుపతి నాయుడు ఆచూకీ ఇంతవరకు తెలియకపోవడంతో ఆయన కుమారుడు పోలినాయుడు ఆందోళన చెందుతున్నాడు. పోలినాయుడు 10 వ తరగతి చదువు చున్నాడు. తండ్రి భవన ప్రమాదంలో చిక్కుకున్నాడని తెలిసి బాలుడు విలవిలలాడిపోతున్నాడు. అక్క గర్భిణి కావడంతో అమ్మ మంగమ్మ చూడడానికి వచ్చిందని లేకుంటే అమ్మ కూడా ప్రమాదంలో చిక్కుకుని ఉండేదని తెలిపాడు. పై చదువులు చదివించడానికి... ప్రమాదంలో చిక్కుకుని ఆచూకీ తెలియకుండా పోయిన మర్రాపు వెంకటనాయుడు కోసం ఆయన కుమారుడు జయంత్ పరితపిస్తున్నాడు. జయంత్‌ను ఉన్నత చదువులు చదివించడానికి వెంకటనాయుడు కొడుకును రావివలస వసతి గృహంలో విడిచిపెట్టి భార్య సరోజనమ్మ, కుమార్తె దమయంతిని తీసుకొని చెన్నై వెళ్లారు. అయితే ఈ ప్రమాదంలో వెంకటనాయుడుతోపాటు దమయంతి కూడా బలయ్యారు. తల్లి సరోజనమ్మ మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకుంది. కళ్లెదుటే భర్త, కూతురు విగత జీవులుగా మారడంతో ఆమె వేదన వర్ణానాతీతం. నాన్న, అక్క చనిపోవడంతో జయంత్ బిత్తర చూపులతో కనిపిస్తున్నాడు. పిల్లలను ఇంటి వద్ద ఉంచి... పిల్లల భవిష్యత్ కోసం నాలుగు రాళ్లు సంపాదిద్దామని చిన్నారులను నానమ్మ వద్ద ఉంచి ముదిలి వెంకటరమణ, రామలక్ష్మి చెన్నై వెళ్లారు. కానీ ప్రమాదంలో తల్లి శవమై తేలింది. వెంకటరమణ మాత్రం ఏడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. తల్లి చనిపోవడంతో దివ్య(8), రాణి(10)ల పరిస్థితి అగమ్యంగా మారింది. మా నాన్న మరి రారా..? ఇద్దరు ఆడపిల్లలు... మహాలకు్ష్మల్లా కళగా ఉన్నారు. కానీ ఆ కళను చూసే భాగ్యం తండ్రికి లేకుండా పో యిం ది. కె.కృష్ణాపురం గ్రామానికి చెందిన సిరిపురపు రాము... భార్య లక్ష్మి పిల్లలు ఏడేళ్ల వేదశ్రీ, ఐదేళ్ల ఐశ్వర్యలను అనాథలుగా వదిలేసి అనంత లోకాలకు వెళ్లిపొయారు. ఆ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పిల్లలు చదువుతున్నారు. పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలని రాము ఎంతో ఆశపడ్డారు. కానీ దేవుడు అంతలోనే ఆయనను పిల్లలకు దూరం చేశాడు.