విద్యుదాఘాతంతో ఒకరి మృతి | One killed in power shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో ఒకరి మృతి

Published Wed, Mar 16 2016 11:38 PM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

One killed in power shock

 జియ్యమ్మవలస: మండలంలోని బిత్రపాడు పంచాయతీ సీమనాయుడువలస గ్రామానికి చెందిన బెల్లాన వెంకటనాయుడు (38) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పశువుల మేతకు గడ్డి తీసుకురావడానికి బుధవారం సాయంత్రం పొలానికి వెళ్లి, తిరిగి వస్తుండగా విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భార్య హేమలత, పిల్లలు లోకేష్, గాయత్రి ఉన్నారు. నాయుడు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పార్వతీపురం ఏరియూ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై పాపారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement