వరుడు మూడడుగులు.. వధువు మూడున్నర! | Made for each other: 3feets and 3 feets half | Sakshi
Sakshi News home page

వరుడు మూడడుగులు.. వధువు మూడున్నర!

Published Thu, Aug 27 2015 8:29 AM | Last Updated on Fri, Jul 12 2019 3:15 PM

వరుడు మూడడుగులు..  వధువు మూడున్నర! - Sakshi

వరుడు మూడడుగులు.. వధువు మూడున్నర!

జియ్యమ్మవలస: విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని బిత్రపాడు గ్రామంలో జరిగిన మూడడుగుల అబ్బాయి, మూడున్నర అడుగుల అమ్మాయి వివాహాన్ని అందరూ ఆసక్తిగా తిలకించారు. గ్రామానికి  చెందిన కర్ర గంగరాజు వయస్సు 28 సంవత్సరాలు, 3 అడుగుల పొడవు ఉంటాడు. ఇతనికి తగిన అమ్మాయి కోసం చాలా సంబంధాలు చూశారు.
 
 చివరకు ఒడిశా రాష్ట్రం రాయ్‌గఢ్ జిల్లాకు చెందిన దాసరి వీరభద్రుడు, లక్ష్మి దంపతుల కనిష్టపుత్రిక మూడున్నర అడుగుల పొడవున్న సుజాత(21)తో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. వీరిద్దరికీ సాలూరుకు చెందిన రెవరెండ్ జోషెప్ క్రిష్టియన్ బుధవారం క్రైస్తవ సంప్రదాయ ప్రకారం వివాహం జరిపించారు. చిన్న పిల్లల్లా కనిపిస్తుండడంతో వీరి వివాహాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement