ANM Nurse
-
శభాష్ కవిత!
కళ్యాణదుర్గం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది. దాదాపు 35 శాఖలకు సంబంధించి 500 సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. పింఛన్ కావాలన్నా..రేషన్ కార్డు కావాలన్నా.. ఇంటి పట్టాలు కావాలన్నా.. తాగునీటి సరఫరా సమస్య ఉన్నా.. సివిల్ పనులకు సంబంధించిన పనులు ఉన్నా.. వైద్యం కానీ.. ఆరోగ్యం కానీ.. రెవెన్యూ కానీ.. భూముల సర్వేకానీ.. శిశు సంక్షేమం కానీ.. డెయిరీ కానీ, పౌల్ట్రీ రంగాల సేవలు కానీ.. తదితర సేవలకు సంబంధించి సచివాలయాల్లో అర్జీ పెట్టుకున్న గంటల వ్యవధిలోనే ఉద్యోగులు పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి సకాలంలో సచివాలయ ఏఎన్ఎం కాన్పు చేసి తల్లీబిడ్డ ప్రాణాలు కాపాడారు. ఆపదలో మేమున్నమంటూ.. : కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న కవిత అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. మంగళవారం ఉదయం కంబదూరు మండలం తిప్పేపల్లికి చెందిన గర్భిణి వినీతకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో కుటుంబసభ్యుల నుంచి సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడకు చేరుకుని గర్భిణిని కళ్యాణదుర్గం సీహెచ్‌సీకి తరలించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో నూతిమడుగు వద్దకు చేరుకోగానే గర్భిణికి నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో వాహనాన్ని పైలెట్ జనార్ధన్ రోడ్డు పక్కన ఆపేశాడు. అదే సమయంలో తిమ్మసముద్రం సచివాలయానికి విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఏఎన్ఎం కవిత అక్కడకు చేరుకున్నారు. ప్రసవ వేదనతో బాధపడుతున్న గర్భిణిని చూసి స్పందించిన ఆమె ఈఎంటీ బ్రహ్మయ్య సాయంతో వినీతకు ప్రసవం చేశారు. పండంటి ఆడబిడ్డకు వినీత జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను కళ్యాణదుర్గం సీహెచ్‌సీలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు సకాలంలో కాన్పు చేసి తల్లీబిడ్డ ప్రాణాలు కాపాడిన ఏఎన్ఎం కవితను అభినందించారు. ఏఎన్ఎం చూపిన చొరవపై కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, సత్వర సేవలు అందించేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. -
కేన్సర్‌తో పోరాడుతూ.. కరోనా విధులు
బోథ్: తనకు కేన్సర్ వచ్చినా లెక్కచేయకుండా.. కరోనా బాధితులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా బాధ్యతగా విధులు నిర్వహిస్తోంది ఆదిలాబాద్ జిల్లా బోథ్ సామాజిక ఆరోగ్య కేం ద్రంలోని ఏఎన్ఎం శారద. ఆమె ఇప్పటి వరకు బోథ్ సీహెచ్‌సీలో దాదాపు 3 వేల మందికి కరోనా టీకాలు వేశారు. కరోనా వేళ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పమే తనను బతికిస్తోందని శారద పే ర్కొంటున్నారు. 2020 జనవరిలో శారదకు లంగ్ కేన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అ యింది. ప్రస్తుతం వ్యాధి నాలుగో దశలో ఉందని వైద్యులు ధ్రువీకరించారు. హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. సెలవు రోజుల్లో మాత్రమే ఆమె ట్రీట్మెంట్కు వెళ్తున్నారు. కరోనా ఉధృ తి నేపథ్యంలో శారద విధులకు ఏనాడూ సెలవు పెట్టలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రసాద్ తెలిపారు. సేవాభావంతో విధులు నిర్వహిస్తున్న శారదను స్థానిక సీఐ నైలు, ఎస్సై రాజు అభినందించారు. చదవండి: ఎన్నికల విధుల్లో పాల్గొన్న టీచర్లకు కరోనా -
8 నెలల నిండు గర్భిణి.. అయితేనేం కరోనా కట్టడికి కదిలింది
సాక్షి,జియ్యమ్మవలస( విజయనగరం): చిత్రంలో కరోనా వ్యాక్సిన్ వేస్తున్నది జియ్యమ్మవలస మండలంలోని రావాడ–రామభద్రపురం పీహెచ్సీలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న అన్నపూర్ణ. ఆమె ప్రస్తుతం 8 నెలల నిండు గర్భిణి. అయితేనేం... కరోనా కట్టడికి ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నారు. సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. కరోనా విధులకు వెళ్లొద్దని వైద్యులు వారిస్తున్నా.. తన పని తాను చేసుకుపోతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సాధారణ రోగులతో పాటు కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. కరోనా సమయంలో రిస్క్ ఎందుకంటూ ఆమెను ప్రశ్నించిన వారికి.. రోగులకు సేవలందించడంలోనే సంతృప్తి ఉంటుందని చిరునవ్వుతో సమాధానస్తున్నారు. కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు అండగా ఉండటంతో సేవలు సాఫీగా అందించగలుగుతున్నట్టు చెప్పారు. ( చదవండి: కరోనాను జయించిన నవజాత శిశువు ) -
సలాం జ్ఞానేశ్వరి..అడవిలోకి 10 కి.మీ నడిచి మరీ..
మహాముత్తారం: ఆ ప్రాంతానికి వెళ్లేందుకు రహదారి లేదు. కాలినడకన వెళ్లడం కూడా కష్టమే. కారడివిలో ఎటునుంచి ఏ జంతువు మీద పడుతుందో కూడా తెలియదు. అయినా ఇవేమీ ఆమె విధి నిర్వహణకు అడ్డంకి కాలేదు. ఓ మహిళా ఏఎన్ఎం కాలినడకన పది కిలోమీటర్లు వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేసి శ్రమ కన్నా విధులే మిన్న అని నిరూపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని రేగులగూడెంలో రెండో ఏఎన్ఎంగా జ్ఞానేశ్వరి విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయగా, మిగిలిన పిల్లలను గుర్తించి చుక్కల మందు వేసేందుకు మంగళవారం జ్ఞానేశ్వరికి విధులు అప్పగించారు. ఈ మేరకు మద్దిమడుగు ప్రాంతానికి వెళ్లాల్సి ఉండగా, భర్తసహా ఎవరూ అందుబాటులో లేరు. దీంతో ఆమె ఒక్కరే కాలినడకన మద్దిమడుగు వెళ్లి అక్కడ మిగిలిపోయిన 35 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆలోగా పని ముగించుకుని వచ్చిన భర్త ఆమెను ద్విచక్ర వాహనంపై ఇంటికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వరిని వైద్య సిబ్బందితో పాటు గ్రామస్తులు అభినందించారు. -
ప్రాణం తీసిన వైద్యం
పెద్దవడుగూరు: వైద్యుల పర్యవేక్షణలో జరగాల్సిన ప్రసవాన్ని ఓ ఏఎన్ఎం చేయడంతో తల్లీ, బిడ్డ మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళితే... పెద్దవడుగూరు మండల పరిధిలోని భీమునిపల్లి గ్రామానికి చెందిన చిన్న కంబన్న, లక్ష్మమ్మల చిన్న కుమార్తె నాగేశ్వరమ్మను గత ఏడాది యాడికి మండలం కోన ఉప్పలపాడుకు చెందిన మద్దిలేటిస్వామికి ఇచ్చి వివాహం జరిపించారు. నాగేశ్వరమ్మ గర్భం దాల్చడంతో వారి కుటుంబ సభ్యులంతా ఎంతో సంతోషించారు. 5 నెలలు నిండగానే నాగేశ్వరమ్మ తల్లితండ్రుల ఇంటికి వచ్చింది. అప్పటి నుండి క్రిష్టిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటోంది. ఈనెల 10వ తేదీని డెలివరీ డేట్‌గా చెప్పారు. ఇందులో భాగంగానే శనివారం ఉదయం 11 గంటలకు ప్రసవం కోసం క్రిష్టిపాడు ఆస్పత్రికి వెళ్ళారు. అక్కడి వైద్య సిబ్బంది పరీక్షలు చేసి నొప్పులు రావడం కోసం మాత్ర ఇచ్చారు. రాత్రి 7 గంటల సమయంలో పురిటి నొప్పులు రావడంతో ఏఎన్ఎం జ్యోతి ప్రసవం చేసింది. 7:20 నిమిషాలకు నాగేశ్వరమ్మ మగ్గ బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని వెంటనే తాడిపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో నాగేశ్వరమ్మను ఆస్పత్రిలోనే ఉంచి బిడ్డను మాత్రం తాడిపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే బిడ్డ మృతి చెందాడని చెప్పడంతో వెనుతిరిగి వచ్చారు. అయితే అప్పటికే నాగేశ్వరమ్మకు అ«ధిక రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆమెను కూడా గుత్తికి తీసుకెళ్ళాలని వైద్యసిబ్బంది చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను గుత్తి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు నాగేశ్వరమ్మ పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పడంతో వారి కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరయ్యారు. ఏఎన్‌ఎంతోనే కాన్పులు డ్యూటీకి సక్రమంగా చేయని వైద్యుడు శ్రీనివాసరెడ్డి తన పబ్బంగడుపుకునేందుకు ఓ ఏఎన్ఎం చేతనే కాన్పులను చేయిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఎవరు కాన్పుకు వచ్చినా సరే ఈ వైద్యుడు అందుబాటులో ఉండడని స్థానిక సీపీఐ నాయకులు చెబుతున్నారు. పైగా ఏఎన్ఎంపై ఒత్తిడి తెచ్చి కాన్పులు చేయిస్తూ వస్తున్నాడని అంటున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ తల్లీ, బిడ్డ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయమే వైద్యుడి ప్రత్యక్షం నాగేశ్వరమ్మ ఆమె బిడ్డ మృతి చెందిన విషయం తెలుసుకున్న వైద్యుడు శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉదయమే ఆస్పత్రిలో ప్రత్యక్షం కావడం విశేషం. తల్లీ,బిడ్డ మృతికి కారణమైన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, సీపీఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వైద్యుడి నిర్వాకంతోనే... కిష్టపాడు ఆరోగ్య కేంద్రంలో వైద్యుడిగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి నిర్లక్ష్యం కారణంగానే తల్లీ, బిడ్డ మృతి చెందారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నాగేశ్వరమ్మకు 10వ తేదీని డెలివరీ డేట్‌గా ముందుగానే నిర్ణయించారు. అయినా కూడా వైద్యుడు అందుబాటులో ఉండకుండా ఏఎన్ఎం చేత ప్రసవం చేయించడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని అంటున్నారు. శ్రీనివాసరెడ్డి విధులను కూడా సక్రమంగా నిర్వర్తించడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఉదయం 11 గంటలకు డ్యూటీకి వచ్చి రెండు గంటలలోపే వెళ్లిపోతున్నాడని అంటున్నారు. షాక్‌లో కుటుంబ సభ్యులు గంట వ్యవధిలోనే నాగేశ్వరమ్మతో పాటు బిడ్డ ప్రాణాలు పోవడంతో ఆ కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ బిడ్డను ఎంతో అపురూపంగా పెంచుకున్నామని తల్లీబిడ్డతో ఇంటికి వెళ్దామనుకుంటే వారి శవాలను తీసుకెళ్ళాల్సి వస్తుందనుకోలేదంటూ కన్నీరు మున్నీరయ్యారు. దీంతో భీమునిపల్లిలో విషాదఛాయలు అలముకున్నారు. కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ కిష్టపాడు ఆస్పత్రిలో ఏఎన్ఎం ఆధ్వర్యంలోనే ప్రసవాలు జరుగుతున్నాయని అందరికీ తెలిసినా వైద్యశాఖ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్న నేటి కాలంలోనూ సరైన వైద్యసేవలు అందక రెండు నిండు ప్రాణాలు పోవడం బాధాకరం. -
ఉద్యోగ భద్రతపై తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి
సాక్షి, అమరావతి : ఉద్యోగ భద్రత విషయంలో గ్రామీణ స్థాయి మహిళా నర్స్ వర్కర్ల (ఏఎన్ఎం)కు ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఉద్యోగ భద్రతపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ఆయన ఏఎన్ఎంలకు సూచించారు. తమ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా పూర్తికాకముందే.. విష ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆయన తప్పుబట్టారు. ఏఎన్ఎంల ఆందోళనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆయన తన శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఏఎన్ఎంలను ఉద్యోగాల నుంచి తీసివేస్తారన్న ప్రచారం ఎందుకు జరుగుతోందని అధికారులను ఆయన ఆరా తీశారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ తనకు చెప్పారని పేర్కొన్న ఆళ్ల నాని.. ఈ అంశంపై సుదీర్ఘంగా అధికారులతో చర్చించారు. ఏఎన్ఎంల ఉద్యోగ భద్రతపై ఎలాంటి ఆందోళన అవసరంలేదని, రాష్ట్రవ్యాప్తంగా 7,418 మంది ఏఎన్ఎంలు.. కాంట్రాక్టు, సెకండ్ ఏఎన్ఎం, ఈసీ ఏఎన్ఎం తదితర కేటగిరీల్లో ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల్లో భాగంగా 13,540 మంది ఏఎన్ఎంలను నియమిస్తున్నామని, ఈ పోస్టుల కోసం పైమూడు పద్ధతుల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలు కూడా దరఖాస్తు చేసుకొని.. పరీక్షలకు హాజరుకావొచ్చునని వెల్లడించారు. ఇలా పరీక్షలు రాసేవారికి 10శాతం వెయిటేజీ కూడా ఇస్తున్నామని తెలిపారు. సచివాలయ పోస్టులకు ఎంపిక కాకపోయినా ఇప్పుడున్న ఉద్యోగాల్లో ఏఎన్ఎంలను యథావిధిగా కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. సచివాలయ పోస్టులకు ఎంపికైన వారికి వేతన అంతరంపై ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుంటుందని, ఎవ్వరికీ ఎలాంటి నష్టం రాకుండా చూడాలన్నదే తమ ప్రభుత్వం ఉద్దేశమని తెలిపారు. -
పంచాయతీ కార్యదర్శికి దేహశుద్ధి
-
భరించలేక.. బాదేశారు!
తూర్పుగోదావరి , నెల్లిపాక (రంపచోడవరం): ఉద్యోగ రీత్యా, వ్యక్తిగతంగా తమను తీవ్రంగా వేధిస్తున్నాడంటూ ఆగ్రహం చెందిన గౌరీదేవిపేట పీహెచ్సీ ఏఎన్ఎంలు వారి బంధువులు గురువారం తోటపల్లి పంచాయతీ కార్యదర్శికి దేహశుద్ధి చేశారు. పింఛన్ల పంపిణీ చేస్తున్న ప్రదేశానికి మూకుమ్మడిగా వెళ్లిన వైద్య సిబ్బంది కార్యదర్శిని నిలదీశారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన బాధిత సెకండ్ ఏఎన్ఎం, ఆమె బంధువులు కార్యదర్శిపై విరుచుకుపడి పిడిగుద్దులు కురిపించారు. దీంతో అతడు అక్కడి నుంచి పరుగులుపెట్టి ఎదురుగా ఉన్న సహకార సంస్థ గోడౌన్ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అయినా శాంతించని ఏఎన్ఎంలు వారి బంధువులు తలుపులు బలవంతంగా తెరిచి కార్యదర్శిని బయటకు లాక్కొని వచ్చారు. ఈ క్రమంలో కార్యదర్శి పింఛన్ల పంపిణీ నిలిపివేసి ద్విచక్రవాహనంపై వెళ్లిపోయాడు. తోటపల్లి కార్యదర్శిని నిలదీస్తున్న ఏఎన్ఎంలు ఇదీ విషయం.. గౌరీదేవిపేట పీహెచ్సీలో సెకండ్ ఏఎన్ఎంగా పనిచేస్తున్న ఓ యువతి తల్లికి వితంతు పింఛను వస్తోంది. అయితే గౌరీదేవిపేట పరిధిలో కాకుండా తోటపల్లి పరిధిలో నమోదుకావడంతో కొన్ని నెలలుగా అక్కడి నుంచే పింఛను పొందుతోంది. పింఛను ఇచ్చే క్రమంలో ‘మీ అమ్మను తీసుకురా?’ అంటూ తన సెల్‌కు అభ్యంతరకర మెసేజ్‌లు పంపుతూ తనను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడని సెకండ్ ఏఎన్ఎం ఆవేదన వ్యక్తం చేసింది. పింఛను గౌరీదేవిపేట పరిధిలోకి మార్చండని వేడుకున్నా నిర్లక్ష్యం చేస్తున్నాడని వాపోయింది. నిత్యం గ్రామాల్లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఏదోఒక సమచారం కావాలంటూ తీవ్ర ఇబ్బందులు పెడుతూ తమపై దురుసుగా వ్యవహరిస్తున్నాడని అక్కడ ఉన్న ఏఎన్ఎంలు ఆరోపించారు. కొందరికి సెల్‌ఫోన్ ద్వారా అభ్యంతరకర మెసేజ్‌లు పెడుతున్నాడని, దీనివలన కుటుంబంలో కలహాలు నెలకొన్న సందర్భాలు ఉన్నాయంటూ మండిపడ్డారు. ఈ విషయంపై ఎటపాక పోలీసులకు, మండల పరిషత్ అధికారులకు వైద్యశాఖ సిబ్బంది ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
చిరుద్యోగులపై చిన్నచూపు!
నిజామాబాద్‌అర్బన్: వైద్యారోగ్య శాఖలో క్షేత్ర స్థాయిలో అన్ని విధులు నిర్వహించే రెండో ఏఎన్ఎంలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్నా క్రమబద్ధీకరణకు నోచుకోక, సకాలంలో వేతనాలు అందక అష్ట కష్టాలు పడుతున్నారు. గ్రామాల్లో అన్ని వైద్య సేవలు అందించే కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను పాలకులు, ఉన్నతాధికారులు చిన్న చూపు చూస్తున్నారు. పైగా కాంట్రాక్ట్ విధానంలో కొనసాగిన వీరు.. అధికారుల తప్పిదం వల్ల ప్రస్తుతం ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా మారిపోయారు.! దీంతో తాము రెగ్యులర్ అయ్యే అవకాశం కోల్పోతామని రెండో ఏఎన్ఎంలు ఆందోళన చెందుతున్నారు. కాంట్రాక్ట్ నుంచి ఔట్‌సోర్సింగ్‌కు..! ఉమ్మడి జిల్లాలో 17 క్లస్టర్ల పరిధిలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 377 ఉప కేంద్రాలు కొనసాగుతున్నాయి. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ముగ్గురు, పీహెచ్‌సీలకు ఇద్దరు, ఉప కేంద్రానికి ఒక్కరు చొప్పున 376 మంది కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు పని చేస్తున్నారు. 2001 నుంచి 2007 వరకు ఇంటర్వ్యూలు, రోస్టర్ రిజర్వేషన్ ప్రకారం కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీరంతా ఎంపికయ్యారు. వీరిలో కొంత మందిని యూరోపియన్ స్కీం కింద, మరికొంత మందిని జాతీయ గ్రామీణ ఆరోగ్య ఆరోగ్య పథకం (ఎన్ఆర్హెచ్ఎం) కింద, మరి కొందరిని ఆర్సీహెచ్–2 స్కీం కింద నియమితులయ్యారు. 2007 తర్వాత ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మరి కొందరిని ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఎంపిక చేశారు. ఐదేళ్లు కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగిన వారిని రెగ్యులర్ చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ లెక్కన జిల్లాలో 186 మంది కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు రెగ్యూలర్ అయ్యే అవకాశముంది. అయితే, ఉన్నతాధికారులు తరచూ నిబంధనలు మారుస్తుండడంతో ఏఎన్ఎంలు ఆందోళన చెందుతున్నారు. కాంట్రాక్ట్ విధానంలో పని చేసే వారు సంవత్సరానికి ఒకసారి బాండ్ పేపర్ ద్వారా కాంట్రాక్ట్‌ను రెన్యూవల్ చేసుకోవాల్సి. అయితే, కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను ఔట్సోర్సింగ్ కింద పరిగణిస్తూ అధికారులు గతంలో బాండ్ రాయించుకున్నారు. అధికారులు చేసిన తప్పిదం వల్ల ప్రస్తుతం వారు ఆందోళనకు గురవుతున్నారు. చాలీచాలని వేతనాలు.. కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న రెండో ఏఎన్ఎంలు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా వారి స్థాయిలో వేతనాలు ఇవ్వడం లేదు. ప్రతి పీహెచ్సీ, సబ్ సెంటర్లలో రెగ్యులర్ ఏఎన్ఎంతో పాటు కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు సమానంగా గ్రామాలను కేటాయించారు. రెగ్యులర్ ఏఎన్ఎంతో పాటు టార్గెట్‌ను నిర్ణయించారు. బాధ్యతలు సమానంగా అప్పగించారు. అయితే, వేతనంలో మాత్రం భారీ తేడా ఉంది. కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు మూడు, నాలుగు నెలలకు ఒకసారి వతనాలు చెల్లిస్తున్నారు. సకాలంలో డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కాంట్రాక్టు ఏఎన్ఎంలకు పీఎఫ్ పేరిట రూ.2 వేల కోత విధిస్తున్నా, ఇంత వరకు వారికి పీఎఫ్ నెంబర్ ఇవ్వలేదు. వ్యాక్సిన్ డ్యూటీకి సంబంధించి డబ్బులు ఇవ్వడం లేదు. ఈ ఖర్చును సైతం ఏఎన్ఎంలే భరిస్తున్నారు. మార్పులో భాగంగా ప్రతి కాంట్రాక్ట్ ఏఎన్ఎంకు లక్ష్యాన్ని నిర్దేశించారు. దీని కోసం వారు సొంత డబ్బు వెచ్చిస్తున్నారు. డిమాండ్లు ఇవే.. రోస్టర్, రిజర్వేషన్ ప్రకారం కాంట్రాక్టు విధానంలో ఏఎన్ఎంలను ఎంపిక చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్ చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనం రూ.32 వేలతో పాటు డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక వ్యాక్సిన్ అలవెన్సు రూ.500, యూనిఫాం అలవెన్సు రూ.1500, ఎఫ్‌టీఏ రూ.550 ఇవ్వడంతో పాటు 35 క్యాజువల్ లీవ్స్, 180 రోజులు వేతనాలతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరుతున్నారు. నైట్ డ్యూటీలు, ఓపీ డ్యూటీలు రద్దుతో పాటు ఇతర డిమాండ్లు సర్కారు ముందు ఉంచుతున్నారు. ఏడాదైనా వెలువడని లేని ఫలితాలు.. గత ఎడాది టిఎస్పిఎస్సి ద్వార ఏఎన్ఎంలకు సంబందించి రెగ్యులర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్లో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. వైద్యవిధాన పరిషత్ విభాగంలో పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ జరిగింది. గతేడాది మే నెలలో పరీక్ష నిర్వహించగా, ఇప్పటికీ ఫలితాలు వెల్లడించలేదు. కొన్ని రోజుల క్రితం ఏఎన్ఎంల నుంచి సర్వీస్ వివరాలను సేకరించారు. ప్రస్తుతం పని చేస్తున్న ఏఎన్ఎంలకు సర్వీస్ మార్కులు కలిపి ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. దీంతో ఎంత మంది ఉద్యోగం పొందుతారో తెలిసి పోతుంది. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేదు. రెగ్యులర్ చేయండి.. రెగ్యులర్ ఏఎన్ఎంలతో పాటు సమానంగా విధులు నిర్వహిస్తున్నాం. మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయాలి. సంవత్సరాల తరబడి పని చేస్తున్నా మాకు ప్రయోజనం లేదు. ప్రభుత్వం ఇకనైన మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. మా సమస్యలను పరిష్కరించాలి. – పద్మ, కాంట్రాక్ట్ ఏఎన్ఎం పరిష్కరించకుంటే ఉద్యమిస్తాం.. వైద్యారోగ్యశాఖలో అతి తక్కువ వేతనంతో పని చేస్తున్నారు రెండో ఏఎన్ఎంలు. 15 ఏళ్లుగా కాంట్రాక్టు విధానంలో పని చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదు. క్షేత్రస్థాయిలో వైద్యసేవలు అందించడంలో ఏఎన్ఎంల పాత్ర ఎంతో ముఖ్యం. రెండో ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తాం. – నటరాజ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు -
పిల్లలతో కలిసి ఏఎన్ఎమ్ల సమ్మె
జహీరాబాద్ టౌన్: తమ డిమాండ్ల సాధన కోసం ఏఎన్ఎంలు చేపట్టిన సమ్మె ఆదివారానికి ఏడో రోజుకు చేరుకుంది. పిల్లలతో కలసి ఆందోళనకారులు సమ్మెలో కూర్చున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.21,300 వేతనం చెల్లించాలని, ఉద్యోగాలు పర్మినెంట్ చేసి ప్రమాద బీమా కల్పించాలని కోరారు. సమ్మెలో యూనియన్ నాయకురాలు కృష్ణవేణి, రోజారాణి, శ్యామల, అరుణ, సుధారాణి, సుజాత, సరళ తదితరులున్నారు. -
నర్సుపై డాక్టర్ లైంగిక వేధింపులు
కలువాయి (శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు) : ఏఎన్ఎంపై లైంగిక వేధింపుల కేసులో ఓ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయిలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కుల్లూరు పీహెచ్సీలో ఓబుల్రాజ్ అనే వైద్యుడు పనిచేస్తున్నారు. కాగా ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆస్పత్రిలో పనిచేసే ఓ నర్సు శనివారం నెల్లూరులోని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన డీఎస్పీ శ్రీనివాసాచారి వెంటనే గ్రామానికి చేరుకుని, ఆస్పత్రి సిబ్బందిని విచారించారు. అనంతరం సదరు వైద్యుడు నిర్వహిస్తున్న క్లినిక్‌కు వెళ్లి డాక్టర్ ఓబుల్రాజ్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.