
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కంచి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శబరిమల యాత్రకు వెళ్లిన విజయనగరం జిల్లాకు చెందిన అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 15 మందికి గాయాలయ్యాయి. శబరిమల నుండి కంచి వస్తుండగా.. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడిని పాచిపెంట మండల పాంచాలి గ్రామానికి చెందిన గౌరీశ్వరరావు(25)గా గుర్తించారు.