అభ్యంతరాలపై చర్యలేవీ? | What Are The Actions On Audit Objections | Sakshi
Sakshi News home page

అభ్యంతరాలపై చర్యలేవీ?

Published Mon, Sep 16 2019 10:56 AM | Last Updated on Mon, Sep 16 2019 10:59 AM

What Are The Actions On Audit Objections - Sakshi

ఆడిట్‌ కార్యాలయం

సాక్షి, విజయనగరం గంటస్తంభం:  జిల్లాలోని పలు శాఖల్లో ఆడిట్‌ అభ్యంతరాలు ఏడాదికేడాది పెరిగిపోతున్నాయి. అధికారులు ఇష్తానుసారం ఖర్చు చేయడం... వాటిపై జమాఖర్చుల శాఖ అభ్యంతరం చెప్పడం పరిపాటిగా మారిం ది. వీటికి సరైన లెక్కలు చూపించడం లేదు సరికదా... వెచ్చించిన నిధులు వెనక్కు చెల్లించకపోవడంతో ప్రభుత్వ నిధులు వృధా అవుతున్నాయి. జిల్లాలో కొన్నేళ్లలో చేసిన ఆడిట్‌ ద్వారా కోట్లాది రూపాయల ఖర్చుపై భారీ స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. స్థానిక సంస్థలకు సంబం ధించి ఆడిట్‌ను జిల్లా ఆడిట్‌శాఖ అధికారులు ఏటా చేపడుతుంటారు. ఈ సందర్భం గా అధికారులు కొన్ని రకాల ఖర్చులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటికి సరైన లెక్కలు చూపించాల్సిన బాధ్యత సంబంధి త అధికారులపై ఉంటుంది. అలా కానప్పు డు ఖర్చు చేసిన మొత్తాన్ని సంబంధిత అధికారి తిరిగి చెల్లించాలి. లేకుంటే వారి వేతనం, ఇతర ఖాతాల నుంచి రికవరీ చే యాలి. ఈ ఏడాది ఆగస్టు నెలాఖరుకు చూ స్తే జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించి మొత్తం రూ.307.80కోట్లకు సంబంధించి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

 రికవరీపై కానరాని శ్రద్ధ..
అడిట్‌ అధికారులు సాధారణంగా 19రకాల ఆడిట్‌ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటారు. ఇందులో అకౌంట్‌ అంకెల్లో తేడా, అధిక నిధుల వినియోగం, నిధుల పక్కదారి, నిధులు ఖర్చు చేయకపోవడం, అనవసర ఖ ర్చు, అడ్వాన్సుల పెండింగ్‌ సర్దుబాటు, నిబంధనల ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం, అధిక చెల్లింపులు, నిరుపయోగ ఖర్చు ఇలా అనేక రకాల అంశాలపై ఆడిట్‌లో చూస్తారు. సక్రమంగా లేని అంశాలపై అభ్యంతరాన్ని సంబంధిత అధికారికి పంపిస్తారు. వాటిపై ఆ అధికారి వివరణ ఇచ్చుకుని, సరైన లెక్కలు చూపాలి. లేకుంటే బాధ్యత వహించి వాపసు చేయాలి. కానీ ఈ విషయంలో అధికారులు ఎక్కువమంది సరైన లెక్కలు చూపడం లేదు. అప్పట్లో ఉన్న అధికారులు బదిలీ కావడమో... రిటైర్‌ కావడమో... అయితే ఇక రికవరీకి అవకాశం ఉండదు. ఎప్పటికప్పుడు వీటిపై లెక్కలు తేలిస్తే ప్రభుత్వ నిధులు వృధా అయ్యే అవకాశం ఉండదు. ఈ విధంగా వ్యక్తం చేసిన అభ్యంతరాల్లో సుమారు రూ.20కోట్ల వరకు ఉంటుంది. వీటిని రికవరీ చేయక పోవడం వల్ల ప్రభుత్వానికి నష్టం కలుగుతోంది. జిల్లా కలెక్టర్‌ వంటివారు సైతం వీటిని పట్టించుకోవడం లేదన్న వాదన ఉంది.


 

మూడు నెలలకోసారి సమీక్ష..
ఆడిట్‌ చేసి ఖర్చులో లోపాలుంటే అభ్యంతరాలు వ్యక్తం చేయడం మా విధి. ఇలా ప్రతి ఏడాది చేస్తున్నాం. వాటిని పరిష్కరించుకో వాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదే. అందుకు కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తాం. ఆ రోజు సరైన లెక్కలు చూపించిన వాటిని తీసేస్తాం. ఇంకా పరిష్కరించుకోనప్పుడు సర్‌ఛార్జి నోటీసులు ఇచ్చి రికవరీకి ఆదేశిస్తాం. ఆ సమాచారం మా శాఖ ఉన్నతాధికారులకు పంపిస్తాం. అక్కడి నుంచి ప్రభుత్వానికి వెళుతుంది. ఉన్నతస్థాయి నుంచి కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలొస్తాయి.
– ఆర్‌.మల్లికాంబ, జిల్లా ఆడిట్‌ అధికారి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement