బొబ్బిలి: అనారోగ్యంతో నాటు వైద్యానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో మృతి చెందిన వృద్ధుడి మృత దేహాన్ని ఆర్టీసీ సిబ్బంది ఈ నెల 22న బస్సు నుంచి కిందికి దించేయడంపై రాష్ట్ర మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ సంఘటనపై పత్రికల్లో వచ్చిన వార్త చూపి ఆర్టీసీ అధికారులపై సీరియస్ అయ్యారు. బస్సుల్లో ప్రయాణించే వారిపై సిబ్బంది మానవత్వంతో వ్యవహరించాలన్నారు. చేసిన తప్పును తెలుసుకుని విజయనగరం, పార్వతీపురం ఆర్టీసీ డిపో మేనేజర్లు సాలూ రు బంగారమ్మ కాలనీలో దాసరి పైడయ్య ఇంటికి బుధవారం వెళ్లి అతని భార్య పోలమ్మను పరామర్శించారు. జరిగిన సంఘటనకు తాము పశ్చాత్తాప పడుతున్నామనీ, క్షమించమని ఆమెను కోరారు.
చదవండి:
ఏమైందో ఏమో.. పాపం పండుటాకులు..
పట్టాలెక్కనున్న మరిన్ని స్పెషల్ రైళ్లు
తప్పయింది క్షమించమ్మా...
Published Thu, Feb 25 2021 11:51 AM | Last Updated on Thu, Feb 25 2021 12:49 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment