RTC officials
-
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారుల షాక్
-
ఆర్టీసీ ఉన్నతాధికారులకు రాజ్ భవన్ పిలుపు
-
ఈ కామర్స్ ఆర్టీసీ టికెట్లపై జీఎస్టీ
సాక్షి, అమరావతి: లాభాపేక్షతో నిర్వహిస్తున్న ప్రైవేటు ఈ కామర్స్ పోర్టల్స్, యాప్స్ ద్వారా బుక్ చేసుకునే ఆర్టీసీ నాన్ ఏసీ టికెట్లపై ఏపీఎస్ఆర్టీసీ 5 శాతం జీఎస్టీ విధించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు గురువారం ఆర్టీసీ అధికారులు ఈ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ప్రస్తుతం ఆర్టీసీ టికెట్ బుకింగ్ సేవలు అందిస్తున్న అభిబస్, రెడ్‌బస్, పేటీఎం పోర్టల్స్‌లో టికెట్లు కొనుగోలు చేసేవారు జనవరి 1వ తేదీ నుంచి జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి సేవా దృక్పథంతో నిర్వహించే ఆర్టీసీ పోర్టల్, ఆర్టీసీ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకునే టికెట్లకు, నేరుగా బస్సుల్లో తీసుకునే టికెట్లకు జీఎస్టీ ఉండదని ఆర్టీసీ అధికారులు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
తప్పయింది క్షమించమ్మా...
బొబ్బిలి: అనారోగ్యంతో నాటు వైద్యానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో మృతి చెందిన వృద్ధుడి మృత దేహాన్ని ఆర్టీసీ సిబ్బంది ఈ నెల 22న బస్సు నుంచి కిందికి దించేయడంపై రాష్ట్ర మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ సంఘటనపై పత్రికల్లో వచ్చిన వార్త చూపి ఆర్టీసీ అధికారులపై సీరియస్ అయ్యారు. బస్సుల్లో ప్రయాణించే వారిపై సిబ్బంది మానవత్వంతో వ్యవహరించాలన్నారు. చేసిన తప్పును తెలుసుకుని విజయనగరం, పార్వతీపురం ఆర్టీసీ డిపో మేనేజర్లు సాలూ రు బంగారమ్మ కాలనీలో దాసరి పైడయ్య ఇంటికి బుధవారం వెళ్లి అతని భార్య పోలమ్మను పరామర్శించారు. జరిగిన సంఘటనకు తాము పశ్చాత్తాప పడుతున్నామనీ, క్షమించమని ఆమెను కోరారు. చదవండి: ఏమైందో ఏమో.. పాపం పండుటాకులు.. పట్టాలెక్కనున్న మరిన్ని స్పెషల్ రైళ్లు -
ఆర్టీసీలో మెరుగైన స్క్రాపేజీ పాలసీ!
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీలో 15 ఏళ్లు పైబడిన బస్సులు కేవలం 19 మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా అర్బన్ ప్రాంతాల్లో 12, గ్రామీణ ప్రాంతాల్లో 9 మాత్రమే తిరుగుతున్నాయి. ఆర్టీసీలో కాల వ్యవధితో సంబంధం లేకుండా కి.మీ. ప్రాతిపదికగా బస్సుల్ని మార్చేస్తున్నారు. వీటి స్థానంలో ఏటా వెయ్యి కొత్త బస్సుల్ని అందుబాటులోకి తెస్తున్నారు. అతి పెద్ద రవాణా వ్యవస్థ అయిన ఏపీఎస్ ఆర్టీసీలో మెరుగైన స్క్రాపేజీ పాలసీని అమలు చేస్తున్నారు. ఇటీవలే కేంద్రం బడ్జెట్లో.. కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చే పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలను కచ్చితంగా తుక్కుగా మార్చేయాలని కేంద్రం పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ పాలసీని తప్పనిసరి చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ గత రెండు రోజుల కిందట సంస్థలో బస్సుల పరిస్థితిపై సమీక్షించింది. కేంద్రం ప్రకటించిన స్క్రాపేజీ పాలసీతో ఏపీఎస్ ఆర్టీసీపై ప్రభావం ఉండదని సంస్థ అధికారులు నిర్ణయానికొచ్చారు. ఆర్టీసీలో కేవలం 19 బస్సులే 15 ఏళ్లు పైబడి ఉన్నట్టు గుర్తించారు. ఆర్టీసీ గతం నుంచి స్క్రాపేజీకి సంబంధించి విధాన పరమైన నిర్ణయాలను అమలు చేస్తోంది. ఆర్టీసీ అధికారులు డిపోల్లో వినియోగించే వ్యక్తిగత, ఇతర వాహనాల విషయంలోనూ కాల వ్యవధితో సంబంధం లేకుండా కి.మీ. పూర్తయితే వాటిని స్క్రాప్ కింద తీసేసి అద్దెకు వాహనాలు తీసుకుని నడుపుతున్నారు. ఆ బస్సులు ఇతర అవసరాలకు.. ఆర్టీసీలో ఓ బస్సు 12 లక్షల కి.మీ. తిరిగితే ఆ బస్సును ప్రజా రవాణాకు అసలు వినియోగించడం లేదు. గూడ్స్ వాహనంగానో, లేకుంటే ఆ బస్సును టాయిలెట్‌గా మార్చి వినియోగించుకుంటున్నారు. ఆర్టీసీలో బస్సులు నిత్యం 41.73 లక్షల కి.మీ. తిరుగుతున్నాయి. ఆర్టీసీలో అధిక శాతం బస్సులు పది నుంచి పన్నెండేళ్ల కాల వ్యవధిలోనే 12 లక్షల కి.మీ. పూర్తి చేసుకుంటున్నాయి. 12 లక్షల కి.మీ. దాటితే ఆ బస్సును స్క్రాప్ కింద మార్చేస్తున్నారు. అంతేకాకుండా ఏటా ఆర్టీసీ కొత్త బస్సుల్ని సంస్థలో ప్రవేశపెట్టి పాత బస్సుల్ని మారుస్తోంది. ఏపీఎస్ఆర్టీసీ అమలు చేస్తున్న స్క్రాపేజీ విధానం కేంద్రం ప్రకటించిన పాలసీ కంటే సమర్థంగా ఉందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. -
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు; తొలగని ప్రతిష్టంభన
-
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు; తొలగని ప్రతిష్టంభన
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసుల పునరుద్ధరణపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం ఎండీ కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ.. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ, కిలోమీటర్లపై చర్చ జరిగింది. ఏ రూట్లలో ఎన్ని బస్సులు నడపాలనే అంశంపైనా చర్చించాం. సమాన కిలోమీటర్లకు ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. బస్సుల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ పంపాం. కిలోమీటర్ల గ్యాప్ 50 శాతం తగ్గించేందుకు మేము అంగీకరించాం. తెలంగాణ ఆర్టీసీని 50శాతం పెంచుకోమని చెప్పాము. రాష్ట్ర విభజనకు ముందు 3.43 లక్షల కిలోమీటర్లు ఏపీ బస్సులను నడిపాం. విభజన తరువాత తెలంగాణ లో 2.65 లక్షల కిలోమీటర్లకు బస్సులు తిప్పుతున్నాం. 71 రూట్లలో ఏపీ, 28 రూట్లలో తెలంగాణ బస్సులు తిప్పుతుంది. 1.1 లక్షల కిలోమీటర్లు రెండు రాష్ట్రాల మధ్య గ్యాప్ ఉంది. మేము 50 వేల కిలోమీటర్లు తగ్గిస్తాం. మీరు పెంచండి అని తెలంగాణ వాళ్ళను కోరాం. 1.10 వేల కిలోమీటర్ల నుంచి 1.60 వెల కిలోమీటర్లు వరకు పెంచడానికి తెలంగాణ ముందుకు వచ్చింది. ('అవినీతికి, అక్రమాలకు చంద్రబాబు పెట్టింది పేరు') అంతకు మించి పెంచే సామర్ధ్యం మాకు లేదు. లాభదాయకంగా ఉండదని తెలంగాణ చెబుతోంది. అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీఎస్ ఆర్టీసీకి అనుమతి ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి రూట్ వైజ్ క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ అడిగింది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రం ఇలాంటి ప్రతిపాదన పెట్టలేదు. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే చూడాలి. 70 వేల కిలోమీటర్లు మేర ఇరు రాష్ట్రాలు 250 బస్సులు తిప్పితే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని భావించము. సర్వీసుల పునరుద్ధరణపై ప్రతిష్టంభన ఇలానే ఉంటే ప్రైవేట్‌కు లాభం చేకూరుతుంది. మేము తగ్గిస్తాం, మీరు పెంచండి అని చెప్పాం. రూట్ల వారీగా బస్సులు నడిపే మార్గాల ప్రపోజల్ ఇవ్వమని అడిగారు. రెండు రోజుల్లో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించాం. తుది నిర్ణయం తీసుకునే వరకు ఇరు రాష్ట్రాలు 250 బస్సుల చొప్పున నడిపేందుకు అనుమతి ఇవ్వాలని అడిగాం. అంతరాష్ట్ర బస్సులపై క్లారిటీ వచ్చిన తరువాతే ఇస్తామని టీఎస్ అధికారులు చెప్పారు' అని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ మాట్లాడుతూ.. రూట్ల వారీగా రెండు రాష్ట్రాలు సమానంగా నడపాలని ప్రపోజ్ చేశాం. రూట్ల వారీగా క్లారిటీ ఇస్తేనే మేము ముందుకు వెళ్తాం. రెండు రాష్ట్రాలు అగ్రిమెంట్ ప్రకారం ముందుకు వెళతాం' అని సునీల్ శర్మ అన్నారు. సమావేశంలో తెలంగాణ నుంచి టీఎస్ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు.. ఏపీ నుంచి ఎండీ కృష్ణబాబు, ఈడీ బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు సర్వీసుల ప్రారంభానికి చర్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసుల ప్రారంభానికి చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ వారంలో రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఏపీ అధికారులు బస్సు సర్వీసుల్ని ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉన్నారు. అన్‌లాక్ సీజన్లో భాగంగా బస్సు సర్వీసులకు కేంద్రం అనుమతి ఇవ్వగానే, రెండు రాష్ట్రాల మధ్య బస్సు సేవలను పునరుద్ధరించాలని ఏపీ అధికారులు భావించి, తెలంగాణ ఆర్టీసీ అధికారులకు లేఖ కూడా రాశారు. కానీ కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభించరాదని భావించింది. కేవలం రాష్ట్రంలో హైదరాబాద్ వెలుపల మాత్రమే ఆర్టీసీ బస్సులు తిప్పాలని నిర్ణయించి జిల్లా సర్వీసులు ప్రారంభించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరిగిన సమీక్షలో భాగంగా, అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభించే అంశాన్ని అధికారులు ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కొన్ని కీలక సూచనలు చేశారు. అధికారులు ఏం చెప్పారంటే.. రాష్ట్రం విడిపోక ముందు ఉమ్మడి ఏపీఎస్ఆర్టీసీలో.. తెలం గాణ ప్రాంతంలో ఆంధ్ర పరిధిలోని డిపోల బస్సులు ఎక్కు వగా తిరిగేవి. అదే ఆంధ్రా పరిధిలో తెలంగాణ ప్రాంత డిపోల బస్సులు తక్కువగా తిరిగేవి. రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. దీనివల్ల తెలంగాణ ఆర్టీసీకి నష్టం వస్తోందని ఇటీవల అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చారు. లాక్‌డౌన్‌కు ముందునాటి లెక్కల ప్రకారం ప్రస్తుతం దాదాపు వెయ్యి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తెలంగాణ పరిధిలో తిరుగుతున్నాయి. టీఎస్ ఆర్టీసీకి చెందిన 750 బస్సులే ఏపీ పరిధిలో తిరుగు తున్నాయి. ఆంధ్రా బస్సులు తెలంగాణ భూభాగంలో రెండున్నర లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతుంటే, తెలంగాణ బస్సులు ఏపీలో లక్షన్నర కిలోమీటర్లు మాత్రమే తిరుగుతున్నాయి. దీనివల్ల ఆదాయం కోల్పోవాల్సి వస్తుందంటూ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కేసీఆర్ ఏం సూచించారంటే.. రెండు ఆర్టీసీలు సమంగా బస్సులను నడిపేలా, ఒకే పరిమాణంలో కిలోమీటర్ల మేర తిరిగేలా ఈ సమయంలోనే ఒప్పందం చేసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఏపీతో పాటు పొరుగునున్న మహారాష్ట్ర, కర్ణాటకలతో కూడా ఇలాంటి ఒప్పందం చేసుకోవాలన్నారు. ఆర్టీసీ విడిపోక ముందు ఈ తరహా ఒప్పందాలు పొరుగు రాష్ట్రాలతో ఏపీఎస్ఆర్టీసీ చేసుకుంది. ఫలితంగా ఆ ఒప్పందాలు ఇప్పుడు ఏపీకే పరిమితమయ్యాయి. కొత్తగా ఏర్పడ్డందున తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు అన్ని పొరుగు రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంది. సీఎం ఆదేశంతో ఓసారి తెలంగాణ ఆర్టీసీ అధికారులు విజయవాడ వెళ్లి ఏపీ అధికారుల సమావేశమైనా చర్చలు కొలిక్కి రాలేదు. హైదరాబాద్‌లో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. బస్‌భవన్‌లో కొందరు అధికారులు, సిబ్బందికి కరోనా సోకటంతో ఈ భేటీ రద్దయింది. తాజాగా ఈ వారంలో జరగనున్న భేటీలో చర్చలు కొలిక్కి వస్తే రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగి ప్రారంభమవుతాయి. -
బస్సుల రిజర్వేషన్ నిలిపివేత
-
హైదరాబాద్ బస్సులకు రిజర్వేషన్ నిలిపివేత
సాక్షి, అమరావతి: హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులకు అడ్వాన్స్డ్ రిజర్వేషన్ ప్రక్రియను ఏపీఎస్ఆర్టీసీ నిలిపివేసింది. తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుందని అక్కడి సీఎం కేసీఆర్ సంకేతాలివ్వడంతో ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ కొనసాగితే ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న వారికి పూర్తి సొమ్ము వాపసు ఇస్తామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. లాక్డౌన్ తర్వాత రోజు నుంచి వివిధ ప్రాంతాలకు నాన్–ఏసీ బస్సులు నడపాలని నిర్ణయించిన ఆర్టీసీ గత నాలుగు రోజులుగా ఆన్లైన్ రిజర్వేషన్ టిక్కెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచగా 15వ తేదీకి ఫుల్ అయ్యాయి. మొత్తం 200 బస్సులకు రిజర్వేషన్ అవకాశం ఇవ్వగా మొత్తం 7 వేల టిక్కెట్లు ప్రయాణికులు కొనుగోలు చేశారు. అయితే తాజాగా లాక్ డౌన్‌పై ప్రతిష్టంభన నెలకొనడంతో బుధవారం నుంచి ఏపీలోని అన్ని ప్రాంతాలకు రెండు వైపులా బుకింగ్‌ను ఆపేశారు. లాక్ డౌన్ కొనసాగితే బుకింగ్ చేసుకున్న టిక్కెట్లకు సంబంధించి పూర్తి సొమ్మును వాపసు చేస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈనెల 14వ తేదీతో లాక్డౌన్ ముగుస్తుంది. దీంతో 15 నుంచి 20వ తేదీ వరకు ఆర్టీసీ టిక్కెట్ల రిజర్వేషన్‌ను అధికారులు నాలుగు రోజుల క్రితం అందుబాటులోకి తెచ్చారు. ఆరు రోజులకు వివిధ ప్రాంతాలకు కలిపి 42,377 టిక్కెట్లు ఇప్పటికే బుక్ అయ్యాయి. -
ఆర్టీసీలో తగ్గనున్న 2,080 బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో భారీగా బస్సుల సంఖ్య తగ్గుతోంది. హైదరాబాద్‌లో నష్టాలు ఎక్కువగా వస్తున్నాయన్న ఉద్దేశంతో దాదాపు 800 బస్సులను తగ్గించిన అధికారులు.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు తిరుగుతున్న 1,280 బస్సులను కూడా ఉపసంహరించబోతున్నారు. వెరసి 2,080 బస్సులు తగ్గిపోతున్నాయి. ఇది మొత్తంగా రాష్ట్రంపైనే తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 800 గ్రామాలకు బస్సులు వెళ్లటం లేదు. తాజా నిర్ణయంతో సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. అద్దె బస్సులు వస్తుండటంతో.. సొంత బస్సుల నిర్వహణను తీవ్ర భారంగా భావిస్తున్న ఆర్టీసీ క్రమంగా వాటిని తగ్గించుకోవాలని నిర్ణయించింది. వాటి స్థానంలో వీలైనన్ని అద్దె బస్సులను ప్రవేశపెట్టే దిశగా అడుగులేస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో 2,100 అద్దె బస్సులు ఉండగా, వీటికి అదనంగా మరో పక్షం రోజుల్లో 1,334 బస్సులు రాబోతున్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే టెండరు ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ నెలాఖరుకు అవి రోడ్డెక్కబోతున్నాయి. కొత్తగా వస్తున్న అద్దె బస్సుల సంఖ్యతో సమంగా సొంత బస్సులను ఉపసంహరించుకోవాలని అధికారులు నిర్ణయించారు. కొత్తగా నగరంలో 54 అద్దె బస్సులు చేరనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 800 బస్సులను తగ్గించినందున కొత్తగా ఇక తగ్గించాల్సిన అవసరం లేదని నిర్ణయించారు. ఇక నగరం వెలుపల 1,280 అద్దె బస్సులు కొత్తగా వస్తున్నందున, అంతే సంఖ్యలో సొంత బస్సులను ఉపసంహరించుకోబోతున్నారు. వాటిల్లో ఎక్కువ బస్సులు బాగా పాతవే. వాటిని తొలగించి ఆ స్థానంలో కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్టీసీ కొత్త బస్సులు కొనే పరిస్థితి లేదు. అందుకే అద్దె బస్సులు తీసుకుంటోంది. మారుమూల గ్రామాలకు కష్టమే... రాష్ట్రవ్యాప్తంగా 800 గ్రామాలకు బస్సు వసతి లేకుండా పోయింది. కొత్త బస్సులు కొని వాటిల్లో కొన్ని ఊళ్లకు నడపాలని గతంలో ప్రణాళికలు రూపొందించారు. ఇప్పుడు కొత్త బస్సులు కొనే పరిస్థితి లేకపోవటంతో చేతులెత్తేయాల్సి వస్తోంది. అదనంగా అద్దె బస్సులు వస్తున్నా, అంతే సంఖ్యలో సొంత బస్సులను తగ్గిస్తున్నందున అదనంగా ఒక్క ఊరికి కూడా బస్సు తిప్పే పరిస్థితి ఉండదు. అద్దె బస్సుల నిర్వాహకులు మారుమూల ఊళ్లకు బస్సులు తిప్పేందుకు ఆసక్తి చూపరు. లాభాలు వచ్చే రూట్లలోనే వారు తిప్పుతారు. వెరసి దూరంగా ఉండే ఊళ్లపై దుష్ప్రభావం తప్పేలా కనిపించటం లేదు. హైదరాబాద్‌ను గ్యాస్‌చాంబర్‌గా మార్చొద్దు.. నగరంలో భారీ సంఖ్యలో బస్సులను తగ్గించటం వల్ల సొంత వాహనాల వినియోగం విపరీతంగా పెరిగి కాలుష్యం తీవ్రమవుతుందని, ఇది ఢిల్లీ తరహాలో నగరం గ్యాస్‌చాంబర్‌గా మారేందుకు దోహదం చేస్తుందని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ట్రాఫిక్ చిక్కులు జనాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయని హెచ్చరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజా రవాణా వాహనాల సంఖ్య తగ్గించకూడదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. షెడ్యూల్స్ మార్చటం వల్ల సమస్యకు పరిష్కారం: అధికారులు ఏయే ఊళ్లకు బస్సుల్లేవో ఎప్పటికప్పుడు గుర్తించి హేతుబద్ధీకరించటం ద్వారా షెడ్యూల్స్‌లో మార్పుచేర్పులు చేసి ఆయా ప్రాంతాలకు నడుపుతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. ఓఆర్ ఉండే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి నడుపుతున్నట్టు పేర్కొంటున్నారు. ఇప్పుడు కూడా అద్దె బస్సులు రాగానే అదే తరహా కసరత్తు చేసి కొత్తగా కొన్ని ఊళ్లకు బస్సులు తిప్పుతామంటున్నారు. -
వారం పదిరోజుల్లో హామీలు అమలయ్యేలా చూడండి: సునీల్ శర్మ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీకి ఇచ్చిన హామీలను వారం పది రోజుల్లోగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఉద్యోగుల సంక్షేమ బోర్డు కార్యలాపాలను ఈవారంలోనే ప్రారంభించాలని సూచించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. డిపో స్థాయి, రీజియన్, కార్పొరేషన్ స్థాయిలో ఉద్యోగ సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసినందున వాటి విధివిధానాలను ఖరారు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సులను హేతుబద్ధీకరించాలని, తద్వారా తక్కువ మంది ప్రయాణికులతో బస్సులు తిరిగే పరిస్థితిని నివారించాలన్నారు. పెరిగిన చార్జీల ద్వారా గరిష్ట ఆదాయం పొందేలా షెడ్యూల్ ఉండాలని పేర్కొన్నారు. మహిళా సిబ్బందికి కొత్త యూనిఫాం ఆప్రాన్లను అందించాలన్నారు. సిబ్బంది ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశాలను ఒక్కొక్కటిగా ఆయన సమీక్షించారు. వీటిపై త్వరలో సీఎం భేటీ నిర్వహించే అవకాశం ఉన్నందున ఈలోపు వాటిని అమల్లోకి తెచ్చేలా చూడాలని ఆదేశించారు. -
కాలం చెల్లినా.. రైట్‌రైట్
సాక్షి, ఆదిలాబాద్ : ఆర్టీసీలో బస్సుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఆర్డినరి, ఎక్స్‌ప్రెస్, హైటెక్ అనే తేడా ఏమీలేదు. ఆదిలాబాద్ రీజియన్‌లోని ఆరు డిపోల పరిధిలో గల అధిక మొత్తం బస్సులది ఇదే పరిస్థితి. రాష్ట్రంలోని ఇతర రీజియన్లతో పోలిస్తే ఆదాయం తక్కువ ఉంటుందో మరేమో కానీ బస్సుల పరంగా ఇక్కడి ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇతర రీజియన్‌లో తిరిగిన బస్సులను వివిధ రిపేర్ల కారణంగా ఇక్కడికి పంపి నడిపిస్తున్నారన్న అపవాదు లేకపోలేదు. పల్లెకు వెలుగేది? గ్రామీణ ప్రాంత ప్రజలు నిత్యం వివిధ పనుల రీత్యా పట్టణ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అత్యధిక గ్రామీణులకు పల్లె వెలుగు బస్సే దిక్కు. అత్యధికంగా ఈ బస్సులే నిత్యం వివిధ మార్గాల్లో నడుస్తుంటాయి. సంస్థకు అధికంగా ఆదాయం సమకూరుస్తాయి. అయితే గత ఐదారేళ్లుగా ఈ ఆర్డినరి బస్సుల రీప్లేస్మెంట్ లేదు. దీంతో అవే బస్సులు నడుపుతున్నారు. నిర్ధేశిత రీడింగ్‌ను ఎన్నడో దాటేశాయి. బస్సు కాలం చెల్లినా ఇంజిన్ పనిచేసినంత కాలం బస్సు నడుపుతామన్న ధోరణి ఆర్టీసీ అధికారుల్లో కనిపిస్తోంది. ప్రగతిరథ చక్రాల్లో 40 శాతం బస్సులు ప్రస్తుతం కాలం చెల్లినవేనని అధికారులు ఒప్పుకుంటున్నా పైకిమాత్రం చెప్పరు. ఇదేమంటే అదంతే .. అనే రీతిలో వ్యవహరిస్తారు. ఇందులో అధికారులకు ఓ స్వార్థ ప్రయోజనం లేకపోలేదు. ఎన్ని ఎక్కువ కాలం చెల్లిన బస్సులు నడిపితే అధికారి స్థాయిని బట్టి అంతా ఇన్సెంటీవ్ సంస్థ ఇస్తుండడంతో ఇలాంటి బస్సులను నెట్టుకొస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. కొన్ని కార్మిక సంఘాలు దీన్ని వ్యతిరేకించినా సంస్థ నిబంధనల రీత్యా వారూ గీత దాటని పరిస్థితి. ఆ బస్సులకు రీడింగ్ మీటర్లే ఉండవు ఒక బస్సు పూర్తిస్థాయిలో నిర్ధేశిత కిలో మీటర్లు తిరిగాక దాన్ని కాలం చెల్లిన బస్సుగా పరిగణిస్తారు. ఆర్టీసీలో అధికంగా పల్లె వెలుగుల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. రీజియన్ పరిధిలోని ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల పరిధిలో తిరుగుతున్న ఆర్డినరి బస్సుల్లో ఇలాంటి కాలం చెల్లిన బస్సులకు అసలు రీడింగ్ మీటర్లే కనిపించవు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు డ్రైవింగ్‌కు సంబంధించి కిలోమీటర్ పర్ లీటరు (కేఎంపీఎల్)నే పరిగణలోకి తీసుకొని వారు సంస్థకు ఏ విధమైన ప్రయోజనం దక్కిస్తున్నారనే అంచనాలు వేస్తూ ప్రశంస పత్రాలు అందజేస్తారు. అలాంటప్పుడు అసలు రీడింగే లేని బస్సులు నడుపుతున్నప్పుడు ఆ డ్రైవింగ్‌ను ఎలా అంచనా వేస్తున్నారో ఆర్టీసీ అధికారులకే తెలియాలి. స్పీడ్ మీటర్ మాత్రం దాంట్లో కనిపిస్తుంది. ఇక ఆ బస్సుల స్టీరింగ్ చూస్తేనే ప్రయాణికులకు ఒక రకమైన భయం పుడుతుంది. డ్రైవర్ క్యాబిన్ వద్ద బస్సుల పరిస్థితిని చూస్తే గుబులు పుడుతుంది. గతేడాది వేములవాడ వద్ద బస్సు ప్రమాద సంఘటన ఆర్టీసీలో ప్రకంపనలు సృష్టించింది. అయితే ఆ తర్వాత అది సద్దుమణిగిపోయింది. ప్రధానంగా ఇలాంటి ఏళ్లనాటి బస్సుల కారణంగానే ప్రమాదాలు సంభవిస్తున్నాయనే అభిప్రాయం ఉంది. తగ్గిన ఓఆర్.. ఆర్టీసీలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బస్సులో ప్రయాణికుల శాతం (ఆక్యుపెన్సీ రేషియో) గణనీయంగా తగ్గింది. దీనికి డొక్కు బస్సులే కారణమన్న అభిప్రాయం లేకపోలేదు. ఆర్టీసీలో ప్రయాణం.. సురక్షిత ప్రయాణం అనేది సంస్థ నినాదం. రీజియన్ స్థాయిలో ప్రస్తుతం 70 నుంచి 75 శాతం ఓఆర్ ఉండగా, గతేడాది ఇదే సమయానికి 90శాతం ఉండటం గమనార్హం. అలాగే ఆదాయం పరంగా చూస్తే ప్రస్తుతం రూ.70 లక్షల నుంచి రూ.75లక్షల వరకు లభిస్తుండగా, గతేడాది రూ.80లక్షల నుంచి రూ.85లక్షల వరకు, అంతకంటే ఎక్కువ కూడా రోజు ఆదాయం సమకూరేది. ఈ నేపథ్యంలో ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ మార్పులు చేయని పక్షంలో రానున్న రోజుల్లో ఓఆర్, ఆదాయం మరింత పడిపోయినా ఆశ్చర్య పోనక్కర్లేదు. రీజియన్ పరిధిలో పలు డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సుమారు 1100 పోస్టులకు గాను 110 ఖాళీ ఉన్నట్లు చెబతున్నారు. సాధారణంగా ఒక బస్సు నడవాలంటే బస్ ఆఫ్ రేషియో (బీఎస్ఆర్) 6.2గా సిబ్బంది ఉండాలి. ఈ అంకెల్లో డ్రైవర్, కండక్టర్, మెకానిక్, ఆఫీస్ స్టాఫ్, కంట్రోలర్, సూపర్వైజర్ రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఇది 4.2గా ఉందని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం పడుతోంది. దీంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించలేకపోతున్నారు. తారు రోడ్లపై అద్దె బస్సులు రీజియన్ పరిధిలోని ఆరు డిపోల్లో రాజధాని, సూపర్‌లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, మినీ పల్లెవెలుగు బస్సులు నడుస్తున్నాయి. ఆర్టీసీ నుంచి పాత బస్సుల స్థానంలో కొత్తబస్సుల రీప్లేస్మెంట్ గత కొన్నేళ్లుగా లేదు. సంస్థ నష్టాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. ఇదిలా ఉంటే అద్దెబస్సుల సంఖ్య ఏటా క్రమంగా పెరుగుతోంది. ఎక్స్‌ప్రెస్ అద్దె బస్సులే అధికంగా ఉన్నాయి. దీంతో ప్రధానంగా ముఖ్యపట్టణాలకు ప్రధాన రోడ్డు మార్గాల్లోనే ఈ బస్సులు పయనిస్తున్నాయి. ఇక రహదారులు సరిగ్గా లేని మార్గాల్లో పల్లెవెలుగు బస్సులు వెళ్తుంటాయి. ఇక దూర ప్రాంతాలకు రాజధాని, లగ్జరీ, సూపర్‌లగ్జరీ, డీలక్స్ బస్సులు నడుస్తుంటాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో వివిధ ప్రాంతాల నుంచి రైలు మార్గాలు ఉన్నా నిర్మల్‌లో ఈ సదుపాయం లేదు. ఆదిలాబాద్‌లో రైలుమార్గం ఉన్నా తక్కువ రైళ్లు ఈమార్గంలో పయనిస్తుండడంతో అత్యధికంగా ప్రయాణికులకు బస్సులే దిక్కు. దీన్ని సొమ్ము చేసుకోవాల్సిన ఆర్టీసీ చేష్టలోడుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ మార్గంలో పదుల సంఖ్యలో వెళ్తుంటాయంటే అర్థం చేసుకోవచ్చు. -
‘ఆర్టీసీ నష్టాలకు అధికారులే బాధ్యులు’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ నష్టాలకు కార్మికుల పనితీరుకు ఏమాత్రం సంబంధం లేదని ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం నేతలు తేల్చి చెప్పారు. అధికారుల పనితీరు సరిగా లేకపోవటం, గతంలో తీసుకున్న అప్పులకు ఇప్పటికీ వడ్డీలు చెల్లిస్తుండటం, భారీగా పెరిగిన డీజిల్ ధరల వల్ల ఆర్టీసీ నష్టాల్లో ఉందని, దానికి కార్మికులను బాధ్యులను చేయటం సరికాదని స్పష్టంచేశారు. వాస్తవాలను దాచి అధికారులు తప్పుడు లెక్కలతో సీఎంనే తప్పుదారి పట్టించారని ఆరోపించారు. బుధవారం ఆర్థిక మంత్రి ఈటల అధ్యక్షతన మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డిలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో మరోసారి ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ ప్రతినిధులతో భేటీ అయింది. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్న సమయంలో జీతాల కోసం పట్టుపట్టడం, సమ్మె నోటీసు ఇవ్వటం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మంగళవారం మంత్రివర్గ ఉపసంఘం, ఆర్టీసీ అధికారులతో చర్చ సందర్భంగా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాటి సమావేశంలో గుర్తింపు సంఘం నేతలు దానికి కౌంటర్ ఇచ్చారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులను బాధ్యులను చేయటం ఏమాత్రం సరికాదని, నష్టాల బూచి చూపి వేతన సవరణ నుంచి తప్పించుకునే ప్రయత్నం సరికాదని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీ సిబ్బంది వేతనాలు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల కంటే తక్కువగా ఉన్నాయని సీఎం అన్న మాటలను ఖండించారు. మహారాష్ట్ర లాంటి చోట్ల ఆర్టీసీ కార్మికుల బేసిక్ తక్కువగా ఉన్నా అలవెన్సులు మనకంటే చాలా ఎక్కువని, మొత్తంగా చూస్తే వారి వేతనాలు తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది వేతనాల కంటే ఎక్కువే ఉంటాయని వివరించారు. ‘‘ఢిల్లీ, హరియాణ లాంటి చోట్ల ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోరు? కావాలంటే ఆర్టీసీ అధికారులతో కలసి తాము అధ్యయనానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. ఉద్యమంలో ముందున్న ఆర్టీసీ కార్మికుల వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకోవాల్సిందే’’అని పేర్కొన్నారు. జాప్యమైతే 25% ఐఆర్ ప్రకటించండి వేతన సవరణ ఇవ్వటం సాధ్యం కాదనుకుంటే ఇంటీరియమ్ రిలీఫ్ (ఐఆర్) 25 శాతం ప్రకటించాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. హరీశ్‌పై గుర్రు: టీఎంయూ గౌరవాధ్యక్షుడిగా ఉన్న మంత్రి హరీశ్‌రావు బుధవారం నాటి సమావేశానికి హాజరయ్యారు. కానీ ఆయన తమకు అనుకూలంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తాము డి మాండ్లపై మొత్తుకుంటున్నా ఏమీ పట్టనట్టు కూర్చున్నారని ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వాదనతో మంత్రులు ఏకీభవించారని, వేతన సవరణ విషయంలో సీఎంతో మరోసారి చర్చిస్తామని మంత్రులు హామీ ఇచ్చారని సమావేశానంతరం ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణరావు, సంఘం ప్రతినిధులు తిరుపతి, థామస్‌రెడ్డి, అశ్వత్థామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమ్మె చేస్తామంటే చేసుకోమనండి ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన ఉదంతం ఎప్పుడైనా ఉందా? మా ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేని తరహాలో కార్మికులు అడిగినదాని కంటే ఎక్కువ ప్రకటిస్తే.. ఇప్పుడు ప్రభుత్వాన్నే బ్లాక్మెయిల్ చేస్తారా? వేతన సవరణ చేయకుంటే సమ్మె చేస్తామని హెచ్చరిస్తారా? అదీ రూ.750 కోట్ల మేర వార్షిక నష్టాలున్నప్పుడు... ఏమనుకుంటున్నారు..? చేస్తామంటే చేసుకోమనండి.. చేస్తే అట్నుంచి అటే పోతే?’’అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి ఆర్టీసీ కార్మిక సంఘాల తీరుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా వేతన సవరణ కోసం ఆర్టీసీ కార్మికులు పట్టుబడుతున్న నేపథ్యంలో ఆయన వారి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. బుధవారం రాత్రి మంత్రివర్గ ఉప సంఘం, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలోనూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెరసి కార్మిక సంఘాల డిమాండ్‌కు తగ్గట్టు వేతన సవరణ జరగదనే స్పష్టమైన సంకేతాలిచ్చారు. అయినా ఈ అంశం మంత్రివర్గ ఉపసంఘం పరిశీలనలో ఉందని, సంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ‘‘నేను ఓ దినమంతా ఆర్టీసీ సమీక్షలో గడిపాను. వేల ఆటోలు, బైకులు రోడ్డుమీదకు వచ్చిన తరుణంలో ఆర్టీసీ ఎలా మనుగడ సాగించాలో స్పష్టంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోమని చెప్పాను. ఆర్టీసీని రక్షించేందుకు రూ.3,400 కోట్ల మొత్తాన్ని విడుదల చేశాం. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా నిధులు పెట్టాం. అయినా ఇంకా డిమాండ్లు చేస్తే ఏమనాలి? సమ్మె చేస్తామంటే చేసుకోమనండి. కార్మికులు, యాజమాన్యం అంతా కలిసి మునుగుతారు’’అని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లాంటి కొన్ని రాష్ట్రాల్లో అసలు ఆర్టీసీలే లేవని, కేరళలో బస్సుల సంఖ్య బాగా తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తుంటే వారు పట్టించుకోకుండా సమ్మెకు పోతామంటే చేసేదేముంటుందని ప్రశ్నించారు. అధికారులు తనకు ఇచ్చిన లెక్కలు తప్పులని, నన్ను తప్పుదోవ పట్టించారని కార్మిక సంఘాలు అనడం తప్పన్నారు. ఓ ముఖ్యమంత్రికి తప్పుడు లెక్కలు ఎలా ఇవ్వగలుగుతారని, వాస్తవ పరిస్థితిని తనకు అధికారులు వివరించారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ విషయంలో పూర్తి సానుకూలత వ్యక్తం చేయటమే కాకుండా ఉద్యోగుల పనితీరుపై అభినందనల వర్షం కురిపించిన సీఎం.. అదే వేదికపై ఆర్టీసీ కార్మిక సంఘాల తీరుపై విమర్శల వర్షం కురిపించటం విశేషం. -
బిస్లరీ వాటర్ బాటిళ్లనే అమ్మాలంటున్నారు
ఆర్టీసీ సర్క్యులర్‌పై హైకోర్టును ఆశ్రయించిన వ్యాపారులు సాక్షి, హైదరాబాద్: బస్టాండ్లలో బిస్లరీ వాటర్ బాటిళ్లనే అమ్మాలని ఆర్టీసీ అధికారులు జారీ చేసిన సర్క్యులర్‌పై పలువురు వ్యాపారులు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. తమ వ్యాపారంలో జోక్యం చేసుకోకుండా వారిని ఆదేశించాలని డి.జాహెద్ బాషా, మరో 19 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సి.రామచంద్రరాజు వాదనలు వినిపిస్తూ.. బస్టాండ్లలో బిస్లరీ వాటర్ బాటిళ్లనే అమ్మాలని, ఒకే పంపిణీదారు నుంచి వాటిని కొనుగోలు చేయాలని ఆర్టీసీ అధికారులు గత డిసెంబర్ 9న సర్క్యులర్ జారీ చేశారని చెప్పారు. దీంతో సాధారణం కన్నా ఎక్కువ ధరకు బాటిళ్లను వ్యాపారులు కొనుగోలు చేయాల్సి వస్తోందని వివరించారు. ఇతర కంపెనీల బాటిళ్లను విక్రయించొద్దని కూడా ఆదేశాలు జారీ చేశారని, అధికారుల నిర్ణయం వల్ల పిటిషనర్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. అన్ని కంపెనీల వాటర్ బాటిళ్లనూ విక్రయించేందుకు అనుమతినిచ్చేలా అధికారులను ఆదేశించాలని కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. -
రోడ్డుంటే చాలు బస్సు నడపండి
- ఆర్టీసీ అధికారులకు చైర్మన్ సోమారపు దిశానిర్దేశం - నిర్వహణ వ్యయం దక్కితే చాలు - నష్టాల పేరుతో బస్సులు రద్దు చేయొద్దు - ఆక్యుపెన్సీ రేషియో పెంచి లాభాల్లోకి తేవాలి - రోడ్లు బాగోకుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి సాక్షి, హైదరాబాద్: ‘‘నష్టాల బూచీ చూపి పల్లెలకు బస్సులు రద్దు చేయటం సరికాదు. బస్సు నిర్వహణ వ్యయం కంటే ఒక్క రూపాయి ఎక్కువ వచ్చినా చాలు.. సిబ్బంది జీతాలను లెక్కించకుండా ఆ మార్గం లో బస్సు నడపండి. రోడ్డు బాగుంటే చాలు బస్సుతో ఆ ఊరిని అనుసంధానం చేయండి’’ అని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అధికారులకు దిశానిర్దేశం చేశారు. రోడ్డు బాగులేని చోట దాన్ని బాగుచేసేలా సంబంధిత విభాగాలకు సూచించి మరీ బస్సులు నడుపుదామని అన్నారు. ‘‘ప్రజలకు బస్సులను అందుబాటులోకి తెచ్చి, ఆక్యుపెన్సీని పెంచటం ద్వారా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు రావాలి’ అని సూచించారు. రాష్ట్రంలో 1,341 గ్రామాలకు బస్సులు నడవని తీరు, ఏకంగా మండల కేంద్రాలకూ అందుబాటులో లేని దుస్థితిని వివరిస్తూ వరుసగా రెండ్రోజులపాటు ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలపై ఆయన స్పందించారు. బుధవారం ఆర్టీసీ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని గ్రామాలను తనిఖీ చేయండి డిపో మేనేజర్లు తమ పరిధిలోని అన్ని ఊళ్లను తనిఖీ చేసి, ఏయే గ్రామాలకు బస్సు నడుస్తుందీ, ఏయే పల్లెలకు ఆ వసతి లేదో గుర్తించాలని సత్యనారాయణ పేర్కొన్నారు. అన్ని పల్లెలను ఆర్టీసీతో అనుసంధానించాలంటే తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. రోడ్డు బాగుండి, నిర్వహణ ఖర్చులకు సరిపోయేలా ఆదాయం వచ్చే ఊళ్లకు వెంటనే బస్సులు ప్రారంభించాలన్నారు. అంతకంటే తక్కువ ఆదాయం వచ్చి కనీసం డీజిల్ ఖర్చుకు కూడా సరిపోని పరిస్థితి ఉంటే ఆక్యుపెన్సీ రేషియో పెంచే చర్యలు తీసుకున్న తర్వాత బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన గోదావరిఖనిలో సిటీబస్సుల అంశాన్ని ఉదహరించారు. ఆ బస్సులు ప్రారంభించిన ప్పుడు ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) 20 శాతం వరకే ఉందని, ఇప్పుడు అది 55 శాతానికి చేరుకుందన్నారు. అధికారులు దృష్టి సారిస్తే ఓఆర్ పెరుగుతుందన్నారు. గ్రామాలను ఆర్టీసీతో అనుసంధానించే విషయంలో లాభనష్టాలతో బేరీజు వేసుకోవద్దని, కానీ క్రమంగా వాటిని లాభాల బాట పట్టించే చర్యలు మాత్రం కచ్చితంగా తీసుకోవాలని సూచించారు. ఆర్టీసీ కార్మికులకు వేతనాలొచ్చాయ్! సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు ఎట్టకేలకు వేతనాలు విడుదల య్యాయి. అక్టోబర్ నెలకు సంబంధించి వేతనాలను నవంబర్ 1న ఇవ్వకపోవడంతో సంస్థలో కలకలం చెలరేగిన విషయం తెలిసిందే. 1వ తేదీన వేతనాలు చెల్లించలేకపోవటం ఆర్టీసీ చరిత్రలో ఇదే తొలిసారి. సరిపడా నిధులు లేకపోవడంతో నాలుగైదు రోజులు ఆపేసి, రోజువారీ ఆదాయం పోగు చేసి చెల్లించాలని నిర్ణయించారు. దీన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో బుధవారం సాయంత్రం వేతనాల మొత్తాన్ని బ్యాంకు లో జమచేయడంతో కార్మికుల ఖాతాల్లో జీతాలు పడ్డాయి. తక్కువ పడ్డ దాదాపు రూ.30 కోట్ల మొత్తాన్ని అప్పుగా తెచ్చి సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది. -
ఆర్టీసీకి ‘లోఫ్లోర్’ కష్టాలు!
జేఎన్ఎన్యూఆర్ఎం కింద కేంద్రం అంటగట్టిన లోఫ్లోర్ బస్సులు - ఆరేళ్లకే నడవలేక మొరాయించిన వైనం - మరమ్మతులతో రూ.కోట్లలో వ్యయం - భరించలేక పాత బాడీ తీసేసి కొత్తగా బాడీ ఏర్పాటు - ప్రతి బస్సుకు రూ.10 లక్షల చొప్పున రూ.100 కోట్ల ఖర్చు - కేంద్రం సాయం కంటే ఈ వ్యయమే ఎక్కువ సాక్షి, హైదరాబాద్: ‘చారానా కోడికి బారానా మసాలా..’.. జేఎన్ఎన్యూఆర్ఎం బస్సుల విషయంలో ఆర్టీసీ అధికారులు ఇదే సామెతను గుర్తుచేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా అంటగట్టిన లోఫ్లోర్ బస్సులతో తిప్పలు పడలేక ఆర్టీసీ సతమతం అవుతోంది. కొత్త బస్సులు కొనేందుకు అవకాశం లేక.. ఆ బస్సులనే మన పరిస్థితులకు అనుగుణంగా మార్చేందుకు భారీగా ఖర్చు చేస్తోంది. లోఫ్లోర్ బస్సుల కోసం కేంద్రం తన వంతు వాటాగా చేసిన ఆర్థిక సాయం కంటే.. ఇప్పుడు వాటిని బాగుచేసుకునేందుకు ఆర్టీసీ చేస్తున్న ఖర్చే ఎక్కువగా ఉండడం గమనార్హం. మొత్తంగా ఆ బస్సులతో ఇంతకాలం వచ్చిన నష్టాలతో ఖజనాకు కన్నం పడితే, బాగు చేసుకుంటేగాని నడవని స్థితిలో ఉన్న వాటికి ఇప్పుడు పెడుతున్న ఖర్చు ఆర్టీసీకి తడిసి మోపడవుతోంది. మోయలేని భారం.. విదేశీ నగరాల్లో నేల నుంచి తక్కువ ఎత్తులో ఫ్లోర్ (బస్సులో మన పాదాల కింద ఉండే భాగం) ఉండే బస్సులు ఆకట్టుకుంటాయి. వాటినే లోఫ్లోర్ బస్సులుగా చెబుతారు. అదే మన బస్సులు ఎత్తుగా ఉండి.. మూడు నాలుగు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అది వృద్ధులకు, పెద్ద వయసువారికి ఇబ్బంది కలిగించే అంశం. దీంతో విదేశీ తరహాలో లోఫ్లోర్ బస్సులను తేవాలని భావించిన అప్పటి యూపీఏ-2 ప్రభుత్వం... జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద దేశవ్యాప్తంగా వాటిని మంజూరు చేసింది. సాధారణంగా జేఎన్ఎన్యూఆర్ఎం కింద కేంద్రం తన వాటా నిధులు విడుదల చేస్తే... మిగతా నిధులను ఆర్టీసీ, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కలుపుకొని బస్సులు కొనుగోలు చేస్తాయి. కానీ 2010లో కేంద్ర ప్రభుత్వమే బస్సులను బాడీతోసహా రూపొందించి సరఫరా చేసే బాధ్యతను పలు కంపెనీలకు అప్పగించింది. అలా హైదరాబాద్‌కు వెయ్యి బస్సులు మంజూరు చేసింది. అందులో టాటా కంపెనీ మార్కోపోలోతో ఒప్పందం కుదుర్చుకుని సరఫరా చేసిన బస్సుల బాడీ దారుణంగాఉండటంతో పాటు ఆ నమూనా మన రోడ్లకు సరిపడలేదు. దాంతో కొద్దిరోజుల్లోనే ఆ బస్సులు బాగా దెబ్బతిన్నాయి. నిత్యం మరమ్మతులు చేస్తూ ఉంటేనే తప్ప కదలలేని స్థితికి చేరడంతో.. ఆర్టీసీకి భారీగా చేతి చమురు వదలడం మొదలైంది. అంతేగాకుండా ఆ బస్సుల బాడీ ఉక్కు (మైల్డ్ స్టీల్)తో రూపొందడంతో బరువు ఎక్కువగా ఉండి మైలేజీ తగ్గి ఖర్చు మరింత పెరిగింది. సాధారణంగా ఒక బస్సు 12 లక్షల కిలోమీటర్లు తిరిగినా.. 15 సంవత్సరాల పాటు కొనసాగినా, వాటిని తుక్కు కింద పరిగణించవచ్చు. కానీ ఈ బస్సులు ఆరేళ్లకే తుక్కుగా మారాయి. నిబంధనల ప్రకారం తుక్కు కింద తొలగించే అవకాశం లేదు, వాటి స్థానంలో కొత్త బస్సులు సమకూర్చుకునే స్థోమత ఆర్టీసీకి లేదు. దీంతో వాటి బాడీని తొలగించి హైదరాబాద్ రోడ్లకు తగిన నాణ్యతతో, సాధారణ డిజైన్ బాడీని అమర్చడం మొదలుపెట్టారు. ఒక్కో బస్సుకు రూ.10 లక్షలు ఖర్చు జేఎన్ఎన్యూఆర్ఎం కింద ఇచ్చిన ఆ బస్సుల బాడీని తీసేసి.. అల్యూమినియంతో సాధారణ డిజైన్‌లో రూపొందించే పని మొదలుపెట్టారు. మియాపూర్‌లోని ఆర్టీసీ బస్ బాడీ యూనిట్‌కు ఈ బాధ్యత అప్పగించారు. అక్కడ నెలకు 25 బస్సులకు మించి బాడీ రూపొందించే సామర్థ్యం లేదు. దీంతో ఈ సంవత్సరం 300 బస్సులకు కొత్త బాడీలు రూపొందించే పని మొదలుపెట్టి.. 175 బస్సులకు అమర్చారు. ఇందుకోసం ఒక్కో బస్సుకు రూ.10 లక్షలు ఖర్చవుతోంది. దీంతో కేంద్రం ఇచ్చిన వాటా సంగతేమోగానీ.. ఆర్టీసీ ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే బస్ బాడీ మార్చాక బరువు తగ్గి వాటి మైలేజీ బాగా మెరుగుపడిందని, ఆక్యుపెన్సీ రేషియో కూడా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇక భవిష్యత్తులో కేంద్రం నుంచి వాటా నిధులే తప్ప బస్సులు తీసుకోవద్దని ఆర్టీసీ గట్టిగా నిర్ణయించుకుంది. -
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా ?
ఆర్టీసీ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం పర్వతగిరి : విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ ఆర్టీసీ అధికారులపై ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కల్లెడలో పీఏసీఎస్ నూతన భవనాన్ని ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల సమయంలో తిరిగి హన్మకొండకు వెళ్తుండగా.. అటువైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఫుట్‌పాత్‌పై విద్యార్థులు ప్రయాణించడాన్ని గమనించి బస్సును నిలిపివేయించారు. ఇలా ఎందుకు ఎక్కారని విద్యార్థులను ప్రశ్నించగా, బస్సులు సమయానికి రావని, తమను ఆర్టీసీ అధికారులు చులకనగా చూస్తారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కొన్నిసార్లు బస్సు కూడా ఆపరని చెప్పారు. దీంతో ఆయన హన్మకొండ డీఎంతో ఫోన్లో మాట్లాడి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. -
ఉద్రిక్తంగా మారిన ప్రహరీ గోడ నిర్మాణం
జూబ్లి బస్టాండ్ సమీపంలో ఉన్న పికెట్ గాంధీనగర్ లోమంగళవారం తెలంగాణ ఆర్టీసి అధికారులు ఖాళీ స్థలం చుట్టూ ప్రహారిగోడ నిర్మాణాన్ని చేపట్టారు. రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రహారిగోడ నిర్మించవద్దంటు గాంధీనగర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త్త పరిస్థితి నెలకొంది. ఆర్టీసి అధికారులు చేపట్టిన ప్రహారిగోడ నిర్మాణాన్ని అడ్డుకోవడంతో బారిగా పోలీసులు మోహరించారు. ఆలయం చుట్టూ గోడ నిర్మాణ ం చేపడితే ఆత్మహత్యకు పాల్పడుతాం అంటు కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ఆర్టీసి అధికారులు గత నెల పికెట్ గాంధీ కాలనీ లో ఉన్న సుమారు 300 గుడిసెలను తొలగించి స్థలాన్ని స్వాదిన పరుచుకున్నారు. చుట్టూ ప్రహారిగోడ నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన జేఎన్‌ఎన్‌యుఆర్‌యం లో వందల మంది కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. స్థానికంగా ఉన్న ఎల్లమ్మ ఆలయం లో పూజలు నిర్వహిస్తుంటారు.ఆలయం ఆర్టీసి స్థలంలో ఉండటంతో అధికారులు చుట్టూ గోడ నిర్మించేందుకు ప్రయత్నాలు చేశారు. కాలనీ వాసులుకు అండగా ఎమ్మేల్యే సాయన్న అమ్మవారి ఆలయం వద్ద నిర్మిస్తున్న ప్రహారిగోడ విషయాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యేసాయన్న దష్టికి తీసుకు వెళ్లారు. వెంటనే పికెట్ గాందీ కాలనీ కి చేరుకున్న సాయన్న ఆర్టీసి అధికారులుకు సర్ధిచెప్పారు.అయితే అధికారులు స్పందించక పోవడంతో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడి ప్రహారిగోడ పనులను నిలిపి వేయాలని కోరారు. మంత్రి గారి ఆదేశాలతో అర్టీసి ఆధికారులు వెనుదిగారు. కాలనీ వాసులకు అలయం చుట్టు కొంత స్థలాన్ని కేటాయిచనున్నట్లు సాయన్న కాలనీ వాసులకు హామి ఇచ్చారు.దీంతో కాలనీ వాసులు ఆందోళన విరమించారు. -
ఏసీ బస్సుల్లో ఫ్రీ వైఫై
- నెలాఖరుకు గ్రేటర్‌లోని 115 బస్సుల్లో అందుబాటులోకి - అత్యధిక సామర్థ్యం ఉన్న ఎయిర్టెల్ 4జీ నెట్వర్క్ - రెండు విడతలుగా గంట పాటు ఉచిత ఇంటర్నెట్ - రెండు రూట్లలో ఆర్టీసీ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)కి చెందిన ఏసీ బస్సుల్లో పయనిస్తున్నారా.. అయితే ఇకపై మీరు వైఫై ద్వారా ఉచితంగా ఇంటర్నెట్ను పొందవచ్చు. గంట పాటు ఉచితంగా ఇంటర్నెట్ను వినియోగించుకునే అద్భుతమైన అవకాశాన్ని ఆర్టీసీ మీకు కల్పించనుంది. అత్యధిక సామర్థ్యం ఉన్న ఎయిర్టెల్ 4జీ నెట్‌వర్క్‌తో కావలసిన డాటా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మహాత్మాగాంధీ, జూబ్లీ బస్ స్టేషన్లలో మాత్రమే ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పించిన ఆర్టీసీ.. నగరంలో తిరుగుతున్న 115 ఏసీ బస్సులకు సైతం ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు, ఈసీఐఎల్ నుంచి వేవ్‌రాక్ వరకు నడిచే రెండు ఏసీ బస్సుల్లో దీనిని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టగా విజయవంతమైంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఏసీ బస్సులన్నింటికీ ఈ నెలాఖరు నాటికి ఉచిత వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. స్మార్ట్ఫోన్లు వినియోగించే ప్రయాణికులు ఏసీ బస్సులో ప్రయాణించే సమయంలో అరగంట చొప్పున రెండు విడతలుగా 4జీ నెట్వర్క్ సామర్థ్యం ఉన్న ఎయిర్టెల్ ఇంటర్నెట్ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం బస్సుల్లో వైఫై రూటర్లను అమర్చనున్నారు. ప్రయాణికులు బస్సులోకి ప్రవేశించిన వెంటనే తమ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై సిగ్నల్స్‌ను అందుకుంటారు. వైఫై సేవలను వినియోగించుకునేందుకు సిద్ధపడిన వారికి పాస్వర్డ్ డిస్ప్లే అవుతుంది. మొదటి అరగంట ఉచితంగా నెట్వర్క్ అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత ఇంటర్నెట్ సేవలు ఆగిపోతాయి. మరో అరగంట కావాలనుకుంటే మరోసారి వైఫై నెట్వర్క్ ఓపెన్ చేయాలి లేదా తిరుగు ప్రయాణంలో మిగతా అరగంట వినియోగించుకోవచ్చు. ఐటీ వర్గాలకు ప్రయోజనం.. నగరంలోని ఉప్పల్, మెహదీపట్నం, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, కోఠి, పటాన్చెరు, లింగంపల్లి, ఈసీఐఎల్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి హైటెక్‌సిటీ, వేవ్‌రాక్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ తదితర ఐటీ కారిడార్లకు మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే సికింద్రాబాద్, జూబ్లీ బస్ స్టేషన్, జేఎన్టీయూ, పర్యాటక భవన్ల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పుష్పక్ ఏసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రెండు కేటగిరీల్లోని 115 ఏసీ బస్సులకు ఈ ఉచిత వైఫైను అమలు చేస్తారు. దీనివల్ల నిత్యం బస్సుల్లో రాకపోకలు సాగించే ఐటీ నిపుణులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. -
పని ఇవ్వకున్నా జీతం చెల్లించాల్సిందే
ఏపీ, తెలంగాణ ఆర్టీసీలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: అనారోగ్య కారణాలతో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించలేని వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగం చూపేంతవరకు పక్కన పెడితే ఆ కాలానికి కూడా జీతభత్యాలు చెల్లిం చాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రత్యామ్నాయంగా మరో ఉద్యోగం ఇచ్చినప్పటికీ, వారికి డ్రైవర్ హోదాలో వచ్చిన జీతభత్యాలను ఇవ్వాల్సిందేనంది.ప్రత్యామ్నాయ ఉద్యోగానికి ఎంతిస్తారో అంతే ఇస్తామంటే కుదరదంది. ఖాళీలు లేకపోతే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించాలని ఆదేశించింది. ఏపీ, తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యాలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని, ఇలాంటి వివాదాలకు ముగింపు పలకాలని మందలించింది. ఆనారోగ్య కారణాలవల్ల పని కల్పించకుండా పక్కన పెట్టిన మొత్తంకాలానికి డ్రైవర్‌కు జీతభత్యాలు చెల్లిం చాలని, 8శాతం వడ్డీతో బకాయిలను కూడా ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. తీర్పు కాపీ అందుకున్న నాటి నుంచి 8 వారాల్లోపు దీన్ని అమలు చేయాలంది. ప్రత్యామ్నాయ ఉద్యోగం ఇవ్వలేకపోతే, ఖాళీలు ఏర్పడే వరకు లేదా పదవీ విరమణ వయస్సు వరకు అతడిని సూపర్ న్యూమరరీ పోస్టులో ఉంచాలంది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు తీర్పునిచ్చారు. ఉద్యోగిని గౌరవంగా చూడాలి ‘‘ఓ ఉద్యోగి విధులు నిర్వర్తించాలని భావిస్తున్నప్పుడు అతడిని సెలవుపై వెళ్లాలని ఆదేశించడానికి వీల్లేదు. అనారోగ్య కారణాలతో డ్రైవర్ గా పనిచేయలేరని మెడికల్ బోర్డు తేల్చిన నాటి నుంచి ఆ వ్యక్తి ప్రత్యామ్నాయ ఉద్యోగం పొం దే వరకు లేదా పదవీ విరమణ వరకు విధి నిర్వహణలో ఉన్నట్లే. ప్రతికూల పరిస్థితుల మధ్య పనిచేసే డైవర్లు అనారోగ్యం పాలవుతుంటారు. డ్రైవర్ కంటి చూపు సక్రమంగా లేకపోతే ప్రయాణికులకు ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో అతడు విధులు నిర్వర్తించలేడని మెడికల్ బోర్డు తేలుస్తుంది. అయితే, ఈ వైకల్యం డ్రైవర్ విధులు మినహా మిగిలిన విధులు నిర్వర్తించడానికి అడ్డుకాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తికి డ్రైవర్ హోదా ఉండే మరో ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగిని గౌరవంగా చూడాల్సిన బాధ్యత యజమానిది. ఆ గౌరవాన్ని యజమాని నుంచి ఆశించే హక్కు ఉద్యోగికి ఉంది. ఈ తీర్పుతో భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు పునరావృతం కావని ఆశిస్తున్నా’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇదీ వివాదం.. అనారోగ్య కారణాల వల్ల విధులు నిర్వర్తించలేరని మెడికల్ బోర్డు తేల్చిన డ్రైవర్లను ఆర్టీసీ అధికారులు పక్కన పెడుతున్నారు. వారిని సెలవుపై వెళ్లాలని ఆదేశిస్తున్నారు. పక్కన పెట్టిన కాలానికి జీతభత్యాలు చెల్లిం చడం లేదు. ప్రత్యామ్నాయంగా తక్కువస్థాయి ఉద్యోగం ఇస్తూ, డ్రైవర్ హోదాలో ఇచ్చిన జీతభత్యాలను చెల్లించడం లేదు. వీటన్నింటినీ సవాలు చేస్తూ పలువురు ఆర్టీసీ డ్రైవర్లు 2013లో హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న జస్టిస్ నవీన్‌రావు గతవారం తీర్పు వెలువరించారు. -
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి విద్యార్థిని బలి
విజయవాడ : బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో కళాశాల విద్యార్థిని మృతి చెందిన సంఘటన మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జగ్గయ్యపేట సమీపంలోని పెంటెలవారిగూడెం ప్రాంతానికి చెందిన రావూరి జ్యోత్స్న (21) నగరంలోని లయోలా కళాశాలలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. మొగల్రాజపురం సిద్ధార్థ అకాడమీ వద్ద ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ప్రతిరోజు కళాశాలకు రాకపోకలు సాగిస్తోంది. గురువారం ఉదయం జ్యోత్స్న ఏపీ11జెడ్ 6411 నంబరు గల ఆర్టీసీ బస్సు ఎక్కి కాలేజీ గేటు వద్ద దిగుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో బస్సు ముందు టైరు కింద పడి తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించారు. మృత్యువుతో పోరాటం బస్సుకింద పడిన జ్యోత్స్న శరీరంలో సగభాగం పూర్తిగా చిధ్రమైంది. రోజంతా మృత్యువుతో పోరాడి శుక్రవారం ఉదయం మృతి చెందింది. దీంతో విద్యార్థులు, స్నేహితులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. వైద్యం చేస్తున్నంత సేపట్లో దాదాపు 32 బ్లడ్ బాటిల్స్ తెప్పించిన వైద్యులు జ్యోత్స్నను బతికించడంలో విఫలమయ్యారని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆందోళన పేద కుటుంబానికి చెందిన జ్యోత్స్న తండ్రి రామారావు వ్యవసాయం చేస్తారని బంధువులు తెలిపారు. ఆమె మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ విద్యార్థులు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఆర్టీసీ అధికారులు ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్ పొన్నపల్లి సతీష్‌కుమార్‌ను అరెస్టు చేశారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఆర్టీసీ బస్సులో మంటలు
సాక్షి,సిటీబ్యూరో/రాంగోపాల్‌పేట్ : నడుస్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంట లొచ్చి తగలబడిపోయింది. ప్రయాణికులు వెంటనే బస్సు దిగి బయటకు పరుగు తీయడంతో పెనుప్రమాదం తప్పింది. మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు... జీడిమెట్ల డిపోకు చెందిన రూట్- 29 బస్సు (ఏపీ 11జడ్ 7403) గురువారం ఉదయం 8.25కి జగద్గిరిగుట్ట నుంచి సికింద్రాబాద్ వెళ్తోంది. బస్సు ప్యాట్నీ చౌరస్తాకు చేరుకోగానే ఆగిపోయింది. డ్రైవర్ నరసింహ బస్సును స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా బానెట్ వద్ద శ బ్దం వచ్చింది. ఆ వెంటనే పొగ, మంటవచ్చింది. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించేశాడు. కొద్ది నిమిషాల్లోనే మంటలు బస్సు ముందు భాగమంతటా వ్యాపించి బస్సు దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. బస్సు ఇంజిన్, బానెట్, ఇతర భాగాలన్నీ పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చని ఆర్టీసీ అధికారులు, పోలీసులు భావిస్తున్నారు. సికింద్రాబాద్ ఆర్ఎం కొమరయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహంకాళీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తరచూ ప్రమాదాలు.... బస్సుల నిర్వహణలో ఆర్టీసీ వైఫల్యం పరాకాష్టకు చేరింది. తరచూ ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు జ రుగుతూనే ఉన్నాయి. గతంలో లక్డీకాఫూల్ వద్ద, శంషాబాద్ విమానాశ్రయ మార్గంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. గురువారం బస్సులో మం టలంటుకున్న సమయంలో 20 మంది ప్రయాణికులు మాత్రమే ఉండటంతో వేగంగా కిందకు పరుగెత్తగలిగారు. బస్సు ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటే మాత్రం ప్రమాదం ఏ స్థాయిలో ఉండేదో ఊహించుకోలేం. బస్సు సెల్ఫ్ స్టార ్టర్ ఫెయిల్ కావడం, డ్రైవర్ అదే పనిగా స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో స్పార్క్ (నిప్పురవ్వలు) వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఎఫ్ఆర్సీ ప్లాస్టిక్‌తో రూపొందించినది కావడం వల్ల ఇంజిన్ బానెట్ త్వరగా అంటుకుందని గుర్తించారు. పైగా ఎలక్ట్రికల్ వైర్లు బాగా పాతబడి పోయాయని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. గురువారం సికింద్రాబాద్‌లో కానీ, కొద్ది రోజుల క్రితం నల్లకుంట.. అంతకుముందు లక్డీకాఫూల్, శంషాబాద్ల్లో మంటలంటుకున్న బస్సులన్నీ మెట్రో ఎక్స్‌ప్రెస్, లోఫ్లోర్ బస్సులే కావడం గమనార్హం. ఈ బస్సుల నిర్వహణపై నిర్లక్ష్యం, సకాలంలో విడిభాగాలు ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. రోజూ బ్రేక్డౌన్ల కారణం గా పదుల సంఖ్యలో బస్సులు రోడ్లపైనే నిలిచిపోతున్నా యి. ఈ రెండు మూడేళ్లలో జరిగిన అగ్నిప్రమాదాల్లో అ దృష్టవశాత్తు ఎక్కడా ప్రయాణికులకు ఎలాంటి ప్రమా దం జరగకపోవడం సంతోషించదగ్గ విషయం. ఒకవేళ ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా సిటీ బస్సుల్లో పయనించినందుకు భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చేది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 28 డిపోలలో 3850 బస్సులు ఉంటే వాటిలో సుమారు 1000 బస్సులు డొక్కువే. సకాలంలో విడిభాగాలు అమర్చకపోవడం, మరమ్మతులు చేయకపోవడం, నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ఈ బస్సులు తరచూ బ్రేక్డౌన్లకు గురవుతున్నాయి. భయంకరమైన కాలుష్యాన్ని చిమ్ముతున్నా యి. ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. -
డబ్బాల తొలగింపుతో ఉద్రిక్తత
♦ ఆర్టీసీ అధికారులతో యజమానుల వాగ్వాదం ♦ పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన పరిస్థితి చేవెళ్ల : మండల కేంద్రంలోని బస్‌స్టేషన్ ఎదుట హైదరాబాద్-బీజాపూర్ ప్రధాన రహదారిపై ఉన్న డబ్బాలు, చిరువ్యాపారుల తోపుడుబండ్లను ఆదివారం ఆర్టీసీ అధికారులు తొలగిం చారు. వారితో దుకాణా యజమానులు వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాలిలా ఉన్నాయి. సుమారు ఐదేళ్లక్రితం చేవెళ్ల బస్‌స్టేషన్ ఆవరణలో ఆర్టీసీ అధికారులు దుకాణాల సముదాయం నిర్మించారు. వీటికి టెండర్లు పిలిచి కొందరికి దుకాణాలు కేటాయించారు. అయితే వాటి ఎదుటే ఎన్నో ఏళ్లుగా డబ్బాలు, తోపుడు బండ్లను పెట్టుకుని పండ్లు, పూలు, కొబ్బరిబొండాం, టిఫిన్‌సెంటర్, చెప్పులు కుట్టేవారు తదితర చిరువ్యాపారులు వ్యాపారం చేసుకుంటున్నారు. బస్సులు నిలపడానికి స్థ లంలేకపోవడంతో రోడ్డుపైనే నిలపడం, హైదరాబాద్-బీజాపూర్ రహదారికి బస్‌స్టేషన్ ఆనుకునే ఉండ టంతో ఇక్కడి నుంచి డబ్బాలను ఖాళీ చేయాలని యజమానులకు ఆర్టీసీ అధికారులు కొన్ని నెలలక్రితం నోటీసులిచ్చినా పట్టిం చుకోలేదు. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మిం చిన దుకాణాల సముదాయం నిరుపయోగంగా ఉంది. అలాగే ఇటీవల రాష్ర్ట రవాణా మంత్రి పి.మహేందర్‌రెడ్డి తాండూరుకు వెళ్లే సమయంలో బస్సులు స్టేషన్లోకి వెళ్లడానికి స్థలంలేక కాన్వాయ్‌కు అడ్డంగా నిలిపారని పోలీసు లు ఆర్టీసీ డ్రైవర్లకు జరిమానా విధించారు. అంతేగాక బస్‌స్టేషన్ ఎదుట ప్రధాన రహదారికి ఆనుకుని వీటిని ఏర్పాటు చేసుకోవడంతో నిత్యం ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతున్నాయి. చివరకు ఆదివారం ఉదయం పోలీసు ల బందోస్తు మధ్య జేసీబీ సాయంతో వాటిని తొలగించారు. ఈ కార్యక్రమాన్ని వికారాబాద్ ఇన్చార్జి డీఎం రాఘవేందర్‌రెడ్డి, డిప్యూటీ సీటీఎం విజయభాను పర్యవేక్షించారు. దీంతో అధికారులతో డబ్బా యజ మానులు కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. సీపీఐ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కె.రామస్వా మి, బీజేపీ మం డల మాజీ అధ్యక్షుడు ఎ.శ్రీ నివాస్ తదితరులు మాట్లాడుతూ చిరువ్యాపారులకు ప్రత్యామ్నా యం చూపించాలని డిమాండ్ చేశారు. 35ఏళ్లుగా పూల వ్యాపారం 35ఏళ్లుగా బస్‌స్టేషన్ ముందు పూల వ్యాపారం చేసుకుంటున్నా. తాత్కాలికంగా కట్టెలతో చిన్న షెడ్ వేసుకుని పూలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. అధికారులు నిర్దాక్షిణ్యంగా వీటిని తొలగించారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్లాలి. ఎక్కడైనా స్థలం కొందామన్నా వేలకువేలు పెట్టినా గజం భూమికూడా దొరికే పరిస్థితిలేదు. ఏంచేయాలో తోచడంలేదు. - సీతారాం, పూల వ్యాపారి, చేవెళ్ల కుటుంబాన్ని ఎలా పోషించాలి ఎన్నో ఏళ్లనుంచి బస్‌స్టేషన్ వద్ద పండ్లు అమ్ముకుంటున్నాను. నాకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. భర్త గ్రామాల్లో తిరిగి పాత ఇనుప సామాను కొంటాడు. ఇప్పుడు తోపుడుబండిని తొలగిస్తే మేము ఏం చేసుకుని బతకాలి. ప్రభుత్వమే ఏదో ఒకచోట స్థలం చూపించాలి. లేకుంటే బతకడమే కష్టమవుతుంది. - జాహేదా, పండ్ల వ్యాపారి, చేవెళ్ల -
ఇదేమి శిద్దాంతం
♦ రంగంలోకి స్టూడెంట్ స్పెషల్స్ ♦ బస్సు మిస్సయితే చేతికి భారమే ♦ ప్రయోగాత్మకంగా జిల్లాలో ఐదు సర్వీసులు ♦ అద్దంకిలో ఒకటి ప్రారంభం, మరో మూడు డిపోల్లో సిద్ధం ♦ స్టడీ అవర్స్ ఉన్నా..అదనపు క్లాసులు జరిగినా విద్యార్థులకు చేతి చమురే ఒంగోలు : తగ్గుతున్న ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ఆర్టీసీ అధికారులు స్టూడెంట్ స్పెషల్’ పేరుతో విద్యార్థులపై అదనపు భారం మోపడానికి తెరదీశారు. విద్యార్థులకు మరిన్ని సేవలు అందిస్తున్నామని ఆర్టీసీ చెబుతూ చాపకింద నీరులా జేబుకు చిల్లుపెడుతున్నారు. ఇప్పటికే అద్దంకి డిపోలో ఒక బస్సు ప్రారంభం కాగా మరో మూడు డిపోలను రోడ్డుపైకి తేవడానికి కసరత్తు చేస్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర రవాణాశాఖా మంత్రి శిద్దా రాఘవరావు సొంత జిల్లాలోనే స్టూడెంట్స్‌కు సెగ ప్రారంభించారు. ఇదీ పరిస్థితి... అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆర్టీసీ సర్వే నిర్వహించింది. ప్రయివేటు వాహనాల్లో తిరుగుతున్న రూట్లను గుర్తించారు. కందుకూరు నుంచి విజయవాడకు, కనిగిరి నుంచి విజయవాడకు ఎక్కువుగా తిరుగుతున్నట్టుగా నిర్థరించారు. ఇక నిత్యం హైదరాబాదుకు స్టేజీ క్యారియర్లుగా నడుపుతున్న సర్వీసులు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. వీటిని నిరోధించాల్సింది ఆదాయం పెంచుకోవల్సిందిపోయి ఉరిమి,ఉరిమి మంగళంపై పడ్డట్టు విద్యార్థులపై వీరి కన్ను పడింది.రద్దీ సమయాలలో ‘పల్లె వెలుగు’ బస్సులలో విద్యార్థులు ఎక్కడం వల్లే ప్రయాణికులు బస్సులు ఎక్కలేక ఇతర వాహనాలను ఆశ్రయిస్తున్నారని, ఈ కారణంగానే ఆక్యుపెన్సీ రేషియో కూడా పడిపోతుందంటూ ఆర్టీసీ అధికారులు లెక్కల చిట్టా విప్పారు. వీటికి పరిష్కారం విద్యార్థుల కోసం ‘స్టూడెంట్స్ స్పెషల్ బస్సులను’ తెరపైకి తెచ్చారు. ఇబ్బందులేమిటి... ఇప్పటివరకు ఆర్టీసీ బస్సులలో విద్యార్థి ఉదయం బస్సు ఎక్కి కళాశాల లేదా స్కూలుకు వెళితే సాయత్రం 8 గంటలలోపు తిరిగి ఇంటికి చేరుకునేందుకు దృష్టి సారించేవాడు. అందుకు కారణాలు అనేకం. విద్యార్థికి 35 కిలోమీటర్ల వరకు రాయితీ బస్సు పాసు (ఊరక ఇచ్చేది కాదు...ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఆర్టీసీకి తిరిగి చెల్లిస్తుంది) సౌకర్యం ఉంది. దీంతో సంబంధిత విద్యార్థి ఏ సమయంలోనైనా కళాశాలకు వెళ్లేవాడు, తిరిగి వచ్చేవాడు. కళాశాలలో చదివే విద్యార్థి ఆ చదువుతో పాటు దీనికి అనుబంధంగా ఉండే కోర్సులు, కంప్యూటర్లు, ట్యూషన్లు, అదనపు కోర్సులు చేయడానికి పట్టణాల్లోనే రెండు, మూడు గంటలు ఉండిపోతారు. తరువాత ఏ బస్సు దొరికితే ఆ బస్సుకు ఇళ్లకు చేరుకుంటారు. అలాగే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు కూడా కళాశాల సమయానికి ముందు పలు శిక్షణలు పొందుతుంటారు. వీరందరికీ స్టూడెంట్ స్పెషల్ బస్సులు అశనిపాతంగా తయారయ్యాయి. కాలేజీలు, పాఠశాలలు ఒక్కోసారి మధ్యాహ్నానికే శెలవు ఇవ్వడం లేదా క్లాసులు జరగక విద్యార్థులు ముందుగానే ఇళ్లకు వెళ్లాల్సిన సాయంత్రం స్టూడెంట్ స్పెషల్ వచ్చేవరకూ వేచి ఉండాల్సిందే. ఇక సాధారణంగా పాఠశాలలు వదిలే సమయం సాయంత్రం 4.45 గంటలు. పాఠశాల వదలగానే పీఈటీలు పిల్లలను ఆడించేందుకు గ్రౌండులోకి పిలుస్తుంటారు. క్రీడాకారులైన పిల్లలు సాధారణ విద్యార్థులకన్నా ఒక గంట అదనంగా సమయం తీసుకొని ఇంటికి బయల్థేరడం సహజం. గతంలోలా పల్లెవెలుగు బస్సును ఎక్కనివ్వరు. మరి వీరి సమస్యలు ఎలా గట్టెక్కుతాయని విద్యార్థులు వాపోతున్నారు. అనుమానాలను నివృత్తిచేసిన తరువాతే బస్సులను ఏర్పాటు చేయాలి స్టూడెంట్ స్పెషల్ బస్సుల పట్ల విద్యార్థులకు చాలా అనుమానాలు ఉన్నాయి. అనుమానాలను ఆర్టీసీ అధికారులు బహిర్గతం చేయాలి. అంతే తప్ప ఏకపక్షంగా బస్సులను ఏర్పాటుచేసి విద్యార్థులను ఇబ్బందులు పెట్టాలనుకుంటే మాత్రం సహించం. -ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు, అశోక్ ప్రత్యేక బస్సులను ఆహ్వానిస్తాం...కానీ: స్టూడెంట్స్ కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడాన్ని ఆహ్వానిస్తాం. అయితే ఆ పేరుతో ఇతర బస్సులలో విద్యార్థులను ఎక్కనీయమంటే మాత్రం ఊపేక్షించం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థికి చాలా సమయం పడుతుంది. నిత్యం లైబ్రరీలల్లో ఉంటూ విద్యార్థులు విద్యపై ఆసక్తిచూపే వారు చాలామందే ఉంటున్నారు. అటువంటి విద్యార్థులు అందరనీ ఒకే సమయంలో ఇంటికి చేరాలంటే కుదరదు. ఇతర సమయాల్లోను విద్యార్థులను పల్లెవెలుగు బస్సులలో ఎక్కనివ్వాలి. -ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు పల్లెవెలుగుల్లో అనుమతించకపోతే పోరాటమే విద్యార్థులను తాము ఏర్పాటుచేసిన స్టూడెంట్ స్పెషల్ బస్సులలో మాత్రమే అనుమతిస్తామంటే సహించం. నేడు కంప్యూటర్ క్లాసులకు విద్యార్థులు అత్యధికంగా వెళుతున్నారు. వారంతా తిరిగి తమ ప్రాంతాలకు చేరుకోవాలంటే ఆలస్యమవుతుంది. పల్లెవెలుగుల్లో విద్యార్థులను ఎక్కనీయకుండా చేస్తే మాత్రం ఉద్యమమే శరణ్యం. -పీడీఎస్యు రాష్ట్రకార్యదర్శి మల్లిఖార్జున్ ముమ్మాటికీ విద్యార్థి వ్యతిరేక చర్యే ముమ్మాటికీ ఇది విద్యార్థి వ్యతిరేక చర్యే. ఒక రూట్లో తిరిగే విద్యా సంస్థలన్నింటినీ ఒకేసారి మూసివేయడం జరగదు. సిలబస్ కాకపోతే ప్రత్యేక క్లాసులు, సాధారణ విద్యార్థుల కోసం నిర్వహించే అదనపు బోధనా తరగతులు, విద్యార్థుల్లో ఉత్తీర్ణతాశాతం పెంచేందుకు చేపట్టే స్టడీ అవర్స్, కంప్యూటర్ క్లాసులుంటాయి. మేము బస్సులు వేశాం...కాబట్టి అవే బస్సులలో విద్యార్థులు ఎక్కాలి...మిగితా పల్లె వెలుగులలో ఎక్కనీయకుండా ఆర్టీసీ అధికారులు దృషి ్ట సారించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ మొదలు ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా ఆందోళన ఉధృతం చేస్తాం -వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సూరె మణికంఠారెడ్డి జిల్లా వ్యాప్తంగా 20 బస్సులు మొత్తం 20 బస్సులను జిల్లావ్యాప్తంగా ఉన్న 8 డిపోల ద్వారా నడపాలని ఆర్టీసీ ప్రకాశం రీజియన్ నిర్ణయించింది. అయితే ప్రస్తుతానికి ఐదు సర్వీసులను సిద్ధ చేసింది. వాటిలో అద్దంకి డిపో పరిధిలో ఇప్పటికే ఒక బస్సు నడుస్తోంది. ఆ బస్సులో ట్రిప్పుకు 80 నుంచి 90 మంది విద్యార్థులు ఎక్కుతున్నట్లు అంచనా. అద్దంకి-ఉప్పలపాడు, అద్దంకి- ధర్మవరం మార్గాలలో నడుపుతున్నారు. ఒకే బస్సు నడవడం వల్ల ఒక రూట్లో ముందుగా బస్సు బయల్థేరుతుంది. రెండో మార్గంలో ఆలస్యంగా బయల్థేరుతుంది. మార్కాపురం పరిధిలో మార్కాపురం-మిట్టమీదిపల్లికి ఒకటి నడుస్తుంది. కందుకూరు డిపో పరిధిలో ఒకటి సిద్ధం చేశారు. ప్రయోగాత్మకంగా బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నా... జిల్లా వ్యాప్తంగా మేజర్ రూట్లన్నింటిలో ఈ విధానాన్ని ఏర్పాటుచేసి చివరకు భారం పిల్లలపై వేయనున్నట్టు తెలుస్తోంది. విద్యార్థి సంఘాలతో చర్చలేవీ... ఈ విషయంపై నిర్ణయం తీసుకునే క్రమంలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలపై కనీసం ఆర్టీసీ అధికారులు ఒక సదస్సు నిర్వహించి విద్యార్థుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడంగానీ, కనీసం విద్యార్థి సంఘాల నాయకులను ఆహ్వానించి చర్చించడం గానీ చేయకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. రద్దీ మార్గాలలో మరో అదనపు బస్సును ఏర్పాటుచేస్తే సమస్య ఉండదని విద్యార్థివర్గాలు పేర్కొంటున్నాయి.