సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసుల పునరుద్ధరణపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం ఎండీ కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ.. అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ, కిలోమీటర్లపై చర్చ జరిగింది. ఏ రూట్లలో ఎన్ని బస్సులు నడపాలనే అంశంపైనా చర్చించాం. సమాన కిలోమీటర్లకు ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. బస్సుల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ పంపాం. కిలోమీటర్ల గ్యాప్ 50 శాతం తగ్గించేందుకు మేము అంగీకరించాం. తెలంగాణ ఆర్టీసీని 50శాతం పెంచుకోమని చెప్పాము. రాష్ట్ర విభజనకు ముందు 3.43 లక్షల కిలోమీటర్లు ఏపీ బస్సులను నడిపాం. విభజన తరువాత తెలంగాణ లో 2.65 లక్షల కిలోమీటర్లకు బస్సులు తిప్పుతున్నాం. 71 రూట్లలో ఏపీ, 28 రూట్లలో తెలంగాణ బస్సులు తిప్పుతుంది. 1.1 లక్షల కిలోమీటర్లు రెండు రాష్ట్రాల మధ్య గ్యాప్ ఉంది. మేము 50 వేల కిలోమీటర్లు తగ్గిస్తాం. మీరు పెంచండి అని తెలంగాణ వాళ్ళను కోరాం. 1.10 వేల కిలోమీటర్ల నుంచి 1.60 వెల కిలోమీటర్లు వరకు పెంచడానికి తెలంగాణ ముందుకు వచ్చింది. ('అవినీతికి, అక్రమాలకు చంద్రబాబు పెట్టింది పేరు')
అంతకు మించి పెంచే సామర్ధ్యం మాకు లేదు. లాభదాయకంగా ఉండదని తెలంగాణ చెబుతోంది. అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీఎస్ ఆర్టీసీకి అనుమతి ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి రూట్ వైజ్ క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ అడిగింది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రం ఇలాంటి ప్రతిపాదన పెట్టలేదు. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే చూడాలి. 70 వేల కిలోమీటర్లు మేర ఇరు రాష్ట్రాలు 250 బస్సులు తిప్పితే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని భావించము. సర్వీసుల పునరుద్ధరణపై ప్రతిష్టంభన ఇలానే ఉంటే ప్రైవేట్‌కు లాభం చేకూరుతుంది. మేము తగ్గిస్తాం, మీరు పెంచండి అని చెప్పాం. రూట్ల వారీగా బస్సులు నడిపే మార్గాల ప్రపోజల్ ఇవ్వమని అడిగారు. రెండు రోజుల్లో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించాం. తుది నిర్ణయం తీసుకునే వరకు ఇరు రాష్ట్రాలు 250 బస్సుల చొప్పున నడిపేందుకు అనుమతి ఇవ్వాలని అడిగాం. అంతరాష్ట్ర బస్సులపై క్లారిటీ వచ్చిన తరువాతే ఇస్తామని టీఎస్ అధికారులు చెప్పారు' అని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు.
తెలంగాణ ఆర్టీసీ ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ మాట్లాడుతూ.. రూట్ల వారీగా రెండు రాష్ట్రాలు సమానంగా నడపాలని ప్రపోజ్ చేశాం. రూట్ల వారీగా క్లారిటీ ఇస్తేనే మేము ముందుకు వెళ్తాం. రెండు రాష్ట్రాలు అగ్రిమెంట్ ప్రకారం ముందుకు వెళతాం' అని సునీల్ శర్మ అన్నారు. సమావేశంలో తెలంగాణ నుంచి టీఎస్‌ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు.. ఏపీ నుంచి ఎండీ కృష్ణబాబు, ఈడీ బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment