హైదరాబాద్: కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తామని ఆర్టీసీ యాజమాన్యం భయపెట్టడం పద్దతి కాదని వైఎస్ఆర్ సీపీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తమ యూనియన్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులను భయాందోళనకు గురి చేస్తే సహించేది లేదని రాజారెడ్డి ఆర్టీసీ యాజమాన్యాన్ని హెచ్చరించారు.