rajareddy
-
YS Raja Reddy Engagement: షర్మిల తనయుడి నిశ్చితార్థంలో సీఎం జగన్ దంపతులు (ఫోటోలు)
-
నాట్య తపస్సు
నేను నా దైవం నాట్యం చేసేదెందుకు? నలుగురు చూసేటందుకు. నలుగురూ చూసి మురిసే నాట్యం దైవార్పితం ఎలా అవుతుంది? అది ముమ్మాటికీ ప్రదర్శనే అవుతుంది. నాట్యం... నిన్ను నువ్వు చూసుకోవడానికి... నీలోనే ఉన్న పరమాణువుల సంలీనంలో బ్రహ్మాండాన్ని దర్శించడానికి. నాట్యం... నిన్ను ఆనందింపచేస్తేనే... ప్రపంచమూ పులకితమవుతుంది. రాజారాధారెడ్డిలకు నాట్యం ఒక తపస్సు... ఒక దైవతాండవం దైవాన్ని నృత్యంతో ఆరాధిస్తారా, నృత్యంలో దైవాన్ని దర్శిస్తారా? రాజారెడ్డి: రెండూనూ! ఎందుకంటే నాట్యకారులకు నాట్యమే దైవం. మనదేశంలో ప్రాచీన కాలం నాటి రోజులను గమనించండి. ఎన్నో ధార్మిక ప్రదేశాలకు, దేవాలయాలకు, సంస్కృతికి పెట్టింది పేరైన మన దేశంలో నర్తకీమణులు దేవాలయాల వద్ద దేవున్ని స్తుతిస్తూ నర్తించేవారు. నాటి నుంచి నాట్యకారులకు అన్నీ దేవుడే అయ్యాడు. తట్టుమేల, నాట్యమేల ద్వారా భగవంతుని లీలలను ఊరూరా తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తూ ప్రజలకు తెలియజేసేవారు. అంటే, నృత్య సాధన చేసేవారు భగవంతుని లీలలు మొత్తం నేర్చుకోవాలి. ఆ విధంగా శివలీలలు, భాగవతం, దశావతారాలు.. ప్రదర్శనలను ప్రపంచమంతటా ప్రదర్శించాం నేనూ రాధ. దంపతులిద్దరూ డ్యాన్సర్లే కావడం యాదృచ్ఛికమా, భగవత్సంకల్పమా? రాధారెడ్డి: భగవంతుని దయ లేనిదే ఏదీ జరగదు. రాజా మా మేనత్త కొడుకు. మా పెళ్లప్పుడు రాజాకు పదకొండేళ్లు, నాకు ఐదేళ్లు. మాకు ఆ పెళ్లి గురించి ఏమీ తెలియదు. అమ్మనాన్నలు మీరు భార్యాభర్తలు అని చెప్పేవారు. నేను ఆటలో మునిగినప్పుడల్లా నానమ్మ గుర్తుచేస్తుండేది నువ్వు రాజా భార్యవి అని. ఆ మాటలో నీకు పెళ్లయ్యింది సుమా! అనే హెచ్చరిక వినిపించేది. అత్తింటికి వచ్చాక మాత్రం నా భర్త ముందుగా నాకు స్నేహితుడు అయ్యాడు. తర్వాత గురువు అయ్యాడు. మొదట్లో ఇద్దరం భాగవతం, వీధి నాటకాలు చూసేవాళ్లం. తర్వాత రోజుల్లో సాధువులు ఎలా తపస్సు చేసుకుంటారో అలా డ్యాన్స్‌ని పట్టుకున్నాం. మా ఇద్దరి కాంబినేషన్‌లాగ ఇప్పటి వరకూ ఎవ్వరూ ఇలా నృత్యంలో లేరు. రాజారెడ్డి: నాతో పాటూ రాధ కూడా కూచిపూడి కళకు రావడం భగవత్ సంకల్పమే! మాది అదిలాబాద్ జిల్లాలోని నర్సాపురం. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే పిచ్చి. కోలాటం, భజనలు చేసే వాళ్లలో కలిసి పోయేవాడిని. యక్షగానాలు, భాగవతుల వాళ్లతో కలిసి ఊరూరా తిరిగేవాడిని. ప్రదర్శనల్లో పాల్గొనేవాడిని. డ్యాన్స్ లోక్లాస్ వాళ్లు చేసేది అని ఊళ్లో వాళ్లు చిన్నచూపు చూస్తున్నారని మా నాన్న నన్ను కొట్టేవాడు. అయినా వినేవాడిని కాదు. నేను డ్యాన్స్ చేస్తుంటే రాధ చూసేది. తన స్నేహితులతో కలిసి తనూ చేసేది. ఆమెలో ఉన్న ఆసక్తి చూసి ఆ తర్వాత తనకూ నృత్యం నేర్పించాను. తను ఎప్పుడైతే నాట్యం నేర్చుకుందో.. నాతో కలిసి నాట్యం చేయడం ఆరంభించిందో అప్పుడు నా జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చింది. అయితే, అదంతా సులువుగా జరగలేదు. నా పదవ తరగతి పూర్తవుతుంది అనగా నాన్న చనిపోయాడు. ఊళ్ళో వాళ్లు నేను డ్యాన్స్ చేస్తున్నానని రెండేళ్ల పాటు మా కుటుంబాన్ని వెలేశారు. నాకంటే చిన్నవారైన తోడబుట్టిన వాళ్లున్నారు. అప్పుడు భయపడ్డాను. అమ్మ మాత్రం ‘నీకు నచ్చింది చెయ్! మాకేమవుతుందో అని భయపడకు. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు’ అనేది. అప్పటికే ఏలూరు, తెనాలి ప్రాంతాలలో గురువుల వద్ద నృత్యం, కొరియోగ్రాఫ్ నేర్చుకున్నాను. ఏదో మొండిగా రాధను తీసుకొని హైదరాబాద్‌కి వచ్చేశాను. కానీ, అప్పుడు చేతిలో పైసా లేదు. ఎవరూ సాయం చేసేవారు లేరు. స్టేజీ షోలు ఇవ్వడం కొత్త. సంపాదన లేదు. పూట గడవాలంటే గగనమయ్యేది. మంచినీళ్లతో కడుపునింపుకునేవాళ్లం. అయినా సరే, రోజూ 8 నుంచి 10 గంటలు నాట్య సాధన చేసేవాళ్లం. ఇప్పుడు ఆ రోజులను తలుచుకుంటే ఎలా బతికామో అనిపిస్తుంటుంది. అలాంటి కష్టకాలంలో దేవుడు మీ చేయి పట్టుకుని నడిపించారంటారా? రాధారెడ్డి: మా ఇలవేల్పు వేంకటేశ్వరస్వామి. ఆయన్నే నమ్ముకున్నాం. స్వామి మమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కించడమే కాదు, ప్రపంచానికి మమ్మల్ని పరిచయం చేశాడు. మేం ఢిల్లీ చేరిన మొదట్లో నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా అక్కడి తీన్‌మూర్తి భవన్లో నాట్య ప్రదర్శన ఇచ్చాం. అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాం«ధీ మా ప్రదర్శన చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. షాలువా కప్పి సన్మానించారు. మా గురించి అడిగారు. ‘మేం ఊరు వెళ్లిపోతున్నాం. ఇక్కడ మాకు ఉండటానికి చోటు లేదు మేడమ్’ అని చెప్పాం. అప్పుడామె, మమ్మల్ని వెళ్లద్దు అని మినిస్టర్ కొత్త రఘురామయ్య గారికి చెప్పి భండార్ రోడ్లో మా కోసం ఇంటిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మా నాట్యానికి ఎక్కడా విఘాతం రాలేదు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మా ప్రదర్శన ఉండేది. అయినా, చాలావరకు ప్రదర్శనలు మా వరకు రావాలంటే ఎవరో ఒకరు అడ్డుపడేవారు. పైవాళ్లను ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని తమకు ఆ అవకాశాలను ఇప్పించుకునేవారు. దాంతో చాలా బాధ కలిగేది. ఏడుస్తూ గుడి దగ్గర కూర్చున్న రోజులున్నాయి.∙ రాజారెడ్డి: ఆత్మను పరమాత్మతో ఏకం చేస్తే కష్టమేదీ అనిపించదు. నాట్యం ద్వారా మాకు అది సాధ్యమైంది. అందుకే ఆకలిని మరిచిపోయాం. నాట్యాన్నే శ్వాసించాం. నాట్యంలోనే జీవించాం. పంచేంద్రియాలను ఒకటి చేసి ఆత్మను భగవంతునితో కలిపితే దొరికే ఆ అనందం మాటల్లో చెప్పలేం. ఆ దైవం మాకు అండగా ఉండబట్టే ఈ రోజుకి ఇలా ఉన్నాం. రోజూ కాసేపు భగవంతుని పూజలో పాల్గొంటే మంచి జరుగుతుంది అనే భావన మా ఇంట్లో అందరిలోనూ ఉంది. దైవదర్శనం నృత్యంలోనేనా? ఆలయాలకు వెళుతుంటారా? రాధారెడ్డి: మా ప్రదర్శనలన్నీ దాదాపు పెద్ద పెద్ద దేవాలయాల వద్దే జరిగేవి. మేం ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నామో! నాట్యంతోనే అన్ని పుణ్య స్థలాలు దేవుడే తిప్పుతున్నాడు. ఆ విధంగా ఉత్తరభారతంలో మధుర, బృందావనం, ద్వారక.. ఒకటేమిటి గొప్ప గొప్ప దైవ క్షేత్రాలన్నీ దర్శించాం. రాజారెడ్డి: అంతేకాదు, ప్రతి యేటా తిరుపతి వెళ్తాం. అలాగే వేములవాడ రాజరాజేశ్వరి ఆలయంలో అమ్మ వారిని దర్శించుకుంటాం. మొన్నటి మార్చి నెలలో రాధ తిరుమల కొండ మెట్లు ఎక్కి, తలనీలాలు సమర్పించు కొని వచ్చింది. శ్రీశైలం అయితే ఎన్ని సార్లు వెళ్లామో! శివయ్య అంటేనే నృత్యం కదా! అమ్మవారితో కలిసి ఆయన చేసే నాట్యం మహాద్భుతంగా వర్ణిస్తుంది శివపురాణం. భగవంతునితోనే నాట్యం ఉద్భవించింది. ఈ నాట్యాన్ని ఆ భగవంతుడే మాకు దగ్గర చేశాడు. మీ ప్రదర్శనలో అంతరాయాలు రావడం, దైవాన్ని గట్టెక్కించమని వేడుకున్న సందర్భాలు? రాజారెడ్డి: కొన్నేళ్ల క్రితం జరిగింది. ఢిల్లీలో తెలుగువారి ఫంక్షన్ జరుగుతున్న సందర్భం అది. ఆ వేడుకలో మా ప్రదర్శన ఉంది. అది రామకృష్ణ మఠం అడిటోరియం. మేం మేకప్ వేసుకొని, సరంజామా అంతా సిద్ధం చేసుకొని వెళ్లేసరికి అక్కడ మైకులో జనగణమణ.. అనే గీతం వినిపించింది. చాలా మధనపడ్డాం. ఇలాగే మరోసారి మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఫ్రాన్స్‌లో మొదటిసారి ప్రదర్శన ఇచ్చినప్పుడు మాత్రం చాలా భయపడ్డాం. అది అతి పెద్ద స్టేజ్. ఆ స్టేజ్ మీద మొత్తం చీకటి. డ్యాన్స్ చేసేటప్పుడు వారి ఒక్కరి మీద మాత్రమే ఫోకస్ పడుతుంది. అలాంటి స్టేజ్ మీద దశావతారం... చీకట్లోనే పదిసార్లు స్టేజీమీదకు వెళ్లాలి. నాటి సంఘటన ఇప్పటికీ మర్చిపోలేం. నాట్య ప్రదర్శన పూర్తయ్యాక ఆ చప్పట్ల హోరు.. దాదాపు 30 నిమిషాలు. వాళ్లంతా మమ్మల్ని ప్రశంసించడం.. అంతా దేవుని దయ. అవార్డులు వరించినప్పుడు దైవం అనుకూలత లభించిందని భావించారా? రాజారెడ్డి: ఒక ఇంట్లో ఒక్కరికే పద్మశ్రీ అవార్డులు ఇస్తారు. అలాంటిది మాకు ఒకేసారి అవార్డులు వరించాయి. ఇది దైవం ఇచ్చిన అదృష్టమే! అవార్డులు వచ్చినా కొద్దీ మా బాధ్యత కూడా పెరుగుతూ వచ్చింది. భక్తి, సాధన, అంకితభావం... కలిస్తేనే కూచిపూడి నాట్యంలో రాణించగలం. వాటికి తగిన గౌరవం లభించిందని నమ్ముతాం. అధ్యాత్మికతకు – భక్తికి మీరు చెప్పే నిర్వచనం...? రాజారెడ్డి: మా గురువుగారు ఈ రెండింటి గురించి వివరిస్తూ ఒక శ్లోకం చెప్పేవారు.పుంఖానుపుంఖ విశేషణ తత్పరూపిబ్రహ్మావలోకన ధ్యియం నజహాతి యోగి.సంగీత తాళ లయ వశంగతాపి మౌళిస్తకుంభ పరిరక్షణ దీర్ణటీవ! అని. ఈ నాట్యంలో నర్తకులు పళ్లెం మీద నిల్చుని చేసే విధం ఉంటుంది. తలమీద చెంబులో నీళ్లుంటాయి. భగవంతుని పాట పాడుతూ లయబద్ధంగా పాదాలు కదుపుతూ నాట్యం చేస్తుంటాడు. చెంబులో నీళ్లు తొణకవు. పళ్లెం మీద నుంచి కాలు కిందకు దిగదు. అది భక్తి. యోగి తపస్సు చేస్తూ పరమాత్మను దర్శనం చేసుకుంటాడు. అతనిది ఆధ్యాత్మికత. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే అన్నమయ్య బ్రహ్మమొకటే, పరబ్రహ్మమొక్కటే అని కీర్తన పాడుతుంటాడు అదే సమయంలో దానికి తగిన తాళం చేత్తోనూ, పాదంతోనూ వేస్తుంటాడు ఇది ఆ స్వామిపై ఉన్న భక్తి. దేవుడు ప్రత్యక్షమైతే? రాధారెడ్డి, రాజారెడ్డి: మేం ఎంత పుణ్యం చేసుకున్నామో మా పిల్లలు యామినీరెడ్డి, భావనారెడ్డి కూడా ఇదే కళలో రాణిస్తున్నారు. పెద్దమ్మాయి ఎంబీఏ. చిన్నమ్మాయి కూడా మాస్టర్స్ డిగ్రీ చేసింది. కానీ, ఇద్దరూ ‘కూచిపూడి నాట్యానికే అంకితం అవుతాం’ అన్నారు. ఆ దైవం ప్రత్యక్ష్యమైతే ఒకటే కోరుకుంటాం. వాళ్లు ఈ కళలో ఎంతో గొప్పగా రాణించాలని కోరుకుంటాం. అంతేకాదు, మా స్కూల్ ‘నాట్యతరంగిణి’లో ఉన్న విద్యార్థులు కూడా మా పిల్లలే! వాళ్లకి మేమే స్వయంగా క్లాసులు తీసుకుంటాం. వారందరూ కూచిపూడి నాట్యకళలో ఉన్నతులు కావాలని, ఈ కళను ముందుతరాలకు పరిచయం చేయాలని, ఎప్పటికీ ఈ కళ ఇలాగే నిలిచిఉండాలని కోరుకుంటాం. రాజారెడ్డికి రెండవ భార్యగా మీ చెల్లెలు కౌసల్యనే ఇచ్చి చేశారు. ఇది త్యాగమా, దైవనిర్ణయమా? రాధారెడ్డి: మొదట కౌసల్య నా భర్తను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు షాక్ అయ్యాను. బాధపడ్డాను. కానీ, తన ప్రేమను గుర్తించాను. దైవనిర్ణయంగా భావించాను. అందుకే మా జీవితాల్లోకి కౌసల్యను ఆహ్వానించాం. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
నంద్యాలలో వ్యవసాయ స్టుడియో
బుక్కరాయసముద్రం : కర్నూలు జిల్లా నంద్యాలలో రూ.13 కోట్ల వ్యయంతో వ్యవసాయ స్డూడియో నిర్మాణం చేపడుతున్నామని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు రాజారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని రేకులకుంట ఆచార్య ఎన్జీ రంగా పరిశోధనా కేంద్రంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. నంద్యాలలో స్టుడియో ఏర్పాటు చేసి రైతులకు సంబంధించిన సమాచారం చానల్లో ప్రసారం చేస్తామన్నారు. శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు, చర్చా కార్యక్రమాలు, రైతుల విజయ గాథలు ప్రసారం చేస్తామన్నారు. వ్యవసాయ సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్లు ఫార్మర్ కస్టమర్ కేర్ : 18004250430, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్: 18004252960కు రైతులు ఫోన్ చేయవచ్చన్నారు. జిల్లాలో వర్షాభావం కారణంగా రైతులు వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడితే లాభాలు ఉండవన్నారు. వ్యవసాయంతో పాటు పాడి, కోళ్ల పరిశ్రమ, ఉద్యాన పంటల సాగు, చిరుధాన్యాల సాగు చేయడం ద్వారా రైతులు ఆర్థికాభివృద్ధి సాధించన్నారు. చిరుధాన్యాల ఉప వృత్తులు తయారు చేసుకుని మార్కెట్లో అమ్మితే మంచి ఆదాయం పొందవచ్చన్నారు. ఉప వృత్తుల తయారీకి సంబంధించి మిషనరీల కోసం కేవీకేలకు రూ.3.50 కోట్లు నిధులు కేటాయించామన్నారు. -
చరిత్రకు కొత్త ఊపునిచ్చిన 'శాతకర్ణి'
విశ్లేషణ మన తెలుగు సినిమాకు పెట్టినట్టు ఆ పేరును 'శాతవాహన' అని కాకుండా, 'సాతవాహన' అని చదువుకోవాలి. మన చరిత్ర గురించి చెప్పేటప్పుడు భావి తరాలను గుర్తుంచుకోవాలి. చరిత్ర తిరగరాసుకుంటూ ఉండాలి. అందులో ప్రధానంగా జరగవలసింది దోషాల నివారణ. శాతవాహన వంశీయుల మీద ఒక చలన చిత్రం నిర్మించడం చాలా సంతోషకరమైన విషయం. తెలుగువారంతా ఆనందించవల సిన విషయం. 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఈ మధ్యనే విడుదలైంది. దర్శకుడు, నిర్మాత ఆ చరిత్ర పురుషునికి సంబంధించిన డాక్యు మెంటరీ నిర్మించలేదు. ఆ గాథను తెరకెక్కిం చారు. అందుకు తగ్గట్టు కొన్ని హంగులు ఉంటాయి. ఈ వంశీయుల జన్మస్థలి తెలం గాణలో గోదావరి తీరాన ఉన్న కోటిలింగాల. వీరు సగానికి పైగా భారతావని మీద తమ ఆధిపత్యం నెలకొల్పగలిగారు. కుషాణులు దక్షిణాపథం వైపు రాకుండా నిరోధించిన ఘనత కూడా వారిదే. 5 వేల ఏళ్ల భారత చరిత్రలో రెండు యుగాలు మాత్రమే శాంతి సౌభా గ్యాలతో వర్థిల్లాయని చరిత్రకారులు చెబుతారు. అందులో మొదటి యుగం సింధులోయ నాగరికత కాలం. రెండు శాతవాహనుల ఏలు బడి. సింధులోయ నాగరికతలో కనిపించే మహోన్నత అంశం–నలభై వేలమంది నివసించడానికి వీలుగా పట్టణాలను ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళికా బద్ధంగా నిర్మించుకోవడం. కారణాలు ఏమైనా సినిమా విడుదలైన తరువాత శాతవా హనుల మీద పరిశోధనకు కొత్త ఊపు వచ్చే దాఖలాలు కనిపిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని వాస్తవాలను గమనించడం అవసరం. సినీ కళాకారులు, చరిత్రకారులు కూడా ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుంటే మంచిది. అందుకే కొన్ని వివరాలు ఇక్కడ ఇస్తున్నాను. చరిత్ర మీద కొత్త వెలుగు గానీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సినిమా నిర్మాణం గానీ జరిగితే ఈ ఆధారాలు మరింతగా ఉపకరి స్తాయి. ప్రజలకు ఈ మహోన్నత చరిత్ర మరింత చేరువవుతుంది. శాతవాహన వంశంలో నలుగురు మహనీయులు ప్రధానంగా కనిపిస్తారు. అందులో మొదట చెప్పుకోదగినవాడు చిముక శాతవా హనుడు. ఇంకా శాతకర్ణి, గౌతమీపుత్ర శాతకర్ణి, ఆయన సోదరుడు గౌతమీపుత్ర యజ్ఞశాతకర్ణి. ఇక్కడే ఒక వాస్తవం గమనించాలి. వీరిలో చిముకుడు మాత్రమే శా(సా)తవాహన అని తనను తాను పేర్కొ న్నాడు. మిగిలిన వారంతా శాతకర్ణి అన్న పేరు పెట్టుకున్నారు (తల్లి పేరుతో పాటు). ఎందుకంటే ఇందులో శాతకర్ణి 56 సంవత్సరాలు సమర్థవంతమైన పాలనను అందించాడు. ఆయన పేరునే వీరు తమ పేర్లలో చేర్చుకున్నారు. ఈ వంశీయుల చరిత్రకు వాఙ్మయం నుంచి, నాణేలు, శిలాశాసనాల నుంచి ఆధారాలు దొరుకుతున్నాయి (ఇదే అంశాన్ని సినిమాలో ఒకచోట నాణేల ద్వారా చూపించే ప్రయత్నం చేశారు కూడా). వాఙ్మయ ఆధారాలంటే ప్రధానంగా పురాణాలలో వీరి పేర్లు కనిపించడం విశేషం. మత్స్య, వాయు, విష్ణు, భాగవత, బ్రహ్మాండ అనే ఐదు పురాణాలలో వీరిపేర్లు కనిపిస్తాయి. వీటిలో భారతావనిని ఏలిన చాలా పూర్వ రాజవంశాల ప్రస్తావన ఉంది. అందులోనే శాతవాహనుల పేర్లు కూడా కనిపిస్తాయి. కానీ వీటిలో కొన్ని వివరాలు సమగ్రంగా అనిపించవు. సహేతుకంగా కనిపించవు. అందుకు కారణం శాతవాహనుల కాలం కంటే చాలా తరువాత ఈ పురాణాలను రాయడం జరిగింది. వీటి రచన గుప్తుల కాలంలో మొదలై వేయేళ్లకు ముగిసిందని చెబుతారు. ఇందులో రెండు పురా ణాలు మాత్రం ఒకే విధమైన సమాచారాన్ని ఇస్తున్నాయి. మిగిలినవి ఈ వివరాలతో విభేదిస్తున్నాయి. మత్స్య పురాణం తీసుకుంటే, అందులో గౌతమీపుత్ర శాతకర్ణి ఆ వంశీయులలో 23వ చక్రవర్తి. కానీ వాయు, భాగవత పురాణాలు 16వ పాలకునిగాను, విష్ణు పురాణం 17వ పాలకునిగాను, బ్రహ్మాండ పురాణం 19వ ఏలికగాను పేర్కొం టున్నాయి. అలాగే వీరి పాలనా కాలంలోనూ కొన్ని తేడాలు కనిపిస్తాయి. కాబట్టి నాణేలు, శిలాశాసనాలే వీరి చరిత్రకు విశ్వసనీయ ఆధారాలు. గౌతమీపుత్ర శాతకర్ణి కాలానికి చెందిన శిలాశాసనాలు నాసిక్, కార్లే, కన్హేరీలలో కనిపిస్తాయి. ఈ వంశీయులకు చెందిన వంద లాది నాణేలు హైదరాబాద్, చెన్నై పురావస్తు ప్రదర్శనశాలల్లో ఉన్నాయి. ఇంకా దేశంలోని కొన్ని ఇతర పురావస్తు ప్రదర్శనశాలల్లోనే కాకుండా, లండన్, న్యూయార్క్‌లలో కూడా వీరి నాణేలు ఉన్నాయి. కొందరు వ్యక్తుల అధీనంలో కూడా ఈ కాలపు నాణేలు ఉన్నాయి. 1989లో కోటిలింగాలలో జరిగిన తవ్వకాల్లో దొరికిన 987 నాణేలు ప్రస్తుతం హైదరాబాద్ మ్యూజియంలో ఉన్నాయి. ఇవి చిముకుడు, శాతకర్ణి, గౌతమీ పుత్ర శాతకర్ణి, వాశిష్టీపుత్ర పులోమావి, వాశిష్టీపుత్ర శాతకర్ణి, స్కంద శాతకర్ణిలకు చెందినవి. అలాగే పెద్ద బంకూరు, ధూళికట్టలలో 1970 లలో తవ్వకాలు జరిగినా నివేదికలు వెల్లడి కాలేదు. పైఠాన్, కొండాపూర్‌లలో కూడా తవ్వకాలు జరిగాయి. కొండాపూర్‌లో 194042లలో, 2009–11లలో తవ్వకాలు జరిగాయి. మొదటి విడతలో 4,120 నాణేలు లభించాయి. ఇందులో పైన పేర్కొన్న చక్రవర్తుల నాణేలతో పాటు శివశ్రీ శాతకర్ణి, మధారి పుత్ర శాతకర్ణిల నాణేలు కూడా దొరికాయి. అమరావతిలో 1973– 75లో జరిగిన తవ్వకాలలో 63 నాణేలు దొరికాయి. వీటిలో ఎక్కువ ఇక్ష్వాకులకు, విష్ణు కుండినులకు చెందినవి. నాగార్జునకొండలో 1950లో తవ్వకాలు జరిగినప్పుడు 3,032 నాణేలు లభ్యమైనాయి. తన పేరులో కన్నతల్లి పేరును చేర్చుకునే సంప్రదాయం గౌతమీ పుత్ర శాతకర్ణితోనే ఆరంభమైంది. నాణేలను కూడా ఆ పేరుతోనే ఆయన ముద్రించాడు. శకులను, యవనులను, పల్లవులను తన కుమారుడు గౌతమీపుత్ర నాశనం చేశాడని, క్షాత్రపు వంశాన్ని కూడా తుదముట్టించాడని నాసిక్ దగ్గర వేయించిన శాసనంలో బాలాశ్రీ పేర్కొనడం కనిపిస్తుంది. జోగల్తంబి నాణేల నిధి మరో విశిష్ట కథ నాన్ని చెబుతోంది. ఈ నిధిలో 13,250 వెండి నాణేలు ఉన్నాయి. ఇవన్నీ క్షాత్రపు వంశీయుడు నహపాణునివే. అయితే విజేత గౌతమీ పుత్రుడు వీటి మీదే తన ముద్రను వేయించాడు. అంటే రెండు ముద్రలు వాటిపై కనిపిస్తాయి. విల్లు, ఒక పుష్పం ఆకారంలో ఉండే ఉజ్జయిని గుర్తును రెండువైపులా ఆయన ముద్రించాడు. నిజా నికి ఈ వంశీయులను గుర్తించడం తల్లి పేరును బట్టే జరిగింది. ప్రాకృతం, బ్రాహ్మీ లిపులలో వారు తమ వివరాలను నాణేల మీద చెక్కించారు. మన తెలుగు సినిమాకు పెట్టినట్టు ఆ పేరును 'శాతవాహన' అని కాకుండా, 'సాతవాహన' అని చదువుకోవాలి. ఒక సినిమా నిర్మా ణంలో ఇదొక పెద్ద అంశం కాకపోవచ్చు. కానీ మన చరిత్ర గురించి చెప్పేటప్పుడు భావి తరాలను గుర్తుంచుకోవాలి. అందుకే సరైన వర్ణ క్రమం ఉండాలి. చరిత్ర తిరగరాసుకుంటూ ఉండాలి. అందులో ప్రధా నంగా జరగవలసింది దోషాల నివారణ. దీనిని అంతా గమనించాలి. వ్యాసకర్త నాణేల నిపుణులు, ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ డి. రాజారెడ్డి -
‘ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి’
కదిరి టౌన్ : కార్మికుల పొట్టలు కొడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వేమయ్య యాదవ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నరసింహులు అన్నారు. కదిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట వందలాది మంది కార్మికులతో మంగళవారం ఆందోళనకు దిగారు. ముందుగా ఎర్రజెండాలు చేతబూని స్థానిక సీపీఐ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరారు. అంబేడ్కర్ కూడలి, ఇందిరాగాంధీ కూడలి మీదుగా ర్యాలీ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుంది. కార్యాలయాన్ని ముట్టిడించి అక్కడే బైఠాయించారు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వానికి నూకలు చెల్లాయని వక్తలు పేర్కొన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కార్మికులను ఆదుకోవాల్సిన సర్కారు అధికారంలోకి రాగానే వారి గురించే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 279 జీఓను రద్దు చేయాలని, 200 మంది దాకా ఉన్న పారిశు«ధ్ధ్యం, మున్సిపల్ కార్మికులకు రావాల్సిన పీఎఫ్ రూ.కోటి దాకా బకాయి పేరుకుపోయిందన్నారు. బకాయినంతా పీఎఫ్ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ నాయకులు ఇసాక్, ముస్తాక్ అలీఖాన్, రాజేంద్ర పాల్గొన్నారు. -
రాజారెడ్డి భౌతికకాయానికి వైఎస్ జగన్ నివాళులు
-
రాజారెడ్డి భౌతికకాయానికి వైఎస్ జగన్ నివాళులు
నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దబ్బల రాజారెడ్డి (55) భౌతికకాయానికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. సన్నిహితుడు రాజారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వైఎస్ జగన్ శనివారం సూళ్లురుపేటకు వెళ్లారు. రాజారెడ్డి కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కాకాని గోవర్దన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు రాజారెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్యవేడు నియోజకవర్గ పరిశీలకుడుగా ఉన్న దబ్బల రాజారెడ్డి (55) శుక్రవారం అనారోగ్యంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. -
కదిరి వేరుశెనగకు దేశవ్యాప్త డిమాండ్
ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిశోధన సంచాలకులు కదిరి: అనంతపురం జిల్లా కదిరి వేరుశనగ పరిశోధన స్థానంలో కనుగొన్న వేరుశనగ రకాలకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు రాజారెడ్డి అన్నారు. ఇక్కడి వేరుశనగ రకాలు బెట్టను తట్టుకోవడంతో పాటు అధిక దిగుబడులు ఇస్తాయన్నారు. 60 రోజులు వర్షం రాకపోయినా ఇవి తట్టుకోగలవని తెలిపారు. సోమవారం ఆయన కదిరి పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇక్కడి వేరుశనగ రకాలను రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అందుకు విత్తనోత్పత్తిపై దృష్టి సారించామని, ఇందుకోసం ఎన్పీ కుంట మండలంలో ప్రభుత్వం 400 ఎకరాల భూమిని కేటాయించిందని చెప్పారు. అందులో ఇప్పటికే 80 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశామని, మిగిలిన భూమిని చదును చేసే పనిలో ఉన్నట్లు వెల్లడించారు. ఇందుకోసం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రూ.60 లక్షలు మంజూరు అయిందని, నాబార్డు ద్వారా మరో రూ. కోటి మంజూరుకు ప్రయత్నిస్తామన్నారు. వేరుశనగ ద్వారా తయారు చేసే తిను బండారాలకు కూడా ఇటీవల మంచి డిమాండ్ ఉందని, మహిళా సంఘాలకు వీటి తయారీలో శిక్షణ ఇప్పించి, కుటీర పరిశ్రమల స్థాపనకు వారికి తగిన ప్రోత్సాహకాలు ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. అదే విధంగా 8 లక్షల హెక్టార్లకు పైగా వేరుశనగ సాగు చేసే జిల్లా ఒక్క అనంతపురమేనని, అందుకే వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పలు కళాశాలల స్థాపన ఈ జిల్లాలోనే జరిగితే బాగుంటుందన్నారు. కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కేఎస్ఎస్ నాయక్, శాస్త్రవేత్తలు డాక్టర్ రాజాప్రసన్న, డాక్టర్. వేమన, డాక్టర్.చండ్రాయుడు, డాక్టర్.ప్రత్యూష పాల్గొన్నారు. -
'కార్మికులను భయాందోళనకు గురి చేస్తే సహించం'
హైదరాబాద్: కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తామని ఆర్టీసీ యాజమాన్యం భయపెట్టడం పద్దతి కాదని వైఎస్ఆర్ సీపీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తమ యూనియన్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులను భయాందోళనకు గురి చేస్తే సహించేది లేదని రాజారెడ్డి ఆర్టీసీ యాజమాన్యాన్ని హెచ్చరించారు. -
అర్ధరాత్రి కానిస్టేబుళ్ల వీరంగం
పలమనేరు, న్యూస్‌లైన్: శాంతి భద్రతలు కాపాడాల్సిన వారే బాధ్యతలు మరిచారు. తప్పతాగి హోటల్లో ఫర్నిచర్‌ను ధ్వంసంచేశారు. స్నేహితులతో కలసి ఫూటుగా మద్యం సేవించిన ఇద్దరు పోలీసులు శుక్రవారం రాత్రి పలమనేరు పట్టణంలో హంగా మా సృష్టించారు. సంఘవిద్రోహుల నుంచి కాపాడాల్సిన వారే అర్ధరాత్రి రౌడీల్లా వ్యవహరించారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల హత్య కు గురైన ఇద్దరు కానిస్టేబుళ్ల కేసు విచారణకు సంబంధించిన విధుల్లో వీరు ఉండడం గమనార్హం. గంగవరం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేష్, పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పనిచేస్తున్న సీఐ జీపు డ్రైవర్ పురుషోత్తం ఇటీవల హత్య కు గురైన ఇద్దరు కానిస్టేబుళ్ల హత్య కేసు విచారణకు సంబంధించి పలమనేరుకు వచ్చారు. ఇద్దరూ స్నేహితులతో కలసి శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో పట్టణంలోని రాయలసీమ హోటల్‌కెళ్లారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్నా తిరిగి మద్యం సేవించారు. ఎంతసేపైనప్పటికీ వారు వెళ్లలేదు. హోటల్ మూసేసే సమయం అయింది కనుక బయటకు వెళ్లాలని హోటల్ యజమాని కోరారు. దీంతో మద్యం మత్తులో ఉన్న పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పోలీసులమని, తమనే హోటల్ నుంచి బయటకు వెళ్లమంటావా అని ఆగ్రహంతో ఊగిపోయారు. హోటల్లోని కుర్చీలు, టేబుళ్లను ధ్వంసం చే శా రు. దీంతో ఆందోళనకు గురైన హోటల్ యజమాని ఏం చేయాలో అర్థంగాక మిన్నకుండిపోయారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన వారు రోడ్లపై అరుస్తూ నానా హంగామా సృష్టిం చారు. గుడియాత్తం రోడ్డు సర్కిల్లో పలు వాహనాలను ఆపి డ్రైవర్లను చితకబాదారు. అర్ధరాత్రి దాకా హల్చల్ సృష్టించారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం గమ నార్హం. కానిస్టేబుళ్ల దాడిలో హోటల్లోని రూ.1.5 లక్షల ఫర్నిచర్ ధ్వంసమైందని బాధితుడు రాజారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కావడంతో వారిపై ఫిర్యాదు చేయడానికి జంకుతున్నారు. కానిస్టేబుళ్ల వీరంగం పట్టణమంతా పొక్కడంతో డీఎస్పీ, సీఐలు హోటల్ యజమానిని పిలిపించి పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పి చేతులు దులుపుకున్నారు.