విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా ? | students feet on RTC Bus | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా ?

Published Fri, Aug 5 2016 12:06 AM | Last Updated on Fri, Nov 9 2018 4:14 PM

పుట్‌పాత్‌పై ప్రయాణిస్తున్న విద్యార్థులు - Sakshi

పుట్‌పాత్‌పై ప్రయాణిస్తున్న విద్యార్థులు

  • ఆర్టీసీ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
  • పర్వతగిరి :  విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ ఆర్టీసీ అధికారులపై ఎమ్మెల్యే అరూరి రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కల్లెడలో పీఏసీఎస్‌ నూతన భవనాన్ని ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల సమయంలో తిరిగి హన్మకొండకు వెళ్తుండగా.. అటువైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఫుట్‌పాత్‌పై విద్యార్థులు ప్రయాణించడాన్ని గమనించి బస్సును నిలిపివేయించారు.
     
    ఇలా ఎందుకు ఎక్కారని విద్యార్థులను ప్రశ్నించగా,  బస్సులు సమయానికి రావని, తమను ఆర్టీసీ అధికారులు చులకనగా చూస్తారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కొన్నిసార్లు బస్సు కూడా ఆపరని చెప్పారు. దీంతో ఆయన హన్మకొండ డీఎంతో ఫోన్‌లో మాట్లాడి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement