సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన అనంతరం గత జూన్ నెల ఆదాయపులెక్కలను చూసి లాభాలు వచ్చాయని సంబరపడిన ఆర్టీసీ అధికారులు, తాజాగా జూలై నెల లెక్కలను చూసి ఖంగుతిన్నారు. అధికారుల లెక్కల ప్రకారం గత జూలైలో తెలంగాణ ఆర్టీసీకి రూ.31.6కోట్లు నష్టం రాగా, ఏపీఎస్‌ఆర్టీసీకి ఏకంగా రూ.72.4కోట్లు నష్టం వచ్చినట్లు తేల్చారు.
జూలై నెలలో రద్దీ తక్కువగా ఉన్నందున ఆదాయం తగ్గడం సహజమే అయినప్పటికీ ఇంత భారీస్థాయిలో నష్టాలు రావడం అధికారులను నివ్వెరపరిచింది. తాజా నష్టాలతో టీఎస్‌ఆర్టీసీ నష్టాలు 1,100 కోట్లకు చేరగా, ఏపీఎస్‌ఆర్టీసీ నష్టాలు 2,800కోట్లు దాటాయి. దీంతో వెంటనే ఏదో ఒక దిద్దుబాటు చర్య చేపట్టక తప్పదని అధికారులు యోచిస్తున్నారు. మరో రెండ్రోజుల్లో ఈ లెక్కలు రెండురాష్ట్రాల ఉన్నతాధికారులకు చేరనున్నాయి.
మళ్లీ నష్టాల్లో ఆర్టీసీ
Published Sat, Nov 1 2014 1:18 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
Advertisement
Advertisement