
అనంతపురం న్యూసిటీ: బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు గురువారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. బంద్‌తో వేకువజాము నుంచే బస్సుల రాకపోకలు నిలిచిపోవటంతో, ఆర్టీసీకి 80లక్షల ఆదాయం కోల్పోయినట్లు అధికారులు అంచనా వేశారు. రోజులో 806 బస్సులు తిరగాల్సి ఉండగా, 604 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 5 లక్షల మంది ప్రయాణించటం వలన రూ 1.20 కోట్ల నుంచి రూ 1.50 కోట్ల ఆదాయం వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment