వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు దీక్ష చేపట్టారు.
విజయనగరం: వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు దీక్ష చేపట్టారు. మూడు రోజుల పాటు చేపట్టే నిరాహార దీక్షను సోమవారం ప్రారంభించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి తహశీల్దార్ మండల కార్యాలయం ఎదుట మండల వ్యాప్తంగా ఉన్న అంగన్ వాడి కార్యకర్తలు, హెల్పర్లు ఈ దీక్షలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలుపుతున్నారు.
(బొబ్బిలి)