'చింతమనేనిని అరెస్టు చేయాలి'
Published Sat, Dec 5 2015 2:06 PM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM
ఏలూరు: తమపై దౌర్జన్యం చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను అరెస్టు చేయాలని, శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని అంగన్ వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. చింతమనేనిపై కేసు నమోదు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ లో శనివారం అంగన్ వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ భారీ ధర్నా చేపట్టారు. వేతన పెంపుపై నిరసన తెలిపేందుకు వెళ్లిన తమపై ఎమ్మెల్యే దురుసుగా మాట్లాడటం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు టీఐటీయూ ఆధ్వర్యంలో కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ లో ధర్నాకు దిగారు. అంగన్ వాడీ కార్యకర్తల చేపట్టిన ధర్నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి.
కాగా తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం ఏలూరు కలెక్టరేట్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్ వాడీ కార్యకర్తలపై చింతమనేని దారుణంగా బూతుపురాణం ఎత్తుకుని నోటితో చెప్పుకోలేని విధంగా వారిని అవమానకరంగా దూషించిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement