రోడ్డు భద్రతా బిల్లు-2014 కు వ్యతిరేకంగా పలువురు డ్రైవర్లు, వాహన యజమానులు ధర్నాకు దిగారు.
విజయనగరం : రోడ్డు భద్రతా బిల్లు-2014 కు వ్యతిరేకంగా పలువురు డ్రైవర్లు, వాహన యజమానులు ధర్నాకు దిగారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సోమవారం డ్రైవర్లు ఆందోళన చేశారు. సీఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు కూడా పాల్గొని, బిల్లుపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
(బొబ్బిలి)