ప్రకృతి ఎంత అందమైనదో.. తేడాలొస్తే అంతే వికృతమైంది కూడా. ముప్పు ఏ రూపంలో ముంచుకొచ్చినా.. కనుచూపు మేర జీవరాశిని వదలకుండా మింగేస్తుంటుంది. అలా గ్లోబల్ వార్మింగ్ అనే ముప్పు.. చాప కింద నీరులా విస్తరించేసింది ఇప్పటికే. అందుకు ప్రత్యక్ష సాక్క్ష్యం.. సముద్రపక్షుల జనాభా ఊహించని రేంజ్‌లో తగ్గిపోవడం.
సముద్ర తీరాన్ని ఆవాసంగా చేసుకున్న పక్షులకు.. ఆ తీరమే ఇప్పుడు నరక కూపంగా మారింది. అధిక ఉష్ణోగ్రతలు, ఆహార కొరత, భయానక వాతావరణ మార్పులు.. సముద్ర పక్షుల జనాభాను గణనీయంగా పడగొట్టేస్తోంది. వీటికి తోడు పక్షుల్లో సంతానోత్పిత్తి సామర్థ్యం తగ్గిపోతుండడం కలవరపెడుతోంది.
ఫసిఫిక్ మహాసముద్రంలోని హవాయ్ దీవులు, బ్రిటిష్ ఐలెస్, మైన్ కోస్ట్ వెంట పక్షులు రాలిపోతున్నాయి. గుడ్లు పొదిగిన పక్షులు.. పిల్లల ఆకలి తీర్చలేక, మరోవైపు ఆకలికి తట్టుకోలేక అక్కడి నుంచి తరలిపోయే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రయత్నంలో పిల్ల పక్షుల ప్రాణాలు పోతున్నాయి.
గూడు కట్టడంలో ఇబ్బంది
కామన్ ముర్రే, కాస్సిన్స్ అవుక్లెట్ జాతి పక్షుల జనాభా దారుణంగా పడిపోయింది. ఆహారం దొరక్కపోవడం, సముద్ర మట్టం పెరగడం, వానలు, తరచూ వచ్చే తుపాన్లు.. ఇలాంటి కారణాలు వాటి జనాభాను తగ్గించేస్తున్నాయని ప్రకటించింది వైల్డ్‌లైఫ్ సర్వీస్ సంస్థ.
►20 శతాబ్దం మధ్య నుంచి 70 శాతం సీబర్డ్ పాపులేషన్ తగ్గిపోయిందని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు చెప్తున్నారు.
►అయితే ఇంత ప్రతికూల పరిస్థితుల్లోనూ మాగెల్లనిక్ పెంగ్విన్ మనుగడ కొనసాగిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పరిశోధకులు చెప్తున్నారు.
►1991 నుంచి సౌతాఫ్రికా తీరం వెంట మూడొంతుల సముద్రపక్షులు తగ్గిపోతున్నాయని నివేదికలు చెప్తున్నాయి.
►చేపల సంఖ్య తగ్గిపోతుండడం కూడా పక్షుల సామూహిక మరణాలకు ఓ కారణం.
►2010లో పశ్చిమ తీరం వెంట కామన్ ముర్రేస్ గుట్టలు కొట్టుకురావడం చూసిందే.
►మైన్ తీరం వెంబడి ఉండే ఐకానిక్ సీబర్డ్, అట్లాంటిక్ ఫఫ్ఫిన్‌లు.. సంతానొత్పత్తి తగ్గడం, ఆహార కొరతతో నరకం అనుభవిస్తున్నాయి.
►అలస్కా, చుగాచ్ నేషనల్ ఫారెస్ట్ దగ్గర్లోని బీచ్ దగ్గరికి 8 వేల పక్షులు విగత జీవులుగా కొట్టుకు వచ్చాయి.
►ఉత్తర సముద్రం వెంట వేల మైళ్ల దూరంలో ప్రతికూల వాతావరణం పక్షుల జనాభా తగ్గిపోవడానికి కారణం అవుతోంది.
►సముద్రం, ఆ వాతావరణ స్వచ్ఛతను తెలియజేసే సముద్ర పక్షులు తగ్గిపోతుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment