Rushikonda Beach
-
ఇక తగ్గేదేలేదు.. కొడాలి నాని ఈజ్ బ్యాక్
-
నడి సంద్రంలో పెను ప్రమాదం! ఒక్కసారిగా..
అల్లూరి సీతారామరాజు: ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషికొండ బీచ్‌లో నడి సంద్రంలో పెనుప్రమాదం తప్పింది. పర్యాటకులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీ టూరిజం నిర్వహిస్తున్న స్పీడ్ బోటులో 8 మంది పర్యాటకులు గురువారం సాయంత్రం బోటు షికారుకు వెళ్లారు. అదే సమయంలో ఓ ప్రైవేటు బోటులో ఐదుగురు షికారుకు వెళ్లారు. ఈ క్రమంలో అతి వేగంగా వస్తున్న ప్రైవేటు స్పీడ్ బోటు ఏపీ టీడీసీ స్పీడ్ బోటును బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ప్రైవేటు బోటు పూర్తిగా టూరిజం బోటు క్రిందకు చొచ్చుకుని పోవడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు పర్యాటకులు ఒక్కసారిగా సముద్రంలో పడిపోయారు. అయితే వీరు లైఫ్ జాకెట్ల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇవి చదవండి: ఆ నిచ్చెన మీ ఉసురు తీస్తుందనుకోలేదు కొడకా..! -
సముద్రం మధ్యలో టూరిస్ట్ బోటు బోల్తా
-
సముద్రంలో పడవ బోల్తా.. రుషికొండ బీచ్‌లో తప్పిన ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: రుషికొండ బీచ్‌లో పెను ప్రమాదం తప్పింది. సముద్రం మధ్యలో టూరిస్ట్ బోటు బోల్తా పడింది. లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో డ్రైవర్, ఇద్దరు టూరిస్టులు సురక్షితంగా బయటపడ్డారు. సకాలంలో స్పందించిన లైఫ్ గాడ్స్.. వారిని క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. టూరిస్టులను పెందుర్తి, మధురవాడకు చెందిన రవి, సురేష్‌గా గుర్తించారు.. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. చదవండి: వరదలో చిక్కిన కుక్కపిల్లలు.. ఆ తల్లి ఏం చేసిందంటే..? వీడియో వైరల్.. -
రుషికొండలో బ్లూ ఫ్లాగ్ రెపరెపలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అందాల తీరానికి అంతర్జాతీయ హంగులద్దుతున్నారు. స్వచ్ఛత, ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి పర్యావరణ హితంగా.. పర్యాటక స్వర్గధామంగా ఉన్న బీచ్‌లకు విదేశీ గుర్తింపు లభిస్తోంది. డెన్మార్క్‌కు చెందిన అధ్యయన సంస్థ అందించే ఈ ధ్రువపత్రం వస్తే చాలు.. ఆ బీచ్‌లకు విదేశీయులు క్యూ కడతారు. అంతర్జాతీయ సాగరతీరంగా గుర్తింపు పొందుతూ.. సురక్షితమైన బీచ్‌ల జాబితాలో భారత్‌కు చెందిన 12 ప్రాంతాల్లో బ్లూ ఫ్లాగ్ రెపరెపలాడుతున్నాయి. వరుసగా మూడో ఏడాది రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ గుర్తింపు వచ్చింది. ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఎలా వస్తుందంటే.. బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు అంటే కాలుష్యం దరిచేరని పూర్తిగా పర్యావరణ అనుకూల సాగర తీరాలు. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఉన్న బీచ్‌లకు విశేష ఆదరణతోపాటు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఈ సర్టీఫికెట్ దక్కాలంటే బీచ్ పరిసరాలు పరిశుభ్రంగా, నీరు కలుషితం కాకుండా, రసాయనాలు దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక దేశాన్ని సందర్శించేందుకు వెళ్లే విదేశీ పర్యాటకులు ఆ దేశంలో బీచ్‌ల గురించి శోధించినప్పుడు ముందుగా బ్లూ ఫ్లాగ్ గురించే సెర్చ్ చేస్తారు. బ్లూ ఫ్లాగ్ ఉన్న బీచ్‌లు ఉంటే.. ఆ ప్రాంతాన్ని కచ్చితంగా విదేశీ పర్యాటకులు పర్యటిస్తారు. బ్లూ ఫ్లాగ్ ధ్రువ పత్రం పొందాలంటే నాలుగు విభాగాల్లోని 33 అంశాల్లో బీచ్‌ని అభివృద్ధి చేయాలి. మలినాలు, వ్యర్థాలు, జల కాలుష్యం ఉండకూడదు. పర్యావరణ హితంగా ఉండాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. పరిశ్రమల వ్యర్థాలు కలవకూడదు. సముద్రంలో స్నానం చేసేటపుడు ఆరోగ్యపరమైన భద్రత ఉండాలి. నీటిలో బ్యాక్టీరియా ఉండకూడదు. 150 మీటర్ల వరకు తీరం నుంచి లోపలకు ఇసుక తిన్నెలుండాలి. సముద్రంలో బోటింగ్ సదుపాయం ఉండాలి. ఈ ప్రాజెక్టుకు ఎంపికైన బీచ్‌లలో ఆయా అంశాల్లో పనులు పూర్తయిన అనంతరం ఎఫ్ఈఈ ప్రతినిధులు ఎక్కడైనా ఒకచోట ఒక చదరపు అడుగులో ఇసుకని తవ్వి నాణ్యత పరిశీలిస్తారు. నీటి నాణ్యతని కూడా పరిశీలించి సంతృప్తి చెందితే సర్టీఫికెట్ ఇస్తారు. బీచ్‌లో బ్లూ ఫ్లాగ్ (నీలం రంగు జెండా) ఎగురవేస్తారు. బ్లూ ఫ్లాగ్ ఎవరు ఇస్తారు? 1985లో డెన్మార్క్‌లో ప్రారంభించిన ’ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్’(ఎఫ్ఈఈ) ఏజెన్సీ 1987 నుంచి బ్లూ ఫ్లాగ్ సర్టీఫికెట్లను అందిస్తోంది. ప్రపంచంలో తొలిసారి ఈ సర్టీఫికెట్ పొందిన దేశం స్పెయిన్. బ్లూ ఫ్లాగ్ సర్టీఫికెట్ అందిస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకూ స్పెయిన్ దేశానికి చెందిన సాగరతీరాలు ఎక్కువ సంఖ్యలో బ్లూ ఫ్లాగ్ సర్టీఫికెట్స్‌ను సొంతం చేసుకున్నాయి. స్పెయిన్‌లో ఇప్పటి వరకు మొత్తం 566 బీచ్‌లు ఈ సర్టీఫికెట్ పొందగా, గ్రీస్ 515, ఫ్రా న్స్ 395 బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్స్ పొందాయి. మొత్తం 50 దేశాల్లో 4,831 బీచ్‌లకు ఈ సర్టీఫికెట్ లభించింది. బ్లూ ఫ్లాగ్ ఆవిష్కరణ కొమ్మాది(భీమిలి): రానున్న కాలంలో మరిన్ని బీచ్ లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ అన్నారు. రుషికొండ బీచ్‌లో శనివారం బ్లూ ఫ్లాగ్‌ను జేసీ కె.ఎస్.విశ్వనాథన్, బ్లూ ఫ్లాగ్ ఇండియా ఆపరేటర్ డాక్టర్ కురూప్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టూరిజం రీజనల్ డైరెక్టర్ శ్రీనివాస్, సమాచారశాఖ జేడీ వి.మణిరామ్ పాల్గొన్నారు. మన దేశంలో 2018లో తొలిసారిగా.. భారతదేశంలోనే కాదు.. ఆసియా ఖండంలో ఈ సర్టీఫికెట్ పొందిన తొలి బీచ్ ఒడిశాలోని కోణార్క్ తీరంలోని ’చంద్రబాగ్’ బీచ్. ఇది 2018లో ఈ సర్టిఫికెట్ పొందింది. ఆ తర్వాత ఇండియాలో మరో 12 తీర ప్రాంతాలను బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ పొందే స్థాయిలో అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పనిని పర్యావరణశాఖ ఆధ్వర్యంలో పని చేసే సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్ మెంట్‌కు అప్పగించింది. తొలి సారిగా భారత్‌కు చెందిన 13 బీచ్‌లు ఇందుకు అర్హత సాధించగా.. ఇప్పటి వరకూ 12 బీచ్‌లలో బ్లూ ఫ్లాగ్ ఎగురుతోంది. ఇవీ బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు.. మొత్తంగా 12 బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు ఉండగా.. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో ఒకే ఒక్క తీరంలో నీలి జెండా రెపరెపలాడుతోంది. 2020 అక్టోబర్ 10న రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ దక్కింది. అప్పటి నుంచి వరుసగా మూడేళ్లు ఎఫ్ఈఈ రుషికొండకు బ్లూ ఫ్లాగ్‌ను రెన్యువల్ చేస్తోంది. ఇంకా మనదేశంలో చంద్రబాగ్, రుషికొండతో పాటు బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే.. పుదుచ్ఛేరిలోని ఈడెన్ బీచ్, గుజరాత్‌లోని శివరాజ్ పూర్, డయ్యూలోని ఘోఘ్లా, కర్ణాటకలోని కసర్కోడ్, పడుబిద్రి బీచ్‌లు, కేరళలోని కప్పడ్, ఒడిశా నుంచి పూరి గోల్డెన్ బీచ్, అండమాన్ నికోబార్ దీవుల నుంచి రాధానగర్ బీచ్, లక్షద్వీప్ నుంచి మినికోయ్ తుండి, కద్మత్ బీచ్‌లు బ్లూ ఫ్లాగ్ సర్టీఫికేషన్ దక్కించుకున్నాయి. -
విశాఖ తీరంలో పెరుగుతున్న ప్రమాదాలు
-
పర్యావరణ ఉల్లంఘనలు లేవు
సాక్షి, అమరావతి: విశాఖలోని రుషికొండ రిసార్ట్ పునరుద్ధరణ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి పర్యావరణ ఉల్లంఘనలు చోటు చేసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. చట్టపరమైన అనుమతులన్నీ తీసుకున్న తరువాతే పునరుద్ధరణ పనులు ప్రారంభించామని, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలకు లోబడే జరుగుతున్నాయని తెలిపింది. ఆర్థిక, పర్యాటక అవకాశాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాలను అడ్డుకోవాలన్న దురుద్దేశంతోనే ఈ వ్యాజ్యాలను దాఖలు చేశారని పేర్కొంది. తప్పుడు ఆరోపణలతో దాఖలైన వ్యాజ్యాలను భారీ జరిమానాతో కొట్టి వేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నియమించిన నిపుణుల కమిటీ సైతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగ లేదని తేల్చినట్లు గుర్తు చేసింది. అడ్డుకునేందుకు జనసేన, టీడీపీ వ్యాజ్యాలు... విశాఖ జిల్లా యండాడ గ్రామం సర్వే నెంబర్ 19 పరిధిలోని కోస్టల్ రెగ్యులేషన్ జోన్లో చెట్ల నరికివేత, భూమి తవ్వకాలకు అధికారులు అనుమతించడం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ (ఎంఓఈఎఫ్) అనుమతులకు, విశాఖపట్నం పట్టణ ప్రాంతాభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధమంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గతేడాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇదే అంశంపై విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కూడా పిల్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కేవలం రిసార్ట్ పునరుద్ధరణకు సంబంధించినదని, దీని వల్ల పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం తరఫున దాఖలు చేసిన కౌంటర్లో పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ కూనపరెడ్డి కన్నబాబు నివేదించారు. రిసార్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలు, సౌకర్యాలతో పునరుద్ధరిస్తున్నట్లు కౌంటర్లో తెలిపారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం గురువారం విచారణ జరపనుంది. కౌంటర్లో ముఖ్యాంశాలు ఇవీ... 40 కాదు.. 9.88 ఎకరాల్లోనే ‘రూ.240 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయనున్నాం. కాలుష్య నియంత్రణ మండలి నుంచి నిరభ్యంతర పత్రం, సీఆర్‌జెడ్ అనుమతులు, కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అనుమతులు, రాష్ట్ర అటవీశాఖ అనుమతులు తీసుకున్నాం. ప్రాజెక్టును అడ్డుకునేందుకు కొందరు హరిత ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశారు. ట్రిబ్యునల్ నియమించిన నిపుణుల కమిటీ ప్రాజెక్టును పరిశీలించి ఎలాంటి పర్యావరణ నిబంధనల ఉల్లంఘన జరగడం లేదని తేల్చింది. అంతేకాక సీఆర్‌జెడ్–2లోనే ఈ ప్రాజెక్టు ఉందని చెప్పింది. అయినా కూడా ట్రిబ్యునల్ రిసార్ట్ పునరుద్ధరణ పనులపై స్టే విధించింది. సుప్రీంకోర్టు ఈ స్టేను ఎత్తివేసింది. హైకోర్టునే మిగిలిన అంశాలన్నింటినీ తేల్చమని ఆదేశించింది. నిరాధార ఆరోపణలు మినహా ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణం ఎలా ప్రభావితం అవుతుందో పిటిషనర్లు ఆధారాలు చూపలేకపోయారు. ఈ ప్రాజెక్టు కంభాలకొండ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం పరిధిలోకి రాదని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ తేల్చింది. 40 ఎకరాల్లో పనులు చేస్తున్నామని పిటిషనర్లు చెబుతున్నారు. వాస్తవానికి ప్రాజెక్టు పనులు 9.88 ఎకరాల్లోనే జరుగుతున్నాయి. అనుమతుల మంజూరు సందర్భంగా విధించిన ఏ షరతునూ మేం ఉల్లంఘించలేదు. తవ్విన మట్టిని రోడ్డు మార్జిన్ల కోసం ఉపయోగిస్తున్నామే కానీ సముద్రం వద్ద పారేయడం లేదు. పొదలు, సీఆర్‌జెడ్ నిబంధనల ప్రకారం గుర్తించిన చెట్లను మాత్రమే తొలగించాం. ఇందుకు అటవీశాఖ అనుమతులు కూడా తీసుకున్నాం. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ (వీఎంఆర్) మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా మేం వ్యవహరించడం లేదు’ అని కన్నబాబు కౌంటర్లో పేర్కొన్నారు. -
సరదాగా సాగర తీరాన.. వైజాగ్ బీచ్ ఫొటోలు
-
బీచ్‌లో సందడి చేస్తున్న పర్యాటకులు (ఫోటోలు)
-
రుషికొండ వెరీ కలర్‌ఫుల్(ఫోటోలు)
-
Rushikonda Beach: ఐదుగురిని కాపాడిన లైఫ్‌గార్డ్స్
కొమ్మాది(భీవిులి): రుషికొండ బీచ్‌లో పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఇక్కడ బీచ్‌కు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రికి చెందిన సోమ రాకేష్‌రెడ్డి, దాసరి అజయ్‌రెడ్డి, ఏనుగ విజయ్‌కుమార్‌రెడ్డి, సోమ రామకృష్ణారెడ్డి, పొన్నాల వంశీకృష్ణారెడ్డి వచ్చారు. వీరు సముద్రంలోకి దిగారు. కెరటాల ఉధృతి ఎక్కువగా ఉండటంతో సముద్రంలోకి కొట్టుకుపోయారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ గద్దిపిల్లి రమేష్, దేవాలు స్పందించి వారిని కాపాడారు. -
కోస్టల్ బ్యూటీ.. విశాఖ అందాలపై ప్రత్యేక కథనం
కొండకోనల్ని చూసినా.. అందాల మన్యంలో అడుగు పెట్టినా.. అలల సవ్వడితో హొయలొలుకుతున్న సాగర తీరంలో విహరిస్తున్నా.. ఆధ్యాత్మిక శోభతో ఆహ్లాదపరిచే దేవాలయాల్లో అర్చన చేసినా... ఏ చోటకు వెళ్లినా భూతల స్వర్గమంటే ఇదేనేమో అన్న అనుభూతిని అందిస్తుంది విహార విశాల విశాఖ. ప్రపంచంలోని అందాలన్నీ ఓచోట చేరిస్తే బహుశా దానినే విశాఖ అంటారేమో. రాష్ట్రంలో ఏడాదికి కోటికి పైగా పర్యాటకులు వస్తున్న జిల్లా ఏదైనా ఉందంటే అది విశాఖపట్నమే. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు ఇక్కడి సహజసిద్ధమైన అందాలకు ఫిదా అవుతుంటారు. సందర్శకుల మనసు దోచేలా ఈ సౌందర్యసీమను పర్యాటకంలో అగ్రభాగాన నిలిపేందుకు కొత్త ప్రాజెక్టులెన్నో పట్టాలెక్కనున్నాయి. పర్యాటక దినోత్సవం సందర్భంగా విశాఖ అందాలపై ప్రత్యేక కథనం.. సాక్షి, విశాఖపట్నం: భారత్‌లో అడుగుపెట్టే ప్రతి పది మంది విదేశీ పర్యాటకుల్లో ముగ్గురు విశాఖని సందర్శించేందుకు ఎంపిక చేసుకుంటున్నారు. ఎందుకంటే అద్భుత పర్యాటక ప్రాంతాలు విశాఖ సొంతం. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా జిల్లాలో ఉన్న అపార అవకాశాల్ని మెరుగు పరుచుకొని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూపకల్పన జరుగుతోంది. విశాఖ జిల్లానూ పర్యాటక ఖిల్లాగా మార్చే దిశగా టూరిజం ప్రాజెక్టులకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు గ్రౌండింగ్ అవ్వగా, మరికొన్ని పనులు ప్రారంభానికి సన్నద్ధం చేస్తున్నారు. ఇంకొన్నింటికి డీపీఆర్‌లు తయారవుతున్నాయి. చదవండి: (ఏపీ రొయ్య.. మీసం మెలేసింది!) సర్క్యూట్లు పూర్తయితే.. సూపర్ రాష్ట్రంలో టూరిజం సర్క్యూట్లు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసింది. అరకు టూరిజం సర్క్యూట్‌కి కేంద్రం ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉండగా.. మిగిలిన సర్క్యూట్లు కూడా కొత్త పాలసీ వచ్చాక ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రూ.156 కోట్లతో అరకు ఎకో టూరిజం సర్క్యూట్, రూ.49 కోట్లతో భీమిలిలో పాసింజర్ జెట్టీ సర్క్యూట్ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది. ఈ డీపీఆర్ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉండటంతో ఇటీవలే మంత్రి ముత్తంశెట్టి సంబంధిత అధికారులతో పాటు కేంద్ర మంత్రులతో భేటీ అయి.. ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు అనుమతులు కోరారు. అదే విధంగా బౌద్ధ కేంద్రాలైన బొజ్జనకొండ, తొట్లకొండ, బావికొండలను రూ.20.70 కోట్లతో బుద్ధిస్ట్ సర్క్యూట్ పేరిట అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ సర్క్యూట్లు సిద్ధమైతే.. పర్యాటకానికి మరిన్ని సొబగులు చేకూరనున్నాయి. 10 బీచ్‌ల అభివృద్ధితో కొత్త సోయగాలు విశాఖలోని బీచ్‌లంటే అందరికీ ఇష్టమే. ఆర్కే బీచ్‌కు రోజూ లక్షల మంది వస్తుంటారు. అందుకే కైలాసగిరి నుంచి భోగాపురం వరకు 10 బీచ్‌లు అభివృద్ధి చేయనున్నారు. సాగర్‌నగర్, తిమ్మాపురం, మంగమూరిపేట, చేపలుప్పాడ, ఐఎన్ఎస్ కళింగ, ఎర్రమట్టి దిబ్బలు, భీమునిపట్నం, నాగాయంపాలెం, అన్నవరం, కంచేరుపాలెం బీచ్‌లు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. ఆయా బీచ్‌లలో పర్యాటకులకు అవసరమైన వాష్‌రూమ్‌లు, ఛేంజింగ్‌రూమ్స్, తాగునీటి సౌకర్యం, ఫుడ్ కోర్టులు, ఫస్ట్‌ఎయిడ్, సీసీటీవీ కంట్రోల్ రూమ్, సిట్టింగ్ బెంచీలు, సిట్ అవుట్ అంబ్రెల్లాలు, రిక్‌లైయినర్స్, చిల్డ్రన్‌పార్కులు, ఫిట్నెస్ ఎక్విప్మెంట్, జాగింగ్ ట్రాక్, పార్కింగ్ సౌకర్యం మొదలైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు కానున్నాయి. వీటికి తోడుగా సేఫ్ స్విమ్మింగ్ జోన్లు అభివృద్ధి చెయ్యడంతో పాటు బీచ్ స్పోర్ట్స్, వాచ్ టవర్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా రానున్నాయి. చదవండి: (అందరి చూపు ‘ఆంధ్రా’వైపే) రుషికొండలో పారాసెయిలింగ్ సరికొత్త సాహస క్రీడకు విశాఖనే వేదికగా మార్చాలని పర్యాటక శాఖ భావిస్తోంది. ఇప్పటికే ఓ ప్రైవేట్ సంస్థ నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు బీచ్‌లను పరిశీలన చేసింది. రుషికొండలో పారాసెయిలింగ్ నిర్వహణకు అనుకూలంగా ఉందనీ, అక్కడ సీ స్పోర్ట్స్ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏపీ టూరిజంతో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు లేఖ రాసింది. త్వరలోనే రుషికొండలో పర్యాటకులకు పారాసెయిలింగ్ చేసే అవకాశం కలగనుంది. లంబసింగిలో ఎకో టూరిజం అటవీ ప్రాంతాల్లో అద్భుతమైన పర్యాటక ప్రపంచాన్ని ప్రజలకు పరిచయం చేసేందుకు టూరిజం శాఖ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రా ఊటీగా పిలిచే లంబసింగిలో ఎకో టూరిజం అభివృద్ధి చేయనున్నారు. హైఎండ్ టూరిజం రిసార్టులు నిర్మించనున్నారు. పర్యాటకులకు మన్యంలో అధునాతన సౌకర్యాలు అందించేలా రిసార్టులు రూపుదిద్దుకోనున్నాయి. దీనికి సంబంధించిన డీపీఆర్ త్వరలోనే పూర్తికానుంది. రెస్టారెంట్‌గా ఎంవీ మా కార్గోషిప్ తెన్నేటిపార్కు తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ కార్గో షిప్ ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా తీరంలో కనువిందు చేయనుంది. 30 గదులతో పాటు మల్టీకుజిన్ రెస్టారెంట్, బాంక్విట్ హాల్‌కూడా ఏర్పాటు చేస్తారు. చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేందుకు అనుమతులివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.10.50 కోట్లుగా నిర్ధారించింది. రూ.1021 కోట్లతో బీచ్ కారిడార్ కైలాసగిరి నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ వరల్డ్ క్లాస్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 30 కిలోమీటర్ల పరిధిలో విభిన్న సమాహారాల కలబోతగా టూరిజం ప్రాజెక్టులు రానున్నాయి. సుమారు 570 ఎకరాల విస్తీర్ణంలో రూ.1021 కోట్లతో బీచ్ కారిడార్ రూపుదిద్దుకోనుంది. సాగర తీరంలో.. సరికొత్త ప్రయాణం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి రాచబాట వేస్తున్న ప్రభుత్వం.. కైలాసగిరి నుంచి భోగాపురం వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర 6 లైన్లు నిర్మించి భవిష్యత్తులో 8 లైన్లుగా విస్తరించనున్నారు. ఈ రహదారి వెంబడి పర్యాటక శాఖ టూరిజం రిసార్టులు, అడ్వెంచర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, అటవీ శాఖ భూముల్లో ఎకో టూరిజం ప్రాజెక్టులు, ఎకో క్యాంపులు, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, అకామిడేషన్ బ్లాక్, గోల్ఫ్ కోర్సు నిర్మాణాలు జరగనున్నాయి. నూతన ప్రాజెక్టులు ►ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో పలుచోట్ల హోటళ్లు, రిసార్ట్స్, అమ్యూజ్మెంట్ పార్కులను ఏర్పాటు చేయబోతున్నారు. అరకులో రిసార్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ►అరకులో 5 స్టార్ రిసార్ట్స్ అభివృద్ధికి అవసరమైన భూమిని ఐటీడీఏ నుంచి సేకరించనున్నారు. లంబసింగిలో రోప్ వేలు ఏర్పాటు చేయనున్నారు. ►పర్యాటక శాఖకు సంబంధించి జిల్లాలో మొత్తం 550 ఎకరాల భూములున్నాయి. ఈ స్థలాల్ని లీజుకి ఇచ్చి పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు పర్యాటకాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ►సందర్శకుల సంఖ్య పెంచేందుకు వివిధ శాఖల సమన్వయంతో పర్యాటక శాఖ ముందుకెళ్తోంది. ఇందులోభాగంగా అరకు, లంబసింగి తదితర ప్రాంతాలను అటవీశాఖతో కలిసి మరింత అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ►జాతీయ పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగంగా ప్రసాద్ పథకం, స్వదేశ్ దర్శన్ పథకం ద్వారా పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ఈ ఏడాది ‘సమగ్ర వృద్ధి కోసం పర్యాటకం’ అనే అంశంపై పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. హోటళ్లను పర్యాటకశాఖ సారధ్యంలో అభివృద్ధి చేయడంతో పాటు ఏపీటీడీసీ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ వర్క్‌షాప్‌లు నిర్వహించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. కొత్త టూరిజం ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యం లభించనుంది. పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. – ముత్తంశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి -
రుషికొండ తీరంలో డాల్ఫిన్ల సందడి
సాక్షి, విశాఖపట్నం: వివిధ దేశాల సముద్ర తీరాల్లో విరివిగా కనిపించే డాల్ఫిన్లు.. విశాఖ జిల్లా రుషికొండ తీరంలో సందడి చేశాయి. రుషికొండలోని లివిన్ అడ్వెంచర్ సంస్థకు చెందిన స్కూబా డైవర్లు ఆదివారం ఉదయం స్పీడ్ బోట్లో తీరం నుంచి సుమారు మైలు దూరం వెళ్లగానే డాల్ఫిన్లు కనిపించాయి. సుమారు 15కిపైగా డాల్ఫిన్లు అలలతో పోటీపడుతున్నట్లు ఎగురుతూ సందడి చేశాయి. ఈ దృశ్యాలను లివిన్ అడ్వెంచర్స్ ప్రతినిధులు తమ కెమెరాల్లో బంధించారు. రెండేళ్ల కిందట కూడా ఇదే మాదిరిగా డాల్ఫిన్లు కనిపించాయని..మళ్లీ ఇప్పుడు అవి కనబడ్డాయని స్కూబా డైవింగ్ ప్రతినిధి బలరాంనాయుడు తెలిపారు. ఇవీ చదవండి: అండ్రు అరాచకాలు: కొండను తవ్వేసి.. అడవిని మింగేసి.. ఆధిపత్య పోరు: ‘టీడీపీ’లో ‘పిల్లి’ మొగ్గలు -
జలక్రీడలకు నెలవుగా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: జల క్రీడలకు విశాఖ బీచ్‌లు కేరాఫ్ అడ్రస్‌గా మారనున్నాయి. వివిధ విభాగాల్లో శిక్షణ అందించేలా రుషికొండలో వాటర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర, ఏపీ ప్రభుత్వాల నుంచి అనుమతులు లభించాయి. దీంతో అంతర్జాతీయ స్థాయిలో జల క్రీడలకు విశాఖ వేదికగా మారనుంది. అదేవిధంగా చింతపల్లి బీచ్‌లో డైవింగ్ అకాడమీ ఏర్పాటుకు పర్యాటక శాఖ పచ్చజెండా ఊపింది. ఏపీ స్కూబా డైవింగ్ అకాడమీ ఆవరణలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండూ అక్టోబర్‌లో ప్రారంభం కానున్నాయి. వాటర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్లో బోట్ డ్రైవర్స్‌కు శిక్షణ అందించడంతో పాటు లైఫ్ సేవింగ్, యాచింగ్, సెయిలింగ్, వింగ్ సర్ఫింగ్‌లో ట్రైనింగ్ అందిస్తారు. -
Photo Feature: రుషికొండ బీచ్‌లో.. వీకెండ్ జోష్
సాక్షి, విశాఖపట్నం: చాలా రోజుల తరువాత వీకెండ్‌ను వైజాగ్ సిటి జనులు ఆస్వాదించారు. కర్ఫ్యూ వేళలు సడలింపులతోపాటు.. పర్యాటక ప్రాంతాలు తెరుచుకోవడంతో సందర్శకులు బీచ్‌లో వాలిపోయారు. అలలతో ఆడుకున్నారు. కెరటాలతో సయ్యాటలాడారు. ఆకాశమే హద్దుగా సరదాగా గడిపారు. రుషికొండ బీచ్‌లో ఆదివారం సందడి వాతావరణం నెలకొంది. -ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్ -
రుషికొండ బీచ్‌కు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ రుషికొండ బీచ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పర్యావరణహిత, ప్రమాదరహిత బీచ్‌లకు అందించే బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్‌ని ఆదివారం ఈ బీచ్ దక్కించుకుంది. బ్లూఫ్లాగ్ ఇంటర్నేషనల్ జ్యూరీ బృందం ఆయా బీచ్‌ల్లో నిర్వహించిన పనుల్ని వర్చువల్ ద్వారా పరిశీలించింది. అనంతరం దేశంలో 13 బీచ్‌ల నుంచి ఎనిమిది బీచ్‌లు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్‌కు ఎంపికయ్యాయని వెల్లడించింది. అదేవిధంగా తీర ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణకు భారత్ తీసుకుంటున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని, బెస్ట్ ప్రాక్టీసెస్ విభాగంలో ఇండియా మూడో స్థానంలో నిలిచిందని బ్లూఫ్లాగ్ బీచెస్ ఆఫ్ ఇండియా మిషన్ లీడర్ సంజయ్ జల్లా ప్రకటించారు. బ్లూఫ్లాగ్ గుర్తింపు వల్ల లాభమేమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా బ్లూఫ్లాగ్ బీచ్‌లకు విశేష ఆదరణ ఉంటుంది. విదేశీ పర్యాటకులు ముందుగా బ్లూఫ్లాగ్ బీచ్‌నే ఎంపిక చేసుకుంటారు. ఈ సర్టిఫికెట్‌ని పొందాలంటే బీచ్ పర్యావరణహితంగా ఉండటంతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఎలాంటి రసాయనాలు బీచ్ పరిసరాల్లో కలవకుండా చూడాలి. ఈ సర్టిఫికెట్‌ని డెన్మార్క్‌కి చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) సంస్థ అందిస్తోంది. ఇప్పటివరకు 46 దేశాల్లో 4,500 బీచ్‌లు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్‌ని పొందాయి. మరిన్ని బీచ్‌ల గుర్తింపునకు కృషి చేస్తాం బీచ్‌ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, అధికారులు కష్టపడటం వల్లే బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ లభించింది. దేశంలో కేవలం 8 బీచ్‌లు ఈ గుర్తింపు పొందగా అందులో రుషికొండ ఉండటం గర్వంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలకు అనుగుణంగా ఏడాది కాలంగా బీచ్‌లో చేపట్టిన పనులు జ్యూరీ ప్రశంసలు పొందాయి. ఏపీ నుంచి మరిన్ని బీచ్‌లకు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ వచ్చేందుకు కృషి చేస్తాం. - పర్యాటక మంత్రి ముత్తంశెట్టి -
బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ రేసులో రుషికొండ బీచ్
సాక్షి, విశాఖపట్నం: అందాల విశాఖ సాగరతీరం పర్యావరణహిత బీచ్‌గా సందర్శకులను అలరించేందుకు ముస్తాబవుతోంది. మూడు దశాబ్దాల తర్వాత దేశంలో బ్లూఫ్లాగ్ ప్రాజెక్టుకు ఎంపికైన 13 బీచ్‌ల్లో రుషికొండ తీరం చోటు సాధించింది. (చదవండి: త్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్) బ్లూఫ్లాగ్ బీచ్ అంటే...? బ్లూఫ్లాగ్ బీచ్‌లు అంటే కాలుష్యం దరిచేరని పూర్తిగా పర్యావరణ అనుకూల సాగర తీరాలు. డెన్మార్క్‌కి చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) 1987 నుంచి బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ అందిస్తోంది. ఇప్పటివరకు 46 దేశాల్లో 4,500 బీచ్‌లు ఈ సర్టిఫికెట్ పొందాయి. తొలిసారిగా భారత్‌కు చెందిన 13 బీచ్‌లు ఇందుకు అర్హత సాధించాయి. బ్లూఫ్లాగ్ గుర్తింపు ఉన్న బీచ్‌లకు విశేష ఆదరణతోపాటు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఈ సర్టిఫికెట్ దక్కాలంటే బీచ్ పరిసరాలు పరిశుభ్రంగా, నీరు కలుషితం కాకుండా, రసాయనాలు దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సర్టిఫికెట్ ఇస్తారిలా.. బ్లూఫ్లాగ్ ధ్రువపత్రం పొందాలంటే నాలుగు విభాగాల్లోని 33 అంశాల్లో బీచ్‌ని అభివృద్ధి చేయాలి. మలినాలు, వ్యర్థాలు ఉండకూడదు. ప్రాజెక్టు పనులు పూర్తయిన అనంతరం ఎఫ్ఈఈ ప్రతినిధులు ఎక్కడైనా ఒకచోట ఒక చదరపు అడుగులో ఇసుకని తవ్వి నాణ్యత పరిశీలిస్తారు. నీటి నాణ్యతని కూడా పరిశీలించి సంతృప్తి చెందితే సర్టిఫికెట్ ఇస్తారు. బీచ్‌లో బ్లూఫ్లాగ్ (నీలం రంగు జెండా) ఎగురవేస్తారు. 80% పనులు పూర్తి బ్లూఫ్లాగ్ ప్రాజెక్టు కింద రుషికొండ బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.7.35 కోట్లు కేటాయించింది. వీటితో పనులు ప్రారంభించారు.ఇటీవల విశాఖలో బ్లూఫ్లాగ్ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఇక్కడ జరుగుతున్న పనుల్ని నిపుణుల బృందం పరిశీలించింది. 80 శాతం పనులు పూర్తైనట్లు ధృవీకరించారు. 600 చదరపు మీటర్ల మేర బ్లూ ఫ్లాగ్ బీచ్‌గా అభివృద్ధి చేస్తున్నారు. (బాబాయ్ ఇలా మాట్లాడతారా; సంచయిత భావోద్వేగం..) బ్లూఫ్లాగ్ ఎగరేస్తాం.. ‘రుషికొండ బీచ్‌ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. బ్లూఫ్లాగ్ బీచ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించాం. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుతూ సముద్ర జలాల్లో ఎలాంటి రసాయనాలు కలవకుండా చర్యలు తీసుకుంటున్నాం. తీరంలో ఇసుకని ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాం. రెండు ఆధునిక యంత్రాల ద్వారా పనులు నిర్వహిస్తున్నాం. జూన్‌లో బ్లూఫ్లాగ్ బృందం బీచ్‌ను పరిశీలించే అవకాశం ఉంది. రుషికొండ బీచ్‌లో కచ్చితంగా బ్లూఫ్లాగ్ ఎగరేసేందుకు యంత్రాంగమంతా కలిసికట్టుగా పని చేస్తున్నాం’ – పూర్ణిమాదేవి, బ్లూఫ్లాగ్ నోడల్ అధికారి పర్యావరణహితంగా నిర్మితమైన టాయిలెట్లు సదుపాయాలివీ.. ► బీచ్‌లో మౌలిక సదుపాయాలన్నీ పర్యావరణ హితంగా వెదురుతో నిర్మిస్తున్నారు. త్రిపుర నుంచి తెచ్చిన వెదురు 10 ఏళ్ల పాటు పాడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖపర్యాటకులు ఇసుక తిన్నెల్లో కూర్చొని సేదతీరేలా బెంచ్‌లతో పాటు గడ్డి, వెదురు పుల్లలతో గొడుగులు ఏర్పాటు చేశారు. వీటి కింద కూర్చోవడం వల్ల చల్లటి వాతావరణంలో పర్యాటకులు ఆహ్లాదంగా గడుపుతారు. ► ఎక్కడా మలినాలు, చెత్త లేకుండా 25 మంది సిబ్బందితో బీచ్ మొత్తం ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. ► విద్యుత్ కోసం సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. 40 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ నుంచి 35 కేవీ విద్యుత్‌ని ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్నారు. బీచ్‌లో ఏర్పాటు చేసిన 70 ఎల్ఈడీ విద్యుత్ బల్బులకు సోలార్ పవర్‌నే వాడుతున్నారు. ► బీచ్ పరిరక్షణ కోసం 10 మంది రక్షణ సిబ్బందిని నియమించారు. బీచ్‌లో ఎవరూ ప్రమాదాల బారిన పడకుండా ముగ్గురు పర్యవేక్షకుల్ని ఏర్పాటు చేశారు. 55 సీసీ కెమేరాలతో నిరంతరం నిఘా పెట్టారు. ► బీచ్‌లో చెత్త నుంచి ఎరువు తయారు చేసేందుకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉత్పత్తి చేసే ఎరువుల్ని మొక్కల పెంపకానికి వినియోగించనున్నారు. ► మరుగుదొడ్లకి వినియోగించే నీటిని పునర్వినియోగించేలా గ్రేవాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. రుషికొండ బీచ్‌లో ఏర్పాటయ్యేవి ⇒ రెండు వైపులా పార్కింగ్ ⇒ 2 చోట్ల లైఫ్‌గార్డులు, వాచ్‌టవర్ ⇒ 8 ఓపెన్ షవర్లు, 6 దుస్తులు మార్చుకునే గదులు ⇒ పిల్లల పార్క్ ⇒ వ్యాయామ పరికరాలు ⇒ కూర్చునేందుకు 11 బెంచీలు ⇒ జాగింగ్ ట్రాక్ ⇒ బీచ్ సమగ్ర సమాచారం తెలిపే బోర్డు ⇒ 8 మరుగుదొడ్లు ⇒ మురుగు నీటి నిర్వహణ, గ్రేవాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ⇒ సౌర విద్యుత్తు ప్లాంట్ ⇒ సేఫ్ స్విమ్మింగ్ జోన్ ⇒ రాకీ ప్యాచ్ ⇒ 16 చోట్ల సిట్‌అవుట్ అంబ్రెల్లా విత్ రిక్లైనర్ ⇒ వాటర్ శాంప్లింగ్ పాయింట్ ⇒ ఏపీటీడీసీ ఫుడ్ కోర్టులు ⇒ ఏపీటీడీసీ బోటింగ్ కార్యాలయం ⇒ యాంఫిబియాస్ వీల్ చెయిర్లు ⇒ దేవాలయం ⇒ కమాండ్ కంట్రోల్ రూమ్ -
రిషికొండ బీచ్‌కు మహర్దశ.. 'బీమ్స్' ప్రాజెక్టులో చోటు
సాక్షి, న్యూఢిల్లీ : విశాఖపట్నంలోని రిషికొండ బీచ్‌కు మహర్దశ పట్టబోతోంది. దేశంలోని 13 బీచ్‌లను అంతర్జాతీయ స్థాయి బీచ్‌లుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘బీచ్ ఎన్విరాన్మెంట్ & ఈస్థటిక్స్ మేనేజ్మెంట్ సర్వీసెస్’ (బీమ్స్) ప్రాజెక్ట్‌లో రిషికొండ బీచ్‌కు చోటు దక్కినట్లు పర్యావరణశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. సోమవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ప్రాచీన కోస్తా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పర్యావరణహిత బీచ్‌లుగా పర్యాటకలను ఆకర్షించే బీచ్‌లను రూపొందించడం బీమ్స్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. దేశంలోని కోస్తా తీరం కలిగిన రాష్ట్రాలలోని 13 బీచ్‌లను ఈ కార్యక్రమం కోసం గుర్తించినట్లు ఆయన చెప్పారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లోని రిషికొండ బీచ్ ఒకటి అని అన్నారు. బీమ్స్ కార్యక్రమం కింద చేపట్టే బీచ్‌ల అభివృద్ధిలో భాగంగా బీచ్ పర్యాటకుల సౌకర్యాలకు పెద్ద పీట వేస్తారన్నారు. పర్యాటకుల కోసం బీచ్‌లో పర్యావరణహితమైన బయో టాయిలెట్ల నిర్మాణం, ఆధునిక స్నానాల గదులు, శుద్ధి చేసిన తాగు నీరు, పాత్‌వేస్, సీటింగ్ సౌకర్యాలు, గొడుగుల కింద కూర్చోవడానికి వీలుగా చెక్క కుర్చీలు, పిల్లల ఆట స్థలాలు, ఫిట్నెస్ పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ స్టేషన్, క్లాక్ రూమ్ సౌకర్యం, వాహనాల పార్కింగ్ స్థలం, బీచ్ లేఔట్, సైనేజ్‌లు వంటి సకల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే బీచ్‌లో గార్డెనింగ్, టాయిలెట్లలో ఫషింగ్ కోసం నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకోవడానికి వీలుగా గ్రేవాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను నెలకొల్పుతారు. బయో-వేస్ట్‌ను శుద్ధిచేయడానికి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌ను, విద్యుత్ అవసరాల కోసం సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే బీచ్ ప్రాంతమంతా సీసీటీవీ నిఘాలో ఉంటుందని, బీచ్ పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా గార్డులు ఉంటారన్నారు. వీటికి తోడు భద్రత కోసం వాచ్ టవర్లు, తగినంత భద్రతా సామాగ్రితో లైఫ్ గార్డులను ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని మంత్రి చెప్పారు. -
‘బ్లూ ఫ్లాగ్ బీచ్‌గా రిషికొండకు అవకాశం’
ఢిల్లీ: దేశంలో ఎంపిక చేసిన బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ సాధించే దిశగా ప్రభుత్వం ప్రయాత్నాలు ప్రారంభించినట్లు పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో వెల్లడించారు. సోమవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. విజయ సాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. దేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం ఎంపిక చేసిన 13 పైలట్ బీచ్‌ల జాబితాలో రిషికొండ బీచ్ కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. విశాఖపట్నంలోని రిషికొండ బీచ్‌కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ బీచ్‌గా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ ఏజెన్సీ అయిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, డెన్మార్క్ సంస్థ అత్యంత కఠినమైన అంశాల ప్రాతిపదికన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను జారీ చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. బీచ్‌లో స్నానానికి వినియోగించే నీటి నాణ్యత, పర్యావరణ యాజమాన్యం.. నీటి రక్షణ కోసం చేపట్టే చర్యల వంటివి ప్రధానమైన అంశాలని ఆయన తెలిపారు. బ్లూ ఫ్లాగ్ బీచ్ ఎకో టూరిజం మోడల్లో ఉంటుందని మంత్రి వివరించారు. పరిశుభ్రమైన పరిసరాలు, స్వచ్ఛమైన నీరు, పలు సౌకర్యాలు, ఆరోగ్యవంతమైన పర్యావరణం బీచ్ సందర్శకులకు కల్పిచటం బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ప్రధాన లక్ష్యమని మంత్రి బాబుల్ సుప్రిమో తెలిపారు. -
రుషికొండ బీచ్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
విశాఖపట్నం : ఉన్నత చదువులు చదివినా.. ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురైన యశ్వంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో ఆదివారం జరిగింది. బీటెక్ పూర్తి చేసిన యశ్వంత్ ఉద్యోగాన్వేషణలో భాగంగా విశాఖలోని ఎంవీపీ కాలనీలో నివాసముంటున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో రుషికొండ బీచ్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా మృతుడు విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం వాసిగా గుర్తించారు. -
రుషికొండ రేవ్ పార్టీ : నలుగురు అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం : రుషికొండ రేవ్ పార్టీ వ్యవహారంలో సీతమ్మధారకు చెందిన ఎం.సత్యనారాయణతో పాటు మరో నలుగురి అరెస్ట్ చేశామని ఏసీపీ వైవీ నాయుడు పేర్కొన్నారు. బర్త్‌డే పార్టీ పేరుతో రుషికొండ సాగరతీరం సర్వే నంబర్ 61లో విశ్వనాథ్ బీచ్ ఫ్రంట్ సంస్థ రేవ్ పార్టీ నిర్వహించగా పోలీసులు దాడి చేసి కొంత మందిని పట్టుకున్నారు. ఈ ఘటనపై ఏసీపీ వైవీ నాయుడు మాట్లాడుతూ.. నిందితులను నుంచి 9.7 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేనుకున్నామని తెలిపారు. చదవండి : ఈవెంట్ల పేరుతో రేవ్ పార్టీలు! రేవ్ పార్టీలో కొకైన్ వినియోగించినట్లు గుర్తించామన్నారు. పార్టీ నిర్వాహకులు ఈ కొకైన్‌ను గోవా నుంచి దిగుమతి చేసుకున్నారని తెలిపారు. ఈ రేవ్ పార్టీలో రాజకీయ నాయకుల పిల్లలు లేరని స్పష్టం చేశారు. రుషి కొండ పరిసర ప్రాంతాల్లోని డాబాలు, విద్యా సంస్థలకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. రేవ్ పార్టీపై సీరియస్‌గా ఉన్నామని, మరింత లోతుగా విచారణ జరిపుతామని మీడియాకు వివరించారు. -
విశాఖలో విష సంస్కృతికి మళ్లీ ‘లైసెన్సు’
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేతలు తమ కాసుల కక్కుర్తితో యువతను పెడదారి పట్టించేందుకు సైతం వెనుకాడటం లేదు. ఈవెంట్ల పేరుతో రేవ్ పార్టీలు నిర్వహిస్తూ విశాఖలో విష సంస్కృతికి బీజం వేస్తున్నారు. తాజాగా రుషికొండ ఇసుక తిన్నెలపై ఈవెంట్ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారు. అయితే వీటిని ఈవెంట్ల కింద చూపిస్తూ.. కాశీ విశ్వనాథ్(జిల్లా మంత్రి అనుచరుడు)కు చెందిన ‘విశ్వనాథ్ బీచ్ ఫ్రంట్ ప్రైవేటు లిమిటెడ్’ పర్యాటక శాఖ నుంచి అనుమతి తెచ్చుకుంది. వాస్తవానికి సాగరతీరంలో పర్యావరణ అనుమతులు లేకుండా ఈవెంట్ల నిర్వహణకు లైసెన్స్ ఇవ్వకూడదని గతేడాది హైకోర్టు ఆదేశాలిచ్చింది. కానీ మంత్రి అనుచరుడు కావడం, ముడుపులు ముట్టడంతో ఎలాంటి అడ్డు చెప్పకుండా.. పర్యాటక శాఖ అనుమతులిచ్చేసింది. రేవ్ పార్టీతో బోణీ.. రుషికొండ సాగరతీరం సర్వే నంబర్ 61లో బీచ్ సంబంధిత క్రీడలు, ఈవెంట్ల నిర్వహణ పేరిట విశ్వనాథ్ బీచ్ ఫ్రంట్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) నుంచి 15 ఏళ్లకు గానూ లీజు అనుమతులు తెచ్చుకుంది. నెలకు రూ.2 లక్షల చొప్పున ఏడాదికి రూ.24 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఉన్నత స్థాయిలో అధికార బలాన్ని ఉపయోగించి ఆగమేఘాలపై లైన్ క్లియర్ చేయించుకుంది. ఏపీటీడీసీలో ప్రాజెక్ట్సు చూసే ఓ ఉన్నతాధికారి ఇందుకు సహకరించడంతో అనుమతులు తేలిగ్గా వచ్చేశాయి. విశ్వనాథ్ బీచ్ ఫ్రంట్ ఏపీటీడీసీతో లీజు ఒప్పందం కుదుర్చుకుందన్న సంగతి ఆ శాఖలో చాలామంది అధికారులకు తెలియకపోవడం గమనార్హం. జిల్లాకు చెందిన మంత్రికి విశ్వనాథ్ ప్రధాన అనుచరుడిగా ఉండడం వల్ల లీజు పని సులువైనట్లు తెలిసింది. ఈ సంస్థ ఈవెంట్లకు అవసరమైన రెస్టారెంట్లు, ఇతర ఏర్పాట్లను కూడా పూర్తి చేయలేదు. కానీ ఈ సంస్థ రెండ్రోజుల క్రితం రేవ్ పార్టీతో ‘ఈవెంట్‌కు’ బోణీ కొట్టింది. మద్యంతో పాటు మాదకద్రవ్యాలను సేవించిన పలువురు యువతీ, యువకులు ఒళ్లు మరిచి చిందులేశారు. మసక చీకట్లో ఇసుక తిన్నెలపై ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ విశాఖ ఖ్యాతిని మంటగలిపారు. ఎక్సైజ్ అధికారుల అత్యుత్సాహం.. ఇక ఈవెంట్ పేరిట నిర్వహిస్తున్న ఈ రేవ్ పార్టీకి ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఈనెల 13వ తేదీ రాత్రి తమ ఈవెంట్లో మద్యం సరఫరా చేసేందుకు అనుమతించాలని.. ఆ రోజు ఉదయం కాశీ విశ్వనాథ్ కుమారుడు నరేంద్రకుమార్ అడగ్గానే అనుమతులిచ్చేశారు. వాస్తవానికి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడానికి ఎక్సైజ్ శాఖ అనుమతించకూడదు. లిక్కర్ షాపుల మాదిరిగానే ఈవెంట్లలో సైతం రాత్రి 11 గంటలకే మద్యం సరఫరా ముగించాలి. కానీ తెల్లవారుజాము వరకు కూడా యువతీయువకులు తాగి ఊగినా పట్టించుకోవడం మానేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ అధికారులకు భారీగా ముడుపులు ముట్టినట్లు తెలిసింది. ఒకరి అరెస్టు.. రుషికొండ రేవ్ పార్టీ వ్యవహారంలో సీతమ్మధారకు చెందిన ఎం.సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేశారు. ఆరిలోవ పోలీసులు అతని నుంచి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, రుషికొండ విశ్వనాథ్ బీచ్ ఫ్రంట్ ప్రైవేటు లిమిటెడ్ లీజుదారుడు బి.నరేంద్రకుమార్, రేవ్ పార్టీ నిర్వాహకుడు సోను ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఏపీటీడీసీ డీవీఎం ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. విశ్వనాథ్ బీచ్ ఫ్రంట్ సంస్థ రేవ్ పార్టీ నిర్వహించిన ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. హైకోర్టు ఆదేశాలు తోసిరాజని.. సాగరతీరంలో పర్యావరణ అనుమతుల్లేకుండా ఎలాంటి ఈవెంట్లు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవద్దని 2018 మే 1న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తొట్లకొండలో ఓ రెస్టారెంట్ ఏర్పాటుకు సంబంధించి విశాఖ టౌన్ ఫిషర్ ఉమెన్ డ్రైఫిష్ కోపరేటివ్ సొసైటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ఈ మేరకు ఏపీటీడీసీకి ఆదేశాలిచ్చింది. కాగా, ఫిషర్మెన్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు చెందిన తెడ్డు శంకర్ మాట్లాడుతూ.. తాజా వ్యవహారంపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని చెప్పారు. -
సముద్రంలో మునిగి ఇద్దరు యువకుల మృతి
మరో ముగ్గురు ఆస్పత్రికి తరలింపు.. అంతా హైదరాబాద్ వాసులే సాగర్‌నగర్ (విశాఖ తూర్పు): సెలవు రోజు కావడంతో ఆదివారం సరదాగా రుషికొండ బీచ్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు మృత్యువాతపడగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన అక్బర్, హుస్సేన్, మోహిజ్, రాహుల్ ఉపాధ్యాయ, నావల్ అనే ఐదుగురు యువకులు డైమండ్ పార్కు వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన కరాచీవాలా దుకాణంలో పని చేసేందుకు వచ్చారు. మురళీనగర్‌లో ఓ రూమ్ అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. వీరంతా విశాఖకు చెందిన యూసఫ్ అనే మరో యువకుడితో కలసి ఆదివారం ఉదయం రుషికొండ బీచ్‌కు వెళ్లారు. యూసఫ్ ఒడ్డునే ఉండగా హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు యువకులు సముద్రంలో స్నానం చేసేందుకు దిగారు. అలల తాకడికి వీరంతా ప్రమాదంలో చిక్కుకోవడాన్ని గమనించిన యూసఫ్ కేకలు వేయగా సమీపంలో ఉన్న ఇద్దరు మత్స్యకార యువకులు వచ్చి వారిని ఒడ్డుకు చేర్చారు. అయితే అప్పటికే రాహుల్ ఉపాధ్యాయ (33), నావల్ (25) మృతి చెందారు. తీవ్ర అస్వస్థతతకు గురైన అక్బర్, హుస్సేన్, మోహిజ్‌లను సమీపంలోని గీతం ఆస్పత్రికి తరలించడంతో వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తీరం ఘోరం
1.5 కి.మీ. మేర కోతకు గురైన రుషికొండ బీచ్ కొట్టుకుపోయిన పర్యాటక, జీవీఎంసీ రోడ్లు రూ.15 లక్షలు సముద్రం పాలు మారిటైం యూనివర్సిటీ నిపుణులతో అధ్యయనం రక్షణ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు కోతకు గురైన బీచ్‌ను పరిశీలించిన కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సాక్షి, విశాఖపట్నం : పర్యాటక ప్రాంతమైన రుషికొండ బీచ్ ఘోరంగా తయారైంది. రోజురోజుకూ మరింత కోతకు గురవుతూ పర్యాటకులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఒకటిన్నర కిలోమీటర్ల మేర కోతకు గురైనట్టుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో ఏడాది క్రితం జీవీఎంసీ రూ.10 లక్షలతోనూ, మూడేళ్ల క్రితం పర్యాటక శాఖ రూ.5లక్షలతోనూ నిర్మించిన రహదారులు పూర్తిగా కోతకు గురయ్యాయి. తీరం నుంచి 200 అడుగుల మేర కోతకు గురైనట్టుగా గుర్తించారు. తీరంలో నిర్మించుకున్న దుకాణాల వరకు సముద్రం చొచ్చుకొచ్చింది. ఇక్కడ నిర్మించిన పర్యాటక కట్టడాలు సైతం ప్రమాదస్థితిలో ఉన్నాయి. ఈ ప్రాంతాలను గురువారం జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, పర్యాటక శాఖ ప్రాంతీయ డైరెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు, జీవీఎంసీ సీఈ చంద్రయ్య పరిశీలించారు. బీచ్‌కోతపై అధ్యయనం ఈ ప్రాంతంలో బీచ్ ఎందుకు కోతకు గురవుతోంది? ఇంకా ఎంత మేర కోతకు గురయ్యే అవకాశం ఉంది? వంటి అంశాలపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. బీచ్ పరిరక్షణ కోసం రక్షణ గోడ నిర్మించాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఈ మేరకు మారిటైం యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ శివకొందులుతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. సీఈ నేతృత్వంలో ఓ బందం నేడు విజయవాడ వెళ్లనుంది. శివకొందులుతో భేటీ అయి ఇక్కడి పరిస్థితిని వివరించనున్నారు. ఆయన కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత చేసే సిఫార్సుల మేరకు రక్షణ గొడను యుద్ధప్రాతిపదికన నిర్మించాలని నిర్ణయించారు. బీచ్ కోత వల్ల ప్రమాదకర స్థితిలో ఉన్న కట్టడాలతో పాటు దుకాణాలను కూడా తొలగించి వారికి వేరే చోట వసతి కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇక్కడ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఎంపీ థియేటర్ నిర్మించనున్నందున, దీనికి అవసరమైన అప్రోచ్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. బీచ్‌కోతపై ఇప్పటికే అధ్యయనం జరుగుతోందని దీనిపై నివేదిక వచ్చాక ఇతర బీచ్‌లతో పాటు ఇక్కడ కూడా శాశ్వత పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈలోగా తాత్కాలిక చర్యలు చేపట్టి తీరాన్ని పరిరక్షించాలన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పార్కుల అభివద్ధి తదిర పనులను త్వరగా పూర్తి చేసి వీలైనంత త్వరగా బీచ్‌కు పూర్వవైభవం తీసుకు రావాలని కోరారు.