
కొమ్మాది(భీవిులి): రుషికొండ బీచ్‌లో పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఇక్కడ బీచ్‌కు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రికి చెందిన సోమ రాకేష్‌రెడ్డి, దాసరి అజయ్‌రెడ్డి, ఏనుగ విజయ్‌కుమార్‌రెడ్డి, సోమ రామకృష్ణారెడ్డి, పొన్నాల వంశీకృష్ణారెడ్డి వచ్చారు.
వీరు సముద్రంలోకి దిగారు. కెరటాల ఉధృతి ఎక్కువగా ఉండటంతో సముద్రంలోకి కొట్టుకుపోయారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ గద్దిపిల్లి రమేష్, దేవాలు స్పందించి వారిని కాపాడారు.
Comments
Please login to add a commentAdd a comment