
సాక్షి, విశాఖపట్నం: వివిధ దేశాల సముద్ర తీరాల్లో విరివిగా కనిపించే డాల్ఫిన్లు.. విశాఖ జిల్లా రుషికొండ తీరంలో సందడి చేశాయి. రుషికొండలోని లివిన్ అడ్వెంచర్ సంస్థకు చెందిన స్కూబా డైవర్లు ఆదివారం ఉదయం స్పీడ్ బోట్‌లో తీరం నుంచి సుమారు మైలు దూరం వెళ్లగానే డాల్ఫిన్లు కనిపించాయి.
సుమారు 15కిపైగా డాల్ఫిన్లు అలలతో పోటీపడుతున్నట్లు ఎగురుతూ సందడి చేశాయి. ఈ దృశ్యాలను లివిన్ అడ్వెంచర్స్ ప్రతినిధులు తమ కెమెరాల్లో బంధించారు. రెండేళ్ల కిందట కూడా ఇదే మాదిరిగా డాల్ఫిన్లు కనిపించాయని..మళ్లీ ఇప్పుడు అవి కనబడ్డాయని స్కూబా డైవింగ్ ప్రతినిధి బలరాంనాయుడు తెలిపారు.
ఇవీ చదవండి:
అండ్రు అరాచకాలు: కొండను తవ్వేసి.. అడవిని మింగేసి..
ఆధిపత్య పోరు: ‘టీడీపీ’లో ‘పిల్లి’ మొగ్గలు
Comments
Please login to add a commentAdd a comment