
విశాఖపట్నం : ఉన్నత చదువులు చదివినా.. ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురైన యశ్వంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో ఆదివారం జరిగింది. బీటెక్ పూర్తి చేసిన యశ్వంత్ ఉద్యోగాన్వేషణలో భాగంగా విశాఖలోని ఎంవీపీ కాలనీలో నివాసముంటున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో రుషికొండ బీచ్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా మృతుడు విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం వాసిగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment