Putin says situation extremely difficult in Ukrainian regions - Sakshi
Sakshi News home page

రష్యా బలగాలకు ఆకస్మిక ఆదేశాలు.. భయాందోళనలో ఉక్రెయిన్‌

Published Tue, Dec 20 2022 4:04 PM | Last Updated on Tue, Dec 20 2022 5:38 PM

Putin Said Situation In Four Regions Of Ukraine Extremely Difficult - Sakshi

రష్యాలో భాగంగా ప్రకటించిన ఉక్రెయిన్‌లోని నాలుగు కీలక ప్రాంతాల్లో గట్టి భద్రత తోపాటు నిఘాను పెంచాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సడెన్‌గా దళాలకు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా ఉందని మరింత భద్రత ఏర్పాటు చేయాలని ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌కు ఆదేశాలు ఇచ్చారు. వాస్తవానికి రష్యా ఉక్రెయిన్‌పై నిరవధిక దాడి జరిపి సెప్టెంబర్‌ 30న ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్‌, లుహాన్స్క్‌, జపోరిజ్జియా, ఖేర్సన్‌ తదితర ప్రాంతాలను తమ భూభాగంలోని భాగంగా ఏకపక్షంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా, ప్రస్తుతం పుతిన్‌ బెలారస్‌ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే రష్యా ఈ శీతకాలంలో ఉక్రెయిన్‌లోని విద్యుత్‌ కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్‌లతో దాడులు చేసి ఎముకలు కొరికే చలితో అల్లాడిపోయేలా చేసింది. అదీగాక ప్రస్తుతం పుతిన్‌ బెలారస్‌ పర్యటన ఉక్రెయిన్‌ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. యుద్దాన్ని మరింత తీవ్రతరం చేసే ఎత్తుగడలో భాగంగానే పుతిన్‌ అకస్మాత్తుగా బెలారస్‌లో పర్యటిస్తున్నట్లు ఆరోపించింది. అంతేకాదు రష్యా తన మిత్రదేశమైన బెలారస్‌ని ఉక్రెయిన్‌పై దాడి చేయమని ఒత్తిడి చేసే అవకాశం ఉందంటూ ఉక్రెయిన్‌ తీవ్ర భయాందోళనలను వ్యక్తం చేసింది.

వాస్తవానికి ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యా సిద్దమయ్యేలా చేసింది కూడా బెలారస్‌నే కావడం గమనార్హం. ఉక్రెయిన్‌పై చేస్తున్న దాడి నేపథ్యంలోనే విదేశాల నుంచి వచ్చే బెదిరింపులు, స్వదేశంలోని దేశద్రోహులు తదితరాల దృష్ట్యా పుతిన్‌ గట్టి నిఘా ఉంచాలని దళాలను ఆదేశించారు కూడా. పుతిన్‌ బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకాషెంకోతో ఇరు దేశాలకు ఒకే రక్షణ స్థలం ఏర్పాటు గురించి చర్చించనున్నట్లు సమాచారం. కానీ పుతిన్‌ పొరుగు దేశాన్ని మింగేయడానికి ఇదోక  ఎత్తుగడని పలు దేశాలు విమర్శలు గుప్పించాయి.

ఐతే రష్యా మాత్రం ఎలాంటి విలీనానికి మాస్కోకి ఆసక్తి లేదని తేల్చి చెప్పింది. అలాగే ఉక్రెయిన్‌లోకి తమ దేశ సైన్యాన్ని పంపే ఉద్దేశం కూడా తనకు లేదని బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ కూడా పదేపదే చెబుతున్నాడు. కానీ పలువురు విశ్లేషకులు ఉక్రెయిన్‌పై దాడుల కోసం రష్యా బెలారసియన్‌ సైనికులు మద్దతును కోరుతుందని చెబుతున్నారు.  ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాత్రం ఈ యుద్ధాన్ని మరింత వేగవంతంగా ముగించేలా పశ్చిమ దేశాలు తమకు ఆయుధ సంపత్తి తోపాటు కొత్త రక్షణ సామర్థ్యాలను అందిస్తాయని చెప్పారు.  

(చదవండి: ఉక్రెయిన్‌పై క్షిపణుల వర్షం.. రష్యా మాస్టర్‌ ప్లాన్‌తో తీవ్ర ఇబ్బందులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement