వివాహిత అనుమానాస్పద మృతి
వివాహిత అనుమానాస్పద మృతి
Published Wed, Jul 27 2016 12:51 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
ప్రియురాలితో కలిసి భర్తే హత్య చేశాడని పుట్టింటి వారి ఆరోపణ
ఆమె ఒంటిపై పలు రక్తపు గాయాలు
పోలీసుల అదుపులో నిందితులు
సీతానగరం :
మండలంలోని బొబ్బిల్లంక గ్రామంలోని సుబ్బారావుపేటలో బొడ్డు దుర్గ (28) అనే వివాహిత అత్తవారింట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో సోమవారం రాత్రి మృతి చెందింది. ఆమె ఒంటిపై రక్తపు గాయాలున్నాయి. దుర్గను భర్త బొడ్డు నరేష్, అతడి ప్రియురాలు మేరీ కలిపి హత్య చేశారని దుర్గ పుట్టింటి వారు ఆరోపించారు. కాగా దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి నిందితులు ప్రయత్నం చేశారు. గ్రామస్తులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ గ్రామానికి చెందిన నరేష్ కూలి పనులు చేస్తుంటాడు. కొన్నేళ్ల క్రితం అతడు పనుల కోసం కపిలేశ్వరపురం వెళ్లగా, అక్కడ పరిచయమైన దుర్గను ప్రేమ వివాహం చేసుకున్నాడు. నరేష్ ఎస్సీ కాగా, దుర్గ బీసీ. బొబ్బిల్లంకలో నివాసం ఉంటున్న ఈ దంపతులకు ఏడేళ్ల కుమార్తె మహిమాన్విత, అయిదేళ్ల కుమారుడు మణిదీప్ ఉన్నారు. న రేష్ ఇదే గ్రామానికి చెందిన మేరీ అనే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, వారిద్దరూ కలిసి దుర్గను హత్య చేశాడని కపిలేశ్వరపురం నుంచి వచ్చిన దుర్గ తల్లి మాతా వెంకయమ్మ, పెదనాన్న కొడుకులు లోవరాజు, శ్రావణకుమార్‌లు తెలిపారు. రెండు నెలల క్రితం దుర్గ చేతిని ఆమె భర్త నరేష్ విరగ్గొట్టగా, సిమెంట్ కట్టు కట్టించుకుందని చెప్పారు. సోమవారం రాత్రి నరేష్, తన ప్రియురాలు మేరీతో కలిసి దుర్గను వారి ఇంట్లోనే హత్య చేసి Ðð ళ్లిపోయి, ఉరిపోసుకున్నట్టుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
స్థానికుల కథనం..
నరేష్ కొంతకాలంగా మేరీతో వివాహేతర సంబంధం సాగిస్తున నేపథ్యంలో నరేష్, దుర్గ దంపతులు తరచూ గొడవపడేవారిని బొబ్బిల్లంక వాసులు తెలిపారు. సోమవారం రాత్రి భర్త తన ప్రియరాలి ఇంటివద్ద ఉండటంతో దుర్గ వెళ్లి వేసి తలుపులు కొడుతూ భర్త నరేష్‌ను బయటకు రావాలని పిలిచిందని చెప్పారు. నరేష్ బయటకు రాకపోవడంతో ఆమె తిరిగి తన ఇంటికి వెళ్లిపోయిందని చెప్పారు. రాత్రి 11.30 గంటల సమయంలో ప్రియురాలితో కలిసి నరేష్ తన ఇంటికి వచ్చి భార్యను హత్య చేసి, ఇంటి వెనుక ఉన్న ద్వారం నుంచి తిరిగి ప్రియురాలి ఇంటికి Ðð ళ్లిపోయాడని స్థానికులు వివరించారు. మృతురాలి కుమారుడు మణిదీప్ కేకలు వేయడంతో మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చానని మృతురాలి మావయ్య సోమయ్య తెలిపాడు. మృతురాలు దుర్గ మెడపై చేతిగోళ్ల గాయాలున్నాయి. గొంతుకలో గుచ్చుకున్న గాయాల నుంచి రక్తం బయటకు వచ్చి ఆమె ధరించిన నైటీ తడిసిపోయి ఉంది. ముక్కు నుంచి రక్తం కారింది. నోటి నుంచి నురగా బయటకు వచ్చింది. ఆమె మెడపై ఉరి వేసుకున్న ఆన వాళ్లు మాత్రం లేవు. నరేష్, అతడి ప్రియురాలు మేరీలను సీతానగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్సై పవన్‌కుమార్ తెలిపారు.
Advertisement
Advertisement