ఇజ్రాయెల్‌ వార్‌పై పుతిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. అమెరికాకు వార్నింగ్‌! | Vladimir Putin Reacts Over Israel-Palestine Conflict | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ వార్‌ వేళ పుతిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. యూఎస్‌ను టార్గెట్‌ చేసి.. 

Published Wed, Oct 11 2023 11:22 AM | Last Updated on Wed, Oct 11 2023 12:32 PM

Vladimir Putin Reacts Israel And Palestine Violence - Sakshi

మాస్కో: ఇజ్రాయెల్‌లో భయంకర యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య బాంబు దాడుల నేపథ్యంలో వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌-పాలస్తీనా అంశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంచలన ఆరోపణలు చేశారు. తాజా పరిస్థితులు అ‍గ్రరాజ్యం అమెరికా పాలసీనే వైఫల్యమే కారణమని చెప్పుకొచ్చారు. 

అయితే, తాజాగా ఇజ్రాయల్‌-పాలస్తీనా అంశంపై పుతిన్ స్పందించారు. ఈ సందర్భంగా పుతిన్‌ మాట్లాడుతూ.. ‘స్వతంత్ర సార్వభౌమ’ పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయాల్సిన ‘అవసరం’ ఉందని పుతిన్ అన్నారు. ఇజ్రాయిల్-పాలస్తీనాల మధ్య హింస చెలరేగడానికి అమెరికా పాలసీ వైఫల్యం ‍స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా స్వతంత్ర పాలస్తీనా దేశ ఆవశ్యకతను విస్మరించిందన్నారు.

మధ్యప్రాచ్యంలో అమెరికా విధానాల వైఫల్యానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. చాలా మంది ప్రజలు నా అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి అంతర్జాతీయ ప్రయత్నాలకు ఆధిపత్యం వహించేందుకు అమెరికా యత్నిస్తోందని పుతిన్ ఆరోపించారు. ఇరువైపులా ఆమోదయోగ్యమైన రాజీ కుదుర్చడంలో వాషింగ్టన్ నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. 1967 యుద్ధంలో జెరూసలెంని ఇజ్రాయిల్ ఆక్రమించింది. రష్యా ఇరు దేశాలతో టచ్ లో ఉందని, వివాదాన్ని పరిష్కరించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని పుతిన్ చెప్పారు.

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌లో ఏడాదిన్నరకు పైగా రష్యా సేనలు దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో రష్యా.. ఉక్రెయిన్‌లో కొంత భాగాన్ని ఆక్రమించుకుంది. అయితే, ఒకవైపు ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తూనే మరొకవైపు పుతిన్‌.. పాలస్తీనాకు మద్దతుగా ప్రకటన చేయడం గమనార్హం. మరోవైపు.. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలో జోక్యం చేసుకోవద్దని, సిరియా, ఇరాన్‌లను యుద్ధంలోకి దూకవద్దని అమెరికా వార్నింగ్‌ ఇచ్చింది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా ఇప్పటికే భారీ యుద్ధ నౌకను అక్కడికి పంపిన విషయం తెలిసిందే. 

ఇది కూడా చదవండి: ఫలిస్తున్న ఇజ్రాయెల్‌ ప్లాన్‌.. హమాస్‌కు ఊహించని షాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement