మాస్కో: తెంపరితనం, దూకుడుకు మారుపేరైన డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే జో బైడెన్‌ను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశాభావం వ్యక్తంచేశారు. రష్యా అధికారిక టీవీ ఛానెల్‌కు బుధవారం ఇచి్చన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పుతిన్ పలు అంశాలపై మాట్లాడారు. ‘‘ రాబోయే అమెరికా ఎన్నికల్లో ఎవరు అధ్యక్షుడు అయినా వారితో రష్యా ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది.
రష్యా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే ట్రంప్ కంటే బైడెన్ గెలిస్తేనే మంచిదని అనుకుంటున్నా. ఎందుకంటే ఉపాధ్యక్షుడిగానూ, అధ్యక్షుడిగానూ పనిచేసిన బైడెన్‌కు అనుభవం ఎక్కువ. పాతకాలం విధానాలను అవలంభించే నేత ఆయన. ఆయనను కొంత అంచనావేయొచ్చు కూడా. ట్రంప్ ఆలోచనలు అనూహ్యం’ అని అన్నారు. బైడెన్ ఆరోగ్యం సరిగా లేదంటూ వస్తున్న వార్తలపై పుతిన్‌ను ప్రశ్నించగా.. ‘ నేనేమీ డాక్టర్‌నుకాదు. అయి నా ఇలాంటి ప్రశ్నకు వ్యాఖ్యలు చేయడం సబబు కాదు.
అయితే బైడెన్ ఆరోగ్య సమస్యలు వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం చూపగలవు. నేను గమనించినంత వరకు బైడెన్ ఆరోగ్యంగానే ఉన్నారు. అధ్యక్షుడిగా కొనసాగే సత్తా ఆయనకు లేదు అని నేనైతే అనుకోను. పేపర్ వైపు చూసే ప్రసంగం చదువుతారనేది వాస్తవం. నేను కూడా కొన్ని సార్లు ప్రసంగపాఠాన్ని చూసే చదువుతా. అదేమంత పెద్ద విషయం కాదు. ఏదేమైనా బైడెన్ ప్రభుత్వ విధానాలు చాలా తప్పు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తోనే చెప్పా’’ అని పుతిన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment