ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడి ఒక్క ఆ దేశాన్నే గాక ప్రపంచమంతటినీ నిర్ఘాంతపరిచింది. నెలల తరబడి పక్కాగా ప్రణాళిక వేసుకుని మరీ చేసిన ఈ దాడి వెనక, ఇదే సమయాన్ని ఎంచుకోవడం వెనక కారణాలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఒకరకంగా పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్ ప్రభుత్వ మితిమీరిన దూకుడు విధానాలు ఈ దాడిని సమరి్థంచునేందుకు హమాస్‌కు అవకాశం కూడా కలి్పంచినట్టు కన్పిస్తోంది.
ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న తెల్లవారుతూనే ఉరుముల్లేకుండానే పిడుగులు పడ్డాయి. జనం పిట్టల్లా రాలిపోయారు. రక్తం ఏరులై పారింది. బందీలుగా చిక్కిన వంద మందికి పైగా సైనికులు, పౌరులు నరకం చూస్తున్నారు. ఇంతటి ఉత్పాతానికి కారణమైన పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ దాడి గురించి ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. పశ్చిమాసియాలో మారుతున్న రాజకీయ బలాబలాలు, నానాటికీ పెరుగుతున్న ఇజ్రాయెల్ దూకుడు దాన్ని ఇందుకు పురిగొలి్పన కారణాల్లో ప్రధానమైనవని భావిస్తున్నారు.
అరబ్–ఇజ్రాయెల్ బంధం
అరబ్ దేశాలతో సాధారణ సంబంధాల స్థాపనకు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలు కాస్తో కూస్తో ఫలించేలా కని్పస్తుండటం హమాస్‌ను కలవరపరిచిన రెండో అంశం. కొంతకాలంగా పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్‌పై అరబ్ దేశాల ఒత్తిడి తగ్గుతూ వస్తుండటం మరింత ఆందోళనకు కారణమైంది. ఇదే సమయంలో అరబ్ దేశాల పెద్దన్నగా భావించే సౌదీ అరేబియా ఇజ్రాయెల్‌తో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకునే దిశగా అడుగులు వేస్తుండటంతో హమాస్ అప్రమత్తమైంది. ఇదిలాగే కొనసాగితే పాలస్తీనాకు పూర్తి స్వాతంత్య్రం ఇక కల్లోని మాటేనన్న అంచనాకు వచి్చంది.
ఇరాన్ దన్ను
ఇరాన్‌తో కొన్నేళ్ల కిందటి దాకా క్షీణ దశలో ఉన్న సంబంధాలను హమాస్ క్రమంగా పట్టాలకెక్కించుకుంటూ వచి్చంది. 2022లో హమాస్ ప్రతినిధుల బృందం సిరియాలో ఇరాన్ నేతలతో పలుమార్లు భేటీ అయింది. అనంతరం లెబనాన్, ఇరాన్‌లలో జరిగిన పలు సమావేశాల ద్వారా సంబంధాల పునరుద్ధరణ జోరందుకుంది. ఇవన్నీ ఇజ్రాయెల్‌పై భారీ ఆకస్మిక దాడికి కావాల్సిన హేతుబద్ధమైన కారణాలు, అవకాశాలతో పాటు సాయుధ, ఆర్థిక తదితర వనరులను కూడా హమాస్‌కు చేకూర్చాయి.
ఇప్పుడే ఎందుకు?
హమాస్‌ను తాజా దాడి వెనక ప్రధానంగా మూడు కారణాలు కని్పస్తున్నాయి. వాటిలో ప్రధానమైనది అతివాద ఇజ్రాయెల్ సర్కారు దూకుడు విధానాలు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్, జెరూసలేంల్లో యూదు సెటిలర్ల హింసను అది బాహాటంగా ప్రోత్సహించడం పాలస్తీనియన్ల ఆగ్రహానికి కారణమైంది. చివరికి ప్రతీకారేచ్ఛగా మారింది. సరిగ్గా అదే సమయంలో వెస్ట్‌బ్యాంక్‌లో పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా దక్షిణాది నుంచి సైన్యాన్ని ఇజ్రాయెల్ ఉత్తరానికి తరలించడం హమాస్‌కు కలిసొచి్చంది.
ఇప్పుడేం జరగనుంది?
ముస్లింలకు అతి పవిత్రమైన అల్ అక్సా మసీదు వద్ద యథాతథ స్థితిని ఇజ్రాయెల్ ఉల్లంఘించకుండా చూడాలన్న స్వల్పకాలిక లక్ష్యాన్ని ఈ దాడి ద్వారా హమాస్ సాధించినట్టే కని్పస్తోంది. కానీ దీర్ఘకాలంలో సాధించదలచిన ఇజ్రాయెల్ వినాశనం, ముస్లిం రాజ్య ఏర్పాటు లక్ష్యాలు నెరవేరడం దేవుడెరుగు, గాజా స్ట్రిప్‌ను నామరూపాల్లేకుండా చేయకుండా ఇజ్రాయెల్‌ను అడ్డుకోవడమే హమాస్‌కు తలకు మించిన భారం కాగలదంటున్నారు. ఇజ్రాయెలీ బందీలను అడ్డుపెట్టుకున్నంత కాలమే హమాస్ ఆటలు సాగేలా కని్పస్తున్నాయి.
అంతమెప్పుడు?
ఈ పోరుకు ముగింపు ఎప్పుడు, ఎలా జరగనుందన్నది ప్రస్తుతానికైతే అస్పష్టమే. దీనికి సమీప భవిష్యత్తులో ఏదో రకంగా తెర పడాలంటే బహుశా అంతర్జాతీయ సమాజపు జోక్యమే ఏకైక మార్గమని భావిస్తున్నారు. ఆ సందర్భంగా తన దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయెలీ సైనికులు, పౌరులకు బదులుగా ఖైదులో ఉన్న పాలస్తీనియన్లను విడిపించుకోవడం హమాస్ ఉద్దేశంగా కని్పస్తోంది.
ఆలోపు ఇజ్రాయెల్ భారీ ప్రతీకార దాడులకు దిగకుండా అడ్డుకునేందుకు కూడా బందీలు ఉపయోగపడతారని భావిస్తోంది. గాజాలో పౌర ఆవాసాలపై ఇజ్రాయెల్ భూతల దాడులకు దిగిన మరుక్షణం బందీలను హతమార్చడం మొదలు పెడతామని హమాస్ అధికార ప్రతినిధి అబూ ఉబైదా ఇప్పటికే హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో గాజాలోకి చొచ్చుకెళ్లి దాడులకు దిగడంపై ఇజ్రాయెల్ ఇప్పటికైతే ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. మరోవైపు ఈ దాడి ద్వారా గాజా, వెస్ట్‌బ్యాంక్ ప్రాంతాల్లో తనకు పెరిగిన ప్రతిష్ట రాజకీయంగా మరింతగా బలపడేందకు పనికొస్తుందని కూడా హమాస్ ఆశిస్తోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment