Indian Super Women In Israel: ఇజ్రాయెల్ పౌరులపై పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ దాడి చేసి (అక్టోబర్ 7) 11 రోజులు గడిచాయి. ఇంకా భయానక పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రతీ రోజు పలు కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కేరళ మహిళల సూపర్ విమెన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం మంగళవారం (అక్టోబర్ 17) సోషల్ మీడియాలో వీరికి సంబంధంచి ఒక వీడియోను ఎక్స్( ట్విటర్) లో పోస్ట్ చేసింది. హమాస్ దాడిలో మహిళలు తమ ప్రాణాలను మాత్రమే కాకుండా ఇజ్రాయెల్ పౌరుల ప్రాణాలను కూడా కాపాడారు దీనికి సంబంధించి వీడియోను షేర్ చేసింది
ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న కేరళకు చెందిన ఇద్దరు మహిళలు అక్కడ కేర్ టేకర్స్‌గా పనిచేస్తున్నారు. హమాస్ ఉగ్రదాడిలో చాలా ధైర్యసాహసాలను ప్రదర్శించి వృద్ధురాలిని ప్రాణాలను కాపాడిన వైనం విశేషంగా నిలుస్తోంది. ఈ మహిళల ప్రయత్నాలను, సంకల్పాన్ని అభినందిస్తూ ఇజ్రాయెల్ ఎంబసీ "ఇండియన్ సూపర్ వుమెన్" అంటూ ొక వీడియోను పోస్ట్ చేసింది. డోర్ హ్యాండిల్‌ను పట్టుకుని హమాస్ టెర్రరిస్ట్‌లు లోనికి రాకుండా అడ్డుకున్న భయానక స్థితిని ఈ వీడియోలో ఒకరు వివరించారు. బుల్లెట్ గుర్తులతో ఉన్న తలుపులు, గోడలు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ సాహస వనితల పేర్లు సబిత,మీరా మోహనన్
కాల్పుల మోత మోగినా నుంచి వెనక్కి తగ్గలే..!
ఏఎల్‌ఎస్‌తో బాధ పడుతున్న రాచెల్ అనే వృద్ధురాలికి కేర్ టేకర్స్‌గా మీరాతో పాటు గత మూడేళ్లుగా పనిచేస్తున్నామనీ సబిత చెప్పారు. నైట్ డ్యూటీలో ఉండగా ఉదయం 6.30 గంటల ప్రాంతంలో సైరన్ మోతలు వినిపించాయి. బయలు దేరబోతుండగానే పరిస్థితి మరింత ముదిరిందని ఆమె పేర్కొన్నారు. అసలు ఏమి చేయాలో తోచలేదు. ఇంతలో రాచెల్ కుమార్తె ఫోన్ చేసి తలుపులన్నీ లాక్ చేసుకోమని ఆమె చెప్పారు. నేలపై మరింత పట్టు సాధించడానికి చెప్పులు కూడా తీసేసి అలా భయంతో ఉన్నాం.
మరి కొద్ది నిమిషాల్లో, ఉగ్రవాదులు ఇంట్లోకి చొరబడి కాల్పులు మొదలు పెట్టారు. అద్దాలు పగలగొట్టేశారు. మళ్ళీ కూతురికి ఫోన్ చేసి ఏం చేద్దాం అని అడిగాం. డోర్ పట్టుకుని అలాగే ఉండమని చెప్పడంతో అలాగే నాలుగైదు గంటలు అక్కడే వారిని అడ్డుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించామంటూ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అసలు బయట ఏమి జరుగుతుందో అర్థం కావడంలేదు. మధ్యాహ్నం 1 గంటకు, వారికి మళ్లీ షాట్‌లు వినిపించాయి. అయితే ఈ సారి ఇజ్రాయెల్ సైన్యం వచ్చిందని ఇంటి యజమాని ష్ములిక్ చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నామని సబిత వెల్లడించారు. క్షిపణులు పడతాయని తెలుసు కానీ ఉగ్రదాడి జరుగుతుదని అస్సలు ఊహించలేదన్నారు. మీరా పాస్‌పోర్ట్, ఎమర్జెన్సీ బ్యాగ్ అన్నీ వాళ్లు పట్టుకు పోయారని, ఇపుడు తమ వద్ద ఏమీ లేవని చెప్పారు.
ఇదిలావుండగా, గాజాలోని ఒక ఆసుపత్రిలో మంగళవారం జరిగిన పేలుడులో కనీసం 500 మంది మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ ప్రకటిచింది.
भारतीय वीरांगनाएं ! 🇮🇳🇮🇱
— Israel in India (@IsraelinIndia) October 17, 2023
मूलतः केरला की रहने वाली सबिता जी, जो अभी इजराइल में सेवारत हैं, बता रही हैं कि कैसे इन्होने और मीरा मोहन जी ने मिलकर इसरायली नागरिकों कि जान बचाई। हमास आतंकवादी हमले के दौरान इन वीरांगनाओं ने सेफ हाउस के दरवाजे को खुलने ही नहीं दिया क्योंकि आतंकवादी… pic.twitter.com/3vu9ba4q0d
Comments
Please login to add a commentAdd a comment