super women
-
భీకర పోరు: సాహో ఇండియన్ సూపర్ విమెన్, వైరల్ వీడియో
Indian Super Women In Israel: ఇజ్రాయెల్ పౌరులపై పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ దాడి చేసి (అక్టోబర్ 7) 11 రోజులు గడిచాయి. ఇంకా భయానక పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రతీ రోజు పలు కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కేరళ మహిళల సూపర్ విమెన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం మంగళవారం (అక్టోబర్ 17) సోషల్ మీడియాలో వీరికి సంబంధంచి ఒక వీడియోను ఎక్స్( ట్విటర్) లో పోస్ట్ చేసింది. హమాస్ దాడిలో మహిళలు తమ ప్రాణాలను మాత్రమే కాకుండా ఇజ్రాయెల్ పౌరుల ప్రాణాలను కూడా కాపాడారు దీనికి సంబంధించి వీడియోను షేర్ చేసింది ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న కేరళకు చెందిన ఇద్దరు మహిళలు అక్కడ కేర్ టేకర్స్‌గా పనిచేస్తున్నారు. హమాస్ ఉగ్రదాడిలో చాలా ధైర్యసాహసాలను ప్రదర్శించి వృద్ధురాలిని ప్రాణాలను కాపాడిన వైనం విశేషంగా నిలుస్తోంది. ఈ మహిళల ప్రయత్నాలను, సంకల్పాన్ని అభినందిస్తూ ఇజ్రాయెల్ ఎంబసీ "ఇండియన్ సూపర్ వుమెన్" అంటూ ొక వీడియోను పోస్ట్ చేసింది. డోర్ హ్యాండిల్‌ను పట్టుకుని హమాస్ టెర్రరిస్ట్‌లు లోనికి రాకుండా అడ్డుకున్న భయానక స్థితిని ఈ వీడియోలో ఒకరు వివరించారు. బుల్లెట్ గుర్తులతో ఉన్న తలుపులు, గోడలు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ సాహస వనితల పేర్లు సబిత,మీరా మోహనన్ కాల్పుల మోత మోగినా నుంచి వెనక్కి తగ్గలే..! ఏఎల్‌ఎస్‌తో బాధ పడుతున్న రాచెల్ అనే వృద్ధురాలికి కేర్ టేకర్స్‌గా మీరాతో పాటు గత మూడేళ్లుగా పనిచేస్తున్నామనీ సబిత చెప్పారు. నైట్ డ్యూటీలో ఉండగా ఉదయం 6.30 గంటల ప్రాంతంలో సైరన్ మోతలు వినిపించాయి. బయలు దేరబోతుండగానే పరిస్థితి మరింత ముదిరిందని ఆమె పేర్కొన్నారు. అసలు ఏమి చేయాలో తోచలేదు. ఇంతలో రాచెల్ కుమార్తె ఫోన్ చేసి తలుపులన్నీ లాక్ చేసుకోమని ఆమె చెప్పారు. నేలపై మరింత పట్టు సాధించడానికి చెప్పులు కూడా తీసేసి అలా భయంతో ఉన్నాం. మరి కొద్ది నిమిషాల్లో, ఉగ్రవాదులు ఇంట్లోకి చొరబడి కాల్పులు మొదలు పెట్టారు. అద్దాలు పగలగొట్టేశారు. మళ్ళీ కూతురికి ఫోన్ చేసి ఏం చేద్దాం అని అడిగాం. డోర్ పట్టుకుని అలాగే ఉండమని చెప్పడంతో అలాగే నాలుగైదు గంటలు అక్కడే వారిని అడ్డుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించామంటూ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అసలు బయట ఏమి జరుగుతుందో అర్థం కావడంలేదు. మధ్యాహ్నం 1 గంటకు, వారికి మళ్లీ షాట్లు వినిపించాయి. అయితే ఈ సారి ఇజ్రాయెల్ సైన్యం వచ్చిందని ఇంటి యజమాని ష్ములిక్ చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నామని సబిత వెల్లడించారు. క్షిపణులు పడతాయని తెలుసు కానీ ఉగ్రదాడి జరుగుతుదని అస్సలు ఊహించలేదన్నారు. మీరా పాస్‌పోర్ట్, ఎమర్జెన్సీ బ్యాగ్ అన్నీ వాళ్లు పట్టుకు పోయారని, ఇపుడు తమ వద్ద ఏమీ లేవని చెప్పారు. ఇదిలావుండగా, గాజాలోని ఒక ఆసుపత్రిలో మంగళవారం జరిగిన పేలుడులో కనీసం 500 మంది మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ ప్రకటిచింది. भारतीय वीरांगनाएं ! 🇮🇳🇮🇱 मूलतः केरला की रहने वाली सबिता जी, जो अभी इजराइल में सेवारत हैं, बता रही हैं कि कैसे इन्होने और मीरा मोहन जी ने मिलकर इसरायली नागरिकों कि जान बचाई। हमास आतंकवादी हमले के दौरान इन वीरांगनाओं ने सेफ हाउस के दरवाजे को खुलने ही नहीं दिया क्योंकि आतंकवादी… pic.twitter.com/3vu9ba4q0d — Israel in India (@IsraelinIndia) October 17, 2023 -
కొత్తలైఫ్కు దారి చూపే లైఫ్ కోచ్
1950–లండన్: ‘ది ఫాదర్ ఆఫ్ ఆర్ట్ థెరపీ–బ్రిటన్’గా ప్రసిద్ధి చెందిన ఎడ్వార్డ్ ఆడమ్సన్ లండన్‌లోని ఒక ఎడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసేవాడు. ఆ తరువాత ఈ ఉద్యోగం మానేసి తీరిగ్గా డ్రాయింగ్స్, పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్డాడు. ఈ క్రమంలోనే అతడికి ‘ఆర్ట్ థెరపీ’ మీద ఆసక్తి పెరిగింది. దీన్ని పరిశోధించడానికి కాలికి కుంచె కట్టుకొని ఎన్నో ప్రాంతాలు తిరిగాడు. ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జాన్సన్ తన పరిసరాల్లోనే పెయింటింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. ఈ పని అతను చురుగ్గా ఉండడానికి కారణం అయింది. దీంతో ఆ ఆస్పత్రిలో ఉన్న చాలామంది ఇతడిని అనుసరించేవారు. నిజానికి వారికి ‘ఆర్ట్’లో ఓనమాలు కూడా తెలియవు. తమకు తోచిన రీతిలో సాధన చేసి అద్భుతమైన ఫలితాన్ని పొందేవారు. ఇలాంటివి ప్రత్యక్షంగా చూసిన తరువాత...లండన్‌లో ఓపెన్ ఆర్ట్ స్టూడియో మొదలుపెట్టి ‘ఆర్ట్ థెరపీ’ ఊపు అందుకోవడానికి కారణం అయ్యాడు ఆడమ్సన్. ‘ఆర్ట్ యాజ్ హీలింగ్’ ‘ఆర్ట్ ఫర్ మెంటల్ హెల్త్’‘ఆర్ట్ అండ్ మెంటల్హెల్త్’ ‘డార్క్నెస్ ఇన్టు లైట్’... మొదలైన పుస్తకాలు రాశాడు. డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్ ఎడ్వార్డ్ ఆడమ్సన్ రచనలు ఎన్నో చదివి ‘ఆర్ట్ థెరపీ’పై ఆసక్తి పెంచుకుంది. వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల్లో ఈ కళను ఒక బలమైన ఆయుధంగా చేసుకొని ‘లైఫ్ కోచ్’గా రాణిస్తుంది ప్రబిక ప్రదాన్. ఎంబీఏ చేసిన ప్రబికకు సమాజధోరణులను, వ్యక్తులను సూక్ష్మంగా పరిశీలించడం అంటే ఇష్టం. తనకు ఒక సంఘటన ఎప్పటికీ గుర్తుంటుంది... పెద్ద ఉద్యోగం చేసే ఒకాయన, ఏదో ఫంక్షన్ కోసం అత్తారింటికి వెళ్లాడట. అక్కడ సరైన మర్యాద లభించలేదట. అంతే, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు! అసలు ఒకప్పుడు ఎంతెంత ధైర్యంతో ఉండేవాళ్లు..? కొండంత సమస్య ఎదురొచ్చినా భయపడేవారు కాదు. ఇప్పుడు ఆ ధైర్యం ఎటు పోయింది? చిన్న చిన్న సమస్యలకే కుమిలిపోయే ధోరణి అంతకంతకూ పెరిగిపోతుంది. ఇలాంటి క్లిష్టసమయంలోనే ‘లైఫ్ కోచ్’గా తన బాధ్యతలను దేశ విదేశాల్లో నిర్వహిస్తుంది ప్రబిక. ‘అమ్మో... ఈ చదువు నేను చదవలేను. చనిపోవాలనిపిస్తుంది’ అనుకునే విద్యార్థిని చదువుపై ఆసక్తి పెరిగేలా చేసి దూసుకుపోయేలా చేసింది. ‘వ్యాపారంలో ఘోరమైన నష్టాలు వచ్చాయి. నుయ్యే గొయ్యే అన్నట్లుగా ఉంది నా పరిస్థితి’ అని ఆవేదన చెందిన వ్యాపారికి ధైర్యం అనే టానిక్ ఇచ్చి కొత్త కొత్త వ్యాపారాల్లో రాణించేలా చేసింది ప్రబిక. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ‘నాకేం, అంతా సవ్యంగా ఉంది అనుకుంటాం మనం. కాని మన మనసు మూలాల్లో ఎక్కడో ఒకచోట పరాజయం, అవమానం, సంక్షోభం... మొదలైన అవశేషాలు ఎన్నో ఇరుక్కుపోయి ఉంటాయి. మనం ఎంత తేలిగ్గా ఉంటే యుద్ధంలో అంతే తేలికగా విజయం సాధించగలం. మనసులో ఎంత భారం ఉంటే విజయం అంత కష్టం. ఇలాంటి సమయాల్లోనే ఆర్ట్ థెరపీ అనేది ఉపయోగపడుతుంది. మనసులోని భారాన్ని తొలిగిస్తుంది’ అంటున్న ప్రబిక స్టార్ ఇండియా ‘ది రియల్ సూపర్ ఉమన్’ అవార్డ్ అందుకుంది. ఆమెకు అభినందనలు. రంగుల మంత్రం: ప్రబిక్ -
మీరే మాకు గర్వ కారణం!... ఆ సమయంలో కూడా సేవలందించారు!!
Hardeep Singh Puri Praises Working On Oil Rigs: దేశంలోని చమురు, గ్యాస్ ఇన్స్టాలేషన్లలో పనిచేసే మహిళల సహకారాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్లో ఆరెంజ్ కలర్ యూనిఫామ్ ధరించి పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ కరోనా మహమ్మారి సమయంలో కూడా ఈ మహిళలు సుమారు 60 నుండి 70 రోజుల పాటు డ్రిల్లింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై ఉండి సేవలందించారని పూరి చెప్పారు. (చదవండి: మృత్యుంజయురాలు! ...ఐదు రోజులుగా గడ్డకట్టే మంచులో కారులోనే ...) అంతేకాదు వారి తమ కార్పోరేషన్లో కఠినమైన నిబద్ధత, దృఢత్వంతో పనిచేసే సూపర్ ఉమెన్ మాత్రమే కాదు దేశ ప్రగతిలో "సమాన భాగస్వామ్యులు"గా అభివర్ణించారు. పైగా మీరే మాకు గర్వకారణం అంటూ ప్రశంసించారు. ఈ మేరకు నెట్టింట్లో ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు కూడా మహిళలను ప్రోత్సహించే నిమిత్తం మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించారు. అంతేకాదు లడఖ్‌లోని ఫే గ్రామంలో 11,800 అడుగుల ఎత్తైన ఎల్పిజి బాట్లింగ్ ప్లాంట్‌ను ఇండియన్ ఆయిల్‌కు చెందిన మహిళా ఉద్యోగుల బృందమే నిర్వహించారన్న సంగతి తెలిసిందే. (చదవండి: పోలీస్ కమిషనర్ పేరుతో పోలీసులనే బురిడి కొట్టించాడు!!) View this post on Instagram A post shared by Hardeep Singh Puri (@hardeepspuri) -
'నాకు సూపర్ ఉమెన్ కావాలని ఉంది'
ముంబై: తనకు సూపర్ ఉమెన్ కావాలని ఉందని ప్రముఖ శృంగార తార సన్నీలియోన్ అంది. ఏదో ఒకరోజు సూపర్ హీరో అనే చిత్రంలో భాగస్వామిని కావాలని అనుకుంటున్నాని, అదే తనకున్న అసలైన కోరిక అని చెప్పింది. బాలీవుడ్లో అడుగుపెట్టి సంచలన తారగా మారిన ఈ అమ్మడు ఈ మధ్య పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. యువత చెడిపోయేలా, గృహిణులకు ఇబ్బందికలిగేలా హాఫ్ న్యూడ్ చిత్రాలతో అసభ్యకరంగా కనిపిస్తోందని పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. అప్పటి నుంచి కొంత ఖాళీగా ఉన్నట్లు కనిపించిన ఆమెను ఓ మీడియా సంప్రదించింది. సన్నీ మీకు మీ జీవితంలో చేయాలనిపిస్తున్న పాత్ర ఏమిటి ? అని ప్రశ్నించగా వెంటనే తాను సూపర్ మెన్ చిత్రంలో సూపర్ ఉమెన్‌గా నటించాలని ఉందని, సమాన స్థాయి పాత్ర పోషించాలని అనుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె స్ప్లిట్ విల్లా అనే రియాలిటీ షో చేస్తోంది.