ఇజ్రాయెల్- గాజా యుద్ధంలో హమాస్ మిలిటెంట్ల అమానవీయ చేష్టలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. గాజా సరిహద్దుల్లోని మ్యూజిక్ ఫెస్టివల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడి మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. కిబ్బుజ్ రీమ్ వద్ద శనివారం జరిగిన సూపర్ నోవా పార్టీకి హాజరైన ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ మిలిటెంట్లు భీకర కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో 250 మంది అమాయక ప్రజలు మరణించారు.
ముష్కరులకు భయపడి చెట్లు, పొదల చాటున దాక్కున్న వారినీ వెతికి మరీ మిలిటెంట్లు కాల్చి చంపారు. ఉగ్రవాదుల నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకు ఓ 27 ఏళ్ల ఇజ్రాయెల్ మహిళ చనిపోయినట్లు నటించినా.. ఆమె శ్వాసను గుర్తించి బతికే ఉందని గ్రహించి ప్రాణం తీశారు. ఈ ఘటనలో తన సోదరి అత్యంత దారుణంగా మరణించినట్లు ఇజ్రాయెల్ టెలివిజన్ హోస్ట్‌గా చేస్తున్న మాయన్ అడమ్ తెలిపింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ హృదయవిదాకర పోస్టు షేర్ చేసింది. ఇందులో తన సోదరి మరణించిన విధానాన్ని తన ఫాలోవర్లకు వివరించింది.
The aftermath of Hamas attack on the music festival in Israel.
At least 200 people were killed, and the number is likely to grow.
This reminds me so much of Bucha. The murders of innocent civilians. The destruction. The fear. Pure terrorism. pic.twitter.com/qhxeKFGbUC
— Anton Gerashchenko (@Gerashchenko_en) October 9, 2023
మాయన్ ఆడమ్ సోదరి మపల్ ఆడమ్ ఆమె ప్రియుడు రోయ్‌తో కలిసి మ్యూజిక్ ఫెస్టివల్‌కు వెళ్లిందని కాసేపటికకే అక్కడికి వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో భయంతో వీరిద్దరూ ఓ ట్రక్కు కింద దాక్కున్నట్లు తెలిపింది. ముష్కరుల నుంచి తప్పించుకోవడానికి చనిపోయినట్లు నటించినట్లు వెల్లడించింది. అయినా ఉగ్రవాదులు గుర్తించి, దగ్గరకొచ్చి శ్వాస ఉన్నట్లు తెలిసి కాల్చి చంపినట్లు తెలిపింది. ఈ ఘటనలో మాపల్ ఆడమ్ ప్రాణాలు కోల్పోగా.. ఆమె బాయ్‌ఫ్రెండ్ రోయ్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం కోలుకుంటున్నట్లు పేర్కొంది.
అంతేగాక చనిపోయే ముందు ట్రక్కు కింద దాక్కొని ఉండగా ఓ ఫోటో కూడా తీసింది సోదరికి పంపించింది.ఆ ఫొటోను మాయన్ ఆడమ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ..‘మాపల్ చనిపోయే ముందు తన ఫోన్‌లో తీసిన చివరి ఫొటో ఇది. ప్రాణాలు కాపాడుకోవడం కోసం కొన్ని గంటల పాటు వారు కదలకుండా చనిపోయినట్లు నటించారు. కానీ ఉగ్రవాదులు ఆమెను అతి దారుణంగా చంపేశారు. ప్రియుడి చేతిలోనే ఆమె ప్రాణాలు విడిచింది. ఆమె బాయ్‌ఫ్రెండ్ తుపాకీ గాయాలతో పక్కన పడిపోయాడు. మా కుటుంబం ముక్కులుగా నలిగిపోయింది. ’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మపల్ గతంలో సైన్యంలో పనిచేశారు.
ఇదిలా ఉండగా సౌత్ ఇజ్రాయెల్‌లోని మారుమూల ప్రాంతంలోశనివారం సూపర్‌నోవా పార్టీ జరిగింది. వేలాది మంది యువతి, యువకులు ఈ పార్టీలో డాన్స్ చేస్తూ ఉత్సాహంగా గడుతుండగా.. ఇజ్రాయెల్ పైరులపై హమాస్ మిలిటెంట్లు దాడులకు పాల్పడ్డారు. ఆకాశంలో నుంచి పారాచూట్లతో దిగి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఉన్నట్టుండి కాల్పుల శబ్ధాలు వినిపించడంతో చాలా మంది తమ ప్రాణాలను కాపాడటం కోసం పార్కింగ్ వైపు పరుగుతీశారు. అయినప్పటికీ హమాస్ ఉగ్రవాదులు ఫెస్టివల్‌కు హాజరైన దాదాపు 250 మందిని కాల్చి చంపేశారు.
Comments
Please login to add a commentAdd a comment