
వాషింగ్టన్: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య భీకర యుద్ధం కారణంగా వేల సంఖ్యలో పౌరులు, మిలిటెంట్ల మృత్యువాతపడ్డారు. ఇక, హమాస్ దాడులను ఇజ్రాయెల్ గట్టిగా తిప్పికొట్టింది. ఇజ్రాయెల్ ప్రతిదాడితో గాజా వణికిపోతోంది. ఇప్పటికే పలువురు గాజాను ఇజ్రాయెల్ దళాలు చుట్టుముట్టాయి. హమాస్ మిలిటెంట్లను కూడా ఇజ్రాయెల్ బంధించింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇక, తాజాగా ఓ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ బలగాలు సుదీర్ఘకాలం గాజాలో ఉండటం పెద్ద పొరబాటుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. యుద్ధాల్లో పాటించాల్సిన నిబంధనలను ఇజ్రాయెల్ అమలు చేస్తుందని తాము నమ్ముతున్నట్లు చెప్పారు. అమాయక పౌరులకు నీరు, ఆహారం, ఔషధాలు అందేట్లు చూడాలని సూచించారు. గాజాను ఇజ్రాయెల్ తన ఆధీనంలో ఎక్కవ కాలం ఉంచుకొంటుందని తాను భావించడంలేదన్నారు. అంతకంటే పాలస్తీనీయుల ఆధ్వర్యంలోనే అక్కడి పాలన నిర్వహించాలన్నారు. ఒక వేళ సుదర్ఘీకాలం గాజాలోనే ఇజ్రాయెల్ దళాలు ఉంటే అది పెద్ద పొరబాటుగా మారుతుందన్నారు. ప్రస్తుతం గాజా పరిస్థితి చూడండి.. హమాస్ శక్తులు మొత్తం పాలస్తీనా ప్రజలకు ప్రాతినిధ్యం వహించవు అని తెలిపారు.
US President Joe Biden said that Israel taking control of the Gaza Strip would be 'a big mistake', but Tel Aviv 'must respond' and 'go after Hamas' after the movement launched attacks aimed at entered Israel last weekend. #Israel, #PalestineGenocide, #HamasisISIS, #USA, #Gaza pic.twitter.com/bY0veoQRih
— SamTin❤️🍀 (@Dng21509147) October 16, 2023
ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌లో జో బైడెన్ పర్యటిస్తారన్న వార్తలపై వైట్ హౌస్ స్పందించింది. ఈ సందర్బంగా వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి మాట్లాడుతూ ఇప్పటి వరకు అటువంటి ప్రతిపాదన ఏమీ లేదని స్పష్టం చేశారు. ఆ దిశగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఆదివారం కూడా జోబైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో ఫోన్‌లో మాట్లాడారు. హమాస్ దాడుల తర్వాత ఆయన ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడటం ఇది ఐదోసారి.
Comments
Please login to add a commentAdd a comment