ఇజ్రాయెల్-హమాస్ భీకర యుధ్దం తీవ్ర విషాదాన్నిమిగులుస్తోంది. హృదయాల్నిమెలిపెట్టే ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ సైన్యంలోని 77వ బెటాలియన్‌లో సైనికురాలిగా పనిచేస్తున్న 19 ఏళ్ల కార్పొరల్ నామా బోని మరణం తీవ్రంగా కలిచివేస్తోంది.
ఇజ్రాయెలీ వార్తా సంస్థ Ynet ప్రకారం చావు బతుకులమధ్య అత్యంత దయనీయ పరిస్తితుల్లో కుటుంబ సభ్యులకు పంపిన సందేశం వైరల్ అవుతోంది. హమాస్ సాయుధుడి దాడిలో బోని తలకు తీవ్ర గాయమైంది. అయినా ఎలాగోలా తప్పించుకుంది. ఓ తాత్కాలిక షెల్టర్‌లో తలదాచుకుని అక్కడినుంచి కుటుంబ సభ్యులకు మెసేజ్ చేసింది.
‘‘నా మీద కాల్పులు జరిగాయి. మీ గురించి చాలా బాధపడుతున్నాను. నా తలకు తీవ్ర గాయమైంది’’ అంటూ మెసేజ్ చేసింది. కాసేపటి తరువాత మరో అప్‌డేట్‌ను కూడా ఇచ్చింది. తనకు సమీపంలోనే ఉగ్రవాది ఉన్నాడనీ, ఏ క్షణాన్నైనా తనను కాల్చేయొచ్చనే అందోళన వ్యక్తం చేసింది. ఎవరో అరుస్తున్నట్లు వినిపిస్తోంది, మానవ ప్రాణనష్టం జరిగినట్లు కనిపిస్తోందంటూ అక్కడి పరిస్థితిని వివరించింది.
అలాగే ప్రస్తుతం తాను గోలానీ బ్రిగేడ్‌కు చెందిన గాయపడిన సైనికుడితో ఉన్నాననీ. ఇక్కడ తమకు ఎలాంటి బలగాలు అందుబాటులో లేవని కూడా ఆ మెసేజ్‌లో ఆమె పేర్కొంది. ఆ తరువాత తీవ్రంగా గాయపడిన బ్రెజిలై మెడికల్ సెంటర్‌లో ఆసుపత్రిలో చేరిన ఆమె ఇక లేదని అధికారుల వివరాల బట్టి తెలుస్తోంది. అఫులాలో పుట్టి పెరిగింది బోని. ఏడు నెలల క్రితమే అక్కడి సైన్యంలో చేరింది. ఒక వారం క్రితం ఆమె పుట్టిన రోజును జరుపుకున్న బోనీ తిరిగి రావాలని కోరుకున్న కుటుంబ సభ్యులకు చివరకు విషాదమే మిగిలింది.
కాగా హమాస్ రాకెట్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఐదు రోజుల క్రితం వైమానిక దాడులు ప్రారంభించినప్పటి నుండి 2.3 మిలియన్ల జనాభాఉన్న గాజా స్ట్రిప్‌లోని పౌరులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. గురువారం ఉదయం నాటికి 1,000 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. వీరిలో ఎంత మంది పౌరులు ఉన్నారో స్పష్టత లేదు. ప్రస్తుత యుద్ధ వాతావరణంలోగాజా నగరంలో ఆహార కొరత నెలకొంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గాజాలోని అల్-షిఫా ఆసుపత్రికి వచ్చే రోగులతో నిండిపోయింది. ఒకవైపు ఆక్సిజన్‌తో సహా ఇతర అత్యవసర మందుల నిల్వలు క్షీణిస్తున్నాయి. మరోవైపు విద్యుత్ అంతరాయంతో రోగులను కాపాడేందుకు సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment