
తమ దేశ భూభాగంలోకి చొరబడి..హమాస్ ఉగ్రవాదులు పారించిన రక్తపుటేరులపై ఇజ్రాయెల్ రగిలిపోతోంది. హమాస్ ఉగ్రదాడికి ప్రతిగా గాజాలోని ముష్కరుల స్థావరాలను నేలమట్టం చేస్తోంది. వారిని ఏరిపారేస్తుంది. ఈ తరుణంలో ఇజ్రాయెల్ - పాలస్తీనా ఉద్రికత్తలు రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? విశ్లేషకులు ఏమంటున్నారు.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి వల్ల భవిష్యత్‌లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అనలిస్ట్‌లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల్లోని ఉద్రిక్తతలతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంలోని పెట్టుబడుల్ని పెంచారు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఒక శాతానికి పైగా పెరిగాయి.
మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధరలు ఔన్స్ (28.35 గ్రాము)కు 1.2 శాతం పెరిగి 1,853.79 డాలర్లకు చేరుకున్నాయి. అదే సమయంలో యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.2 శాతం పెరిగి 1,867.80 డాలర్లకు చేరుకుంది.
రానున్న రోజుల్లో
బంగారం 1,880 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని, అయితే 1,900 డాలర్లు అధిగమించి బాండ్ ఈల్డ్స్ (బాండ్స్) వచ్చే ఆదాయం గణనీయంగా మరింత గణనీయంగా పడిపోవడంపై ఆధారపడి ఉంటుందని సిటీ ఇండెక్స్ సీనియర్ అనలిస్ట్ మాట్ సింప్సన్ రాయిటర్స్‌తో అన్నారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో మదుపర్లు బంగారంపై పెట్టుబడులు సురక్షితమని భావిస్తున్నారు. కాబట్టే బంగారం ధరలు పెరుగుతున్నాయని యూకేకి చెందిన ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం సిటీ ఇండెక్స్ సీనియర్ అనలిస్ట్ మాట్ సింప్సన్ రాయిటర్స్‌తో అన్నారు.
అనిశ్చితి సమయాల్లోనూ బంగారమే
ఇజ్రాయెల్ - పాలస్తీనా ఉద్రికత్తలు ప్రపంచ దేశాల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అందుకు కారణం చమురు ధరలు పెరుగుదలకు కారణమైంది. పైగా యుఎస్ ట్రెజరీస్, యుఎస్ డాలర్, జపనీస్ యెన్, బంగారం వంటి సురక్షిత పెట్టుబడులకు డిమాండ్‌ను పెంచింది. దీంతో ఏడు నెలలుగా తక్కువగా ఉన్న పసిడి ధర గత శుక్రవారం ఏడు నెలల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. అనిశ్చితి సమయాల్లో బంగారం పెట్టుబడులపై ఆవశ్యకతను గుర్తు చేస్తుంది. ఏదేమైనా, అమెరికాలో ఉద్యోగాల నియామకాల్ని పరిమితం చేసింది. ఇది సమీప భవిష్యత్తులో ఫెడరల్ రిజర్వ్ తన ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసే అవకాశం ఉండదని తెలుస్తోంది.