Vizag ODI
-
బీస్ట్ ఈజ్ బ్యాక్.. పేస్‌తో గడగడలాడించి టీమిండియాకు చుక్కలు చూపించిన స్టార్క్
గత కొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఆస్ట్రేలియా పేసు గుర్రం మిచెల్ స్టార్క్ ఎట్టకేలకు ఫామ్‌లో వచ్చాడు. వన్డే వరల్డ్‌కప్-2023 జరుగనున్న భారత గడ్డపై స్టార్క్ మునుపటి తరహాలో రెచ్చిపోతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో ఏమంత ప్రభావం చూపించని స్టార్క్.. టీమిండియాతో వన్డే సిరీస్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో 49 పరుగులిచ్చి ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌లను ఔట్ చేసిన స్టార్క్.. విశాఖ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో 8 ఓవర్లు వేసి 53 పరుగులు ఇచ్చిన స్టార్క్.. ఏకంగా 5 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాశించాడు. స్టార్క్ స్పెల్‌లో ఓ మొయిడిన్ కూడా ఉంది. ఈ మ్యాచ్‌లో ఫైఫర్ సాధించడంతో స్టార్క్ ఓ అరుదైన రికార్డు కూడా సాధించాడు. వన్డేల్లో అత్యధిక ఫైఫర్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో లసిత్ మలింగ (8)ను వెనక్కునెట్టి, బ్రెట్ లీ (9), షాహిద్ అఫ్రిది (9) సరసన చేరాడు. కెరీర్లో 109 వన్డేలు ఆడిన స్టార్క్ 9 ఫైఫర్‌ల సాయంతో 219 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో అత్యధిక ఫైఫర్‌ల రికార్డు వకార్ యూనిస్ (13) పేరిట ఉంది. వకార్ తర్వాతి స్థానాల్లో ముత్తయ్య మురళీథరన్ (10), స్టార్క్ (9) ఉన్నారు. ఇదిలా ఉంటే, రెండో వన్డేలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. మిచెల్ స్టార్క్ (5/53), సీన్ అబాట్ (3/23), నాథన్ ఇల్లీస్ (2/13) నిప్పులు చెరగడంతో భారత్‌ను 117 పరుగులకే ఆలౌట్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
Viral Video: శతాబ్దపు అత్యుత్తమ క్యాచ్ అందుకున్న స్టీవ్ స్మిత్
విశాఖ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ నమ్మశక్యంకాని క్యాచ్‌ను అందుకున్నాడు. పక్షిలా గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో అందుకున్న ఈ డైవిండ్ క్యాచ్‌ను క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు క్యాచ్ ఆఫ్ ద సెంచరీగా అభివర్ణిస్తున్నారు. భారత ఇన్నింగ్స్ 9.2వ ఓవర్లో సీన్ అబాట్ బౌలింగ్ చేస్తుండగా ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ సెన్సేషనల్ క్యాచ్ పట్టడంతో హార్ధిక్ పాండ్యా (1) పెవిలియన్ బాటపట్టాడు. వాస్తవానికి ఈ క్యాచ్ సెకెండ్ స్లిప్ ఫీల్డర్ అందుకోవడం కూడా కష్టమే. Hardik Pandya dismissed for 1. what a catch by Smith#HardikPandya #INDvsAUS #ViratKohli #SuryakumarYadav India 49/5 now. pic.twitter.com/idE6IjpaSR — Rajkumar (@Rajkumar0507) March 19, 2023 అలాంటిది స్మిత్ సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగురుతూ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్ అందుకుని యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఔరా అనిపించాడు. స్మిత్‌కు ఇలాంటి ఫీల్డింగ్ విన్యాసాలు కొత్త కానప్పటికీ, ఈ క్యాచ్ మాత్రం అతనికి జీవితాంతం గుర్తుండిపోతుంది. స్మిత్ సెన్సేషనల్ డైవింగ్ క్యాచ్‌ను సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇది చూసి స్మిత్‌ను వ్యతిరేకించే వారు సైతం అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇదిలా ఉంటే, ఆసీస్‌తో రెండో వన్డేలో సూర్యకుమార్, శుభ్‌మన్ గిల్ డకౌట్లు కావడంతో పాటు రోహిత్ శర్మ (13), కేఎల్ రాహుల్ (9), హార్ధిక్ పాండ్యా (1), జడేజా (16) దారుణంగా విఫలం కావడంతో టీమిండియా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. విరాట్ కోహ్లి (31) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. -
సూర్యకుమార్ 'ఖేల్' ఖతమైనట్టే..!
IND VS AUS 2nd ODI: భారీ అంచనాల నడుమ ప్రతి మ్యాచ్ బరిలోకి దిగే టీమిండియా విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గత కొన్ని మ్యాచ్‌లుగా చెత్త ప్రదర్శన చేస్తూ ఉసూరుమనిపిస్తున్నాడు. జనవరి 7న శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో (51 బంతుల్లో 112) చివరిసారిగా సెంచరీ చేసిన స్కై.. ఆతర్వాత వరుస విఫలమవుతూ ఫ్యాన్స్‌కు విసుగు తెప్పిస్తున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిన సూర్యకుమార్.. తొలి వన్డేలోనూ ఇదే తరహాలో తొలి బంతికే ఔటయ్యాడు. రెండు సార్లు మిచెల్ స్టార్కే స్కై వికెట్ తీశాడు. అది కూడా ఒకే తరహాలో ఎల్బీడబ్ల్యూ చేసి ఔట్ చేశాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో సూర్యకుమార్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్కైని వెంటనే వన్డే జట్టు నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొందరేమో వన్డేల్లో స్కైకి మరికొన్ని అవకాశాలు ఇవ్వాలని అంటుంటే.. మెజార్టీ శాతం అతన్ని సాగనంపాలని కోరుతున్నారు. పొట్టి ఫార్మాట్లో ఇరగదీసే స్కై.. వన్డేల్లో తేలిపోతుండటం అతని అభిమానులతో పాటు అతన్ని కూడా బాధిస్తుంది. గత 10 వన్డే ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడంతో స్కైని మర్యాద పూర్వకంగా వన్డే జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ వర్గాలు కూడా యోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఆసీస్‌తో రెండో వన్డేలో సూర్యకుమార్, శుభ్‌మన్ గిల్ డకౌట్లు కావడంతో పాటు రోహిత్ శర్మ (13), కేఎల్ రాహుల్ (9), హార్ధిక్ పాండ్యా (1) దారుణంగా విఫలం కావడంతో టీమిండియా 49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. విరాట్ కోహ్లి (30), జడేజా (8) టీమిండియాను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. -
ఆసీస్ ఓపెనర్ల విధ్వంసం.. రెండో వన్డేలో భారత్ ఓటమి
ఆసీస్ ఓపెనర్ల విధ్వంసం.. రెండో వన్డేలో భారత్ ఓటమి టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. వికెట్ నష్టపోకుండా 11 ఓవర్లలోనే చేదించింది. ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్(36 బంతుల్లో 66 నాటౌట్), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 51 నాటౌట్) విధ్వంసం సృష్టించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఆసీస్ బౌలర్లు నిప్పులు చేరగడంతో కేవలం 117 పరుగులకే కుప్పకూలింది.ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 5వికెట్లతో టీమిండియా వెన్ను విరచగా.. అబాట్ మూడు, నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు సాధించారు. విజయానికి చేరువలో ఆసీస్.. 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 8 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్(54) హాఫ్ సెంచరీ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఇప్పటి వరకు 5 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. అతడితో పాటు హెడ్(32) పరుగులతో క్రీజులో ఉన్నాడు. 118 పరుగుల టార్గెట్.. దూకుడుగా ఆడుతున్న ఆసీస్ 118 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతుంది. 3 ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (10), ట్రవిస్ హెడ్ (10) క్రీజ్‌లో ఉన్నారు. నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లు.. 117 పరుగులకే కుప్పకూలిన భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. మిచెల్ స్టార్క్ (5/53), సీన్ అబాట్ (3/23), నాథన్ ఇల్లీస్ (2/13) నిప్పులు చెరగడంతో భారత్‌ను 117 పరుగులకే ఆలౌట్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 103 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా 103 పరుగుల వద్ద టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ (4), షమీ (0)లను అబాట్ పెవిలియన్‌కు పంపాడు. క్రీజులో అక్షర్ పటేల్, సిరాజ్ ఉన్నారు. ఏడో వికెట్ కోల్పోయిన భారత్.. జడ్డూ (16) ఔట్ 91 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. నాథన్ ఇల్లీస్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టడంతో రవీంద్ర జడేజా (16) ఔటయ్యాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ క్రీజ్‌లో ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన భారత్... కోహ్లి ఔట్ 71 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. నాథన్ ఇల్లీస్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి (31) ఎల్బీడబ్ల్యూ ఔటయ్యాడు. స్మిత్ సెన్సేషనల్ క్యాచ్.. 49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన భారత్ ఫస్ట్ స్లిప్‌లో స్టీవ్ స్మిత్ సెన్సేషనల్ క్యాచ్ పట్టడంతో హార్ధిక్ పాండ్యా (1) పెవిలియన్ బాటపట్టక తప్పలేదు. దీంతో టీమిండియా 49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. విరాట్ కోహ్లి (22), జడేజా క్రీజ్‌లో ఉన్నాడు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. రాహుల్ ఔట్, 4 వికెట్లు స్టార్క్ ఖాతాలోకే మిచెల్ స్టార్క్ టీమిండియాను దారుణంగా దెబ్బకొడుతున్నాడు. ఇప్పటికే 3 వికెట్లు పడగొట్టిన స్టార్క్.. కేఎల్ రాహుల్ (9)ను కూడా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 9 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 49/4. కోహ్లి (22), హార్ధిక్ (1) క్రీజ్‌లో ఉన్నారు. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన భారత్.. స్కై మరో డకౌట్ టీమిండియా కష్టాల్లో పడింది. స్టార్క్ వరుస బంతుల్లో రోహిత్ శర్మ (13), సూర్యకుమార్ యాదవ్‌లకు ఔట్‌చేసి టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టాడు. 4.5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 32/3గా ఉంది. విరాట్ కోహ్లి (15), కేఎల్ రాహుల్ క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 13 పరుగులు చేసిన రోహిత్ శర్మ స్టార్క్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. మూడు ఓవర్లలో టీమిండియా స్కోరు 29/1 మూడు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. కోహ్లి 14, రోహిత్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. గిల్ డకౌట్.. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే టీమిండియాకు షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో గిల్ డకౌట్ అయ్యాడు. లబుషేన్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి నాలుగు పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత్ విశాఖ వేదికగా ఇవాళ (మార్చి 19) జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోతుందేమోనని ఆందోళన చెందిన అభిమానులకు శుభవార్త. వరుణుడు శాంతించి, ఎండ కాయడంతో జరుగదనుకున్న మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగనుండగా.. టీమిండియా ఒక్క మార్పు చేసింది. మ్యాక్స్‌వెల్ స్థానంలో నాథన్ ఇల్లీస్, జోస్ ఇంగ్లిస్ ప్లేస్‌లో అలెక్స్ క్యారీ బరిలోకి దిగనుండగా.. భారత్ నుంచి శార్దూల్ ఠాకూర్ స్థానాన్ని అక్షర్ పటేల్ భర్తీ చేయనున్నాడు. తుది జట్లు.. భారత్: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుషేన్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, నాథన్ ఇల్లీస్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా -
IND VS AUS 2nd ODI: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
విశాఖ వేదికగా ఇవాళ (మార్చి 19) మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభంకావాల్సిన భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోతుందేమోనని ఆందోళన చెందిన అభిమానులకు శుభవార్త. విశాఖలో ఈ తెల్లవారు జామున నుంచి ఎడితెరిపి లేకుండా కురిసిన వర్షం కొద్దిసేపటి క్రితం ఆగిపోయింది. వరుణుడు శాంతించడంతో పాటు మైదానం పరిసర ప్రాంతాల్లో ఎండ కూడా కాయడంతో ఢీలా పడిపోయిన అభిమానుల్లో జోష్ నెలకొంది. Covers getting removed.. full sunshine in #Vizag . Probably match will start On time because Vizag have brilliant drinage system & staff #INDvsAUS pic.twitter.com/uRKW9p6L6V — Vizag Weatherman (@VizagWeather247) March 19, 2023 స్టేడియం సిబ్బంది పిచ్‌పై నుంచి కవర్స్ పూర్తిగా తొలగించి, యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారు. స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉండటంతో పనులు కూడా వేగవంతంగా సాగుతున్నాయి. మళ్లీ వర్షం పడితే తప్ప, మ్యాచ్ వంద శాతం సజావుగా సాగేందుకు ఆస్కారం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పూర్తి మ్యాచ్ జరగాలని కోరుకున్న ఫ్యాన్స్‌కు ఇది నిజంగానే శుభవార్త. ఈ మ్యాచ్ కోసం చాలా రోజులుగా కళ్లుకాయలు కాచేలా ఎదురుచూసిన అభిమానులు వర్షం దెబ్బతో ఢీలా పడిపోయారు. అయితే, తాజా పరిస్ధితులను చూసి వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. కాగా, సాయంత్రం సమయంలో వరుణుడు మరోసారి విజృంభించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని అలర్ట్ ఉన్నప్పటికీ.. అభిమానులు మాత్రం వరుణ దేవుడు కురుణిస్తాడని ఆశిస్తున్నారు. 3 వన్డేల ఈ సిరీస్‌లో తొలి వన్డేలో నెగ్గిన భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
IND VS AUS 2nd ODI: హాట్‌కేకుల్లా ‘విశాఖ’ వన్డే టికెట్ల విక్రయం
విశాఖ స్పోర్ట్స్: భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా ఈనెల 19న విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరగనున్న రెండో వన్డేకు సంబంధించిన టికెట్లు మంగళవారం హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. స్టేడియం సామర్థ్యం 27 వేలు కాగా.. పేటీఎం సంస్థ ఈ నెల 10, 11, 12 తేదీల్లో రూ.600 నుంచి రూ.6 వేల వరకు వివిధ విభాగాల్లో 70 శాతం టికెట్లను ఆన్లైన్లో విక్రయించింది. మిగిలిన 30 శాతం టికెట్లను స్థానిక అభిమానులను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్ స్టేడియంతో పాటు మరో రెండు సెంటర్లలో ఏసీఏ నిర్వాహక కమిటీ మంగళవారం అందుబాటులో పెట్టింది. వీటి కోసం తెల్లవారుజాము నుంచే క్రికెట్ అభిమానులు ‘క్యూ’లు కట్టారు. దీంతో టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. కాగా, సిరీస్‌లో తొలి వన్డే 17వ తేదీన ముంబైలో, మూడో వన్డే 22న చెన్నైలో జరగనుంది. -
నైకీ ఎక్కడ...?
సాక్షి, విశాఖపట్నం: ఆస్ట్రేలియాతో తొలి టి20లో అద్భుతంగా బౌలింగ్ చేసిన జస్ప్రీత్ బుమ్రా జెర్సీని గమనించారా? వెనక వైపు అతని పేరు ఉండాల్సిన చోట స్టిక్కర్ అంటించి ఉంది. దాని నంబర్ కూడా 59... రెగ్యులర్‌గా బుమ్రా జెర్సీ నంబర్ 93. ఆదివారం మీడియాకు ఇచ్చిన టీమ్ జాబితాలో కూడా నంబర్ 93 అనే రాసి ఉంది. కానీ మైదానంలో బుమ్రా మాత్రం అది వేసుకోలేదు. ఆ టీ షర్ట్ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ది. అతను తన తొలి మ్యాచ్ నుంచి 59 నంబర్‌నే వాడుతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే న్యూజిలాండ్‌లో జరిగిన టి20ల్లో కూడా రోహిత్ శర్మ విజయ్ శంకర్ జెర్సీ 59తో ...ఆ తర్వాత హార్దిక్ పాండ్యా జెర్సీ 33తో బరిలోకి దిగాడు. అంటే భారత కెప్టెన్ కూడా తన పేరు లేకుండానే ఆడాడు. కొత్త ఆటగాళ్లంటే ఏమో స్టార్ ప్లేయర్ల కోసం కూడా ఇలా టీ షర్ట్లు సిద్ధం కాకపోవడం చిత్రంగా ఉంది. భారత జట్టు వన్డేలు, టి20ల్లో వేర్వేరు జెర్సీలతో ఆడుతుందనేది అందరికీ తెలిసిందే. టీమ్ అపెరల్ పార్ట్నర్ నైకీ వీటిని అందజేయాల్సి ఉంటుంది. అయితే మరి నిర్లక్ష్యమో, మరే కారణమో కానీ టి20 టీమ్‌కు అవసరమైన జెర్సీలు సిద్ధం కానట్లుంది. ఏదో ఒకటిలే పని కానిచ్చేద్దాం అన్నట్లు మన ఆటగాళ్లు కూడా ఈ విషయాన్ని గానీ, టి20 మ్యాచ్‌లను గానీ సీరియస్‌గా తీసుకోలేదేమో. న్యూజిలాండ్ టి20ల్లోనైతే జట్టులో సగం మంది ఇలా స్టిక్కర్లు అంటించి లేదా వన్డే డ్రెస్‌తోనే ఆడేశారు. ఒక దశలో కామెంటేటర్లు కూడా దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతీ విషయంలో ఎంతో కచ్చితంగా వ్యవహరించే బీసీసీఐ ఈ అంశంపై మాత్రం దృష్టి పెట్టకపోవడం ఆశ్చర్యకరం. -
టైగా ముగిసిన వైజాగ్ వన్డే
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా భారత్, వెస్టీండ్‌స్‌ల మధ్య జరిగిన రెండో వన్డే టైగా ముగిసింది. చివరివరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు నిరాశే మిగిలింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లి సేన నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 321 పరుగులు సాధించింది. భారత్ తరఫున కోహ్లి 157 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగగా, అంబటి రాయుడు 73 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన విండీస్ జట్టు దాటిగా ఆడింది. 78 పరుగులకే మూడు వికెట్లు కొల్పోయిన విండీస్.. ఆ తర్వాత వేగం పెంచింది. హెట్‌మైర్(94), హోప్(123 నాటౌట్) భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. హెట్‌మైర్ జౌటైన తర్వాత విండీస్ వికెట్లు కొల్పోయినప్పటికీ.. సెంచరీ సాధించిన హోప్ చివరి వరకు క్రీజ్‌లో నిలిచాడు. అఖరి బంతికి ఐదు పరుగులు చేయాల్సి ఉండగా హోప్ ఫోర్ కొట్టడంతో మ్యాచ్ టైగా ముగిసింది. -
హెట్‌మైర్ ఔట్.. ఊపిరి పీల్చుకున్న భారత్
సాక్షి, విశాఖపట్నం : వచ్చి రావడంతోనే వరుస సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడిన హెట్‌మైర్ ఔటయ్యాడు. దీంతో కోహ్లి సేన ఊపిరి పీల్చుకుంది. 64 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 94 పరుగులు చేసిన హెట్‌మైర్ తృటిలో శతకన్ని చేజార్చుకున్నాడు. చహల్ బౌలింగ్‌లో అనవసరం షాట్‌కు ప్రయత్నించి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి చిక్కాడు. ఇక భారీ లక్ష్య చేధనకు బరిలోకి దిగిన విండీస్‌కు ఓపెనర్లు దాటిగా ఆడి మంచి శుభారంభం అందించారు. గత మ్యాచ్‌లో సెంచరీ సాధించి హెట్‌మైర్ ఈ మ్యాచ్‌లోను దాటిగా ఆడి విండీస్‌ను విజయం దిశగా నడిపించాడు. అతనికి తోడుగా హోప్ నిలవడంతో విండీస్ విజయం ఖాయమని అందరూ భావించారు. కానీ హెట్‌మైర్ వికెట్ కోల్పోవడంతో భారత శిభిరంలో ఆశలు రేకెత్తాయి. విండీస్ విజయానికి ఇంకా 100 పరుగుల దూరంలో ఉంది. క్రీజులో హోప్ 63(74 బంతులు, 7ఫోర్లు, 1 సిక్స్), రోవ్‌మెన్ పోవెల్(0)లున్నారు. -
విశాఖలో విరాట్ రికార్డ్
సాక్షి, విశాఖపట్నం : వెస్టిండీస్‌తో రెండో వన్డేతో పాటు విశాఖ మైదానం భారత సారథి విరాట్ కోహ్లికి మరుపురానివిగా మిగిలాయి. ఇక్కడ ఇప్పటికే ఆడిన నాలుగు వన్డే మ్యాచ్‌ల్లో 118, 117, 99, 65 పరుగులు చేసిన కోహ్లి... తాజాగా (157 నాటౌట్) మరో శతకం బాదేశాడు. అంతేకాకుండా అచ్చొచ్చిన ఈ మైదానంలోనే చిరస్మరణీయమైన 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా తన ఆరాధ్య క్రికెటరైన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. ఒకే క్యాలండర్ ఇయర్లో వేగంగా 1000 పరుగులు సాధించిన ఆటగాడిగా.. వరుసగా మూడేళ్లు 1000కిపైగా పరుగులు సాధించిన ఆటగాడిగా కూడా కోహ్లి చరిత్ర సృష్టించాడు. (చదవండి: కోహ్లి కొట్టేశాడు.. సచిన్ రికార్డు బ్రేక్) ఈ మ్యాచ్‌తో వెస్టిండీస్‌పై అధిక సెంచరీలు(6) సాధించిన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఒక్క మిర్పూర్‌లోనే కోహ్లి 13 ఇన్నింగ్స్‌లో నాలుగు సెంచరీలు బాదగా.. వైజాగ్‌లో మాత్రం ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు.. రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. అందుకే విశాఖ అంటే అమితమైన ప్రేమ కోహ్లికి. వైజాగ్ చేరుకోగానే ట్విటర్లో ఇదే విషయాన్ని ప్రస్తావించాడు కూడా. (చదవండి: విరాట్ వీర విహారం.. విండీస్‌కు భారీ లక్ష్యం) What a stunning place.👌 Love coming to Vizag. 😎✌ pic.twitter.com/ACxmWHoBte — Virat Kohli (@imVkohli) October 23, 2018 -
విరాట్ వీర విహారం.. విండీస్‌కు భారీ లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం : వెస్టిండీస్‌తో వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి (157: 129 బంతులు, 13 ఫోర్లు, 4 సిక్స్‌లు, నాటౌట్) మరోసారి శతక్కొట్టాడు. కోహ్లికి తోడుగా రాయుడు(73) రఫ్పాడించడంతో విండీస్‌కు 322 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో శతకంతో ఆకట్టుకున్న ఓపెనర్ రోహిత్ శర్మ(4) ఈ సారి తీవ్రంగా నిరాశ పరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లి మరో ఓపెనర్ ధావన్‌తో కలిసి ఆచితూచి ఆడేప్రయత్నం చేశాడు. కానీ ధావన్ సైతం (29) పెవిలియన్ చేరడంతో భారత్ 10ఓవర్లకు రెండు వికెట్ల నష్టపోయి 49 పరుగుల మాత్రమే చేయగలిగింది. రఫ్ఫాడించిన రాయుడు.. మిడిలార్డర్ ప్రయోగంలో భాగంగా నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రాయుడు తన బాధ్యతను నిర్వర్తించాడు. నాలుగోస్థానానికి తను సరిగ్గా సరిపోతానని నిరూపించుకున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఆచితూచి ఆడుతూ.. కెప్టెన్ కోహ్లికి అండగా నిలిచాడు. ఈ ఇద్దరు నెమ్మదిగా ఆడుతూ అవకాశం చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. ఈ క్రమంలో తొలుత 56 బంతుల్లో 5 ఫోర్లతో కెప్టెన్ కోహ్లి హాఫ్ సెంచరీ సాధించగా.. ఆ వెంటనే రాయుడు సైతం 61 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే రాయుడు(73)ని అశ్లేనర్స్ క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 139 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. విరాట్ పర్వం మొదలు.. రాయుడు వికెట్ అనంతరం విరాట్ రికార్డుల పర్వం మొదలైంది. క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి కోహ్లి చెలరేగాడు. తొలుత 81 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వన్డేల్లో 10వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. అయితే మరికాసేపటికే భారత్ ధోని (20) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్ దాటిగా ఆడే ప్రయంత్నం చేశాడు. కానీ వికెట్ల ముందు దొరికి పంత్(17) పెవిలియన్ చేరాడు. వరుసగా వికెట్లు కోల్పోతున్న కోహ్లి మాత్రం తన ఆటలో వేగాన్ని తగ్గించలేదు. ఈ క్రమంలో 106 బంతుల్లో 10 ఫోర్లతో కెరీర్లో 37వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ అనంతరం మరింత రెచ్చిపోయాడు. అచ్చొచ్చిన మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 27 బంతుల్లోనే మరో 50 పరుగులు పూర్తి చేశాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో అశ్లేనర్స్, ఒబెడ్లకు రెండు వికెట్లు దక్కగా రోచ్, సామ్యూల్స్లకు తలా వికెట్ లభించింది. -
ఇది నాకేం కొత్తకాదు: రాయుడు
విశాఖపట్టణం: మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం తనకేం కొత్త కాదని టీమిండియా బ్యాట్స్‌మన్, హైదరాబాదీ స్టార్ ఆటగాడు అంబటి రాయుడు తెలిపారు. కెప్టెన్ విరాట్ కోహ్లి అనంతరం బ్యాటింగ్‌కు దిగడంపై తనకెలాంటి ఒత్తిడిలేదని స్పష్టం చేశాడు. వెస్టిండీస్‌తో రెండో వన్డే సందర్భంగా రాయుడు మాట్లాడుతూ.. ‘నిజాయితీగా చెప్పాలంటే నేను ప్రస్తుతం ఈ సిరీస్‌పైనే దృష్టి పెట్టాను. అనంతరం జరిగే పరిణామలపై ఆలోచించడం లేదు. మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం నాకు కొత్త కాదు. చాలా రోజులు నుంచి ఆ స్థానంలో ఆడుతున్నాను. నేను కేవలం నా ఫిట్‌నెస్‌పైనే దృష్టి పెట్టి సాధించాను. యోయో టెస్ట్ గురించి కూడా అంతగా ఆలోచించలేదు. ఐపీఎల్ నాకు మంచి అవకాశం ఇచ్చింది. నేనేంటో నిరూపించుకునేలా చేసింది. భారత జట్టులో మిడిలార్డర్లో ఆడటం ఛాలెంజ్‌తో కూడుకున్నది. గువాహటి మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్ అద్భుతంగా ఆడారు.’ అని రాయుడు చెప్పుకొచ్చాడు. 2001-02లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటం ప్రారంభించిన ఈ హైదరాబాదీ ఆటగాడు.. 28 ఏళ్ల వయసులో 2013తో జింబాంబ్వేపై తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ ద్వారానే గుర్తింపు పొందిన రాయుడు ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైనప్పటికీ యోయో విఫలమవడంతో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ప్రపంచకప్ సన్నాహకంలో భాగంగా గతకొంత కాలంగా భారత జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మూడు, నాలుగు స్థానాలపై దృష్టిపెట్టిన టీమ్‌మేనేజ్‌మెంట్ దానికి రాయుడే సరైన వాడని భావించి అవకాశం కల్పించింది. ఈ సిరీస్‌లో రాయుడు రాణిస్తే ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగే అవకాశం ఉంది. ఇక విండీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. బుధవారం వైజాగ్ వేదికగా రెండో వన్డే జరగనుంది. -
వైజాగ్ వన్డే.. భారత జట్టు ఇదే
ముంబై : విశాఖపట్నం వన్డే మ్యాచ్‌లో బరిలో దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. వెస్టిండీస్‌తో ఐదువన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే విశాఖ పట్నంవేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి వన్డే గెలిచి ఉత్సాహంగా ఉన్న టీమిండియా అచ్చొచ్చిన వైజాగ్ వేదికగా మరో విజయాన్ని నమోదు చేయాలని భావిస్తోంది. ఇటీవల మ్యాచ్‌కు ఒక రోజు ముందే 12 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించే కొత్త సంప్రదాయానికి తెరలేపిన బీసీసీఐ వైజాగ్ వన్డే జట్టును కూడా ప్రకటించింది. తొలి వన్డే జట్టునే ప్రకటించిన జట్టుమేనేజ్‌మెంట్ కొత్తగా కుల్దీప్ పేరును చేర్చింది. అయితే తుది జట్టులో కుల్దీప్ ఆడుతాడా లేక వేరే ఆటగాడు బెంచ్‌కు పరిమితం అవుతాడన్న విషయం మ్యాచ్‌రోజే తెలియనుంది. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే మాత్రం కుల్దీప్ మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఒక వేళ కెప్టెన్ కోహ్లి ముగ్గురు స్పిన్నర్లకు మొగ్గు చూపితే ఉమేశ్ లేక యువ బౌలర్ కలీల్ బెంచ్‌కు పరిమితం అవుతారు. ఇక భారత్ బుధవారం 950వ వన్డే ఆడనుంది. ఈ మైలురాయిని అందుకోనున్న తొలి జట్టుగా రికార్డు సృష్టించనుంది. బీసీసీఐ ప్రకటించిన జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అంబటి రాయుడు, రిషభ్ పంత్, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్ Team India for 2nd ODI, Visakhapatnam - Virat Kohli (C), Shikhar Dhawan, Rohit Sharma, Ambati Rayudu, Rishabh Pant, MS Dhoni (WK), Ravindra Jadeja, Kuldeep Yadav, Yuzvendra Chahal, Umesh Yadav, Mohammad Shami, Khaleel Ahmed #TeamIndia #INDvWI — BCCI (@BCCI) October 23, 2018 -
శిఖర్ ధావన్ మరో ఘనత
సాక్షి, విశాఖ: శ్రీలంకతో జరుగుతున్న నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అత్యంత వేగంగా 4 వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. అంతకు ముందు విరాట్ కోహ్లి 93 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించగా ధావన్ 95 ఇన్నింగ్స్‌లో సాధించి మాజీ కెప్టెన్ గంగూలీ(105 ఇన్నింగ్స్‌ల)ని అధిగమించి ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ధావన్ 62 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక ఓవరాల్‌గా ఆరో బ్యాట్స్‌మన్‌గా రికార్డ్ నమోదు చేశాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఆమ్లా (81 ఇన్నింగ్స్‌ల్లో) తొలి స్థానంలో ఉండగా రిచర్డ్స్(88), జోరూట్(91), విరాట్ కోహ్లి(93), వార్నర్(93)లు ముందు వరుసలో ఉన్నారు. -
భారత్ లక్ష్యం 216
-
భారత్ లక్ష్యం 216
సాక్షి, విశాఖ: శ్రీలంకతో జరుగుతున్న నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించడంతో లంక భారత్‌కు 216 పరుగుల స్పల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది. లంక బ్యాట్స్మన్లలో తరంగ 95 ( 82 బంతులు, 12 ఫోర్లు, 3 సిక్సులు) సదీర సమరవిక్రమా 42(57 బంతుల్లో 5 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తయడంతో లంక 44.5 ఓవర్లకు 215 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఇక భారత బౌలర్లలో చహల్, కుల్దీప్లు మూడేసి వికెట్లు తీయగా పాండ్యా రెండు, బుమ్రా, భువనేశ్వర్‌లు ఒక వికెట్ తీశారు. లంక ఆరంభం అదుర్స్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక ఓపెనర్ గుణతిలక మరో సారి నిరాశపరిచాడు. అయినా మరో ఓపెనర్ తరంగ, సమరవిక్రమాతో కలిసి మంచి శుభారంభాన్ని అందించాడు. ఈ ఇద్దరు సమన్వయంతో ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీలకు తరలించారు. పాండ్యా వేసిన 8 ఓవర్లో తరంగ ఏకంగా 5 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి లంక వికెట్ నష్టపోయి 68 పరుగుల చేసింది. అనంతరం మరింత స్పీడ్ పెంచిన ఈ జోడి స్కోరు బోర్డును వేగంగా పరుగెత్తించింది. ఈ దశలోనే తరంగ 36 బంతుల్లో 10 ఫోర్లతో కెరీర్లో 36వ అర్ధ సెంచరీ సాధించాడు. జట్టు స్కోర్ 136 పరుగుల వద్ద సదీర చహల్ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి ధావన్‌కు చిక్కాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 121 పరుగుల భాగ స్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మాథ్యూస్‌తో తరంగా ఏమాత్రం వేగం తగ్గించుకుండా పరుగులు చేశాడు. మలుపు తిప్పిన ధోని స్టంప్ అవుట్.. భారత చైనామన్ కుల్దీప్ యాదవ్ వేసిన 27 ఓవర్ తొలి బంతిని ఉపుల్ తరంగ క్రీజు దాటి ఆడబోగా.. బంతిని అందుకున్న ధోని అంతే వేగంతో వికెట్లను కొట్టేశాడు. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌ను రివ్యూ కోరగా రిప్లయ్‌లో తరంగ సరిగ్గా తన లెగ్ ఆన్ది లైన్‌పై పెట్టె సమయంలో ధోని వికెట్లను గీరేశాడు. థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడంతో తరంగ సెంచరీ చేజారింది. ఈ వికెట్ అనంతరం శ్రీలంక పేక ముక్కల్లా కుప్పకూలింది. ఇదే ఓవర్లో డిక్వెల్లా(8) అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఏ బ్యాట్స్‌మన్ నిలదొక్కుకోలేకపోయారు. మథ్యూస్(17), పెరీరా(6), పతిరణ(7) అఖిల ధనుంజయ(1), లక్మల్(1)లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చివర్లో గుణరత్నే(17) కూడా అవుటవ్వడంతో శ్రీలంక ఇన్నింగ్స్ 44.5 ఓవర్లకే ముగిసింది. -
ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక
సాక్షి, విశాఖ: భారత్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మ్యాచ్‌లో శ్రీలంక ఆరో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోర్ 197 పరుగుల వద్ద తిసారా పెరీరా(6) చాహల్ బౌలింగ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 136 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి పటిష్ట స్థితిలో ఉన్న శ్రీలంక కథ ఒక్కసారిగా అడ్డం తిరిగింది. ఓపెనర్ ఉపుల్ తరంగ (95) వికెట్ కోల్పోవడంతో వరుస వికెట్లను చేజార్చుకుంది. రెండో వన్డే సెంచరీ సాధించిన మాథ్యూస్ సైతం ఈ మ్యాచ్‌లో నిరాశ పరిచాడు. దీంతో శ్రీలంక 61 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక భారత బౌలర్లలో యజువేంద్ర చాహల్ 3 వికెట్లతో చెలరేగగా కుల్దీప్ రెండు వికెట్లు, బుమ్రా ఓ వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం శ్రీలంక స్కోర్ 204/6, క్రీజులో గుణరత్నే(10) పతిరణ(6)లున్నారు. -
ధోని మార్క్ కీపింగ్.. తరంగ సెంచరీ మిస్
సాక్షి, విశాఖ: శ్రీలంకతో జరుగుతున్న నిర్ణయాత్మక మ్యాచ్‌లో ధోని మరోసారి తన మార్క్ కీపింగ్‌ను ప్రదర్శించాడు. దీంతో శ్రీలంక ఓపెనర్ ఉపుల్ తరంగ 95( 82 బంతులు, 12 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీ చేజార్చుకున్నాడు. భారత చైనామన్ కుల్దీప్ యాదవ్ వేసిన 27 ఓవర్ తొలి బంతిని ఉపుల్ తరంగ క్రీజు దాటి ఆడబోగా.. బంతిని అందుకున్న ధోని అంతే వేగంతో వికెట్లను కొట్టేశాడు. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌ను రివ్యూ కోరగా రిప్లయ్‌లో తరంగ సరిగ్గా తన లెగ్ ఆన్ది లైన్‌పై పెట్టె సమయంలో ధోని వికెట్లను గీరేశాడు. దీంతో థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. నిజానికి ఇది అందరూ నాటౌట్ అనుకున్నా థర్డ్ అంపైర్ వికెట్‌గా ప్రకటించడంతో మైదానంలో అభిమానులు, ఆటగాళ్లు కేరింతలతో ఆనందం వ్యక్తం చేశారు. ధోని వ్యూహంతో డిక్వెల్లా అవుట్.. ఇక ఇదే ఓవర్ ఐదో బంతికి ధోని వ్యూహంతో కుల్దీప్ డిక్వెల్లాను అవుట్ చేశాడు. బంతి వేసే ముందు కుల్దీప్ దగ్గరకు వచ్చిన ధోని స్లిప్‌లో అయ్యర్‌ను ఫీల్డింగ్ పెట్టుకోమని సూచించాడు. ఈ బంతి డిక్వెల్లా బ్యాట్‌ను తగిలి నేరుగా అయ్యర్ చేతిలో పడింది. ఈ వికెట్‌తో ధోని వ్యూహం ఫలించింది. దీంతో శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయింది. ధోని ఇప్పటికే వన్డేల్లో అత్యధిక స్టంప్అవుట్లు సాధించిన కీపర్‌గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. -
ధోని మార్క్ కీపింగ్.. తరంగ సెంచరీ మిస్
-
పాండ్యా బౌలింగ్‌లో ఫోర్ల వర్షం.!
సాక్షి, విశాఖ: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మ్యాచ్‌లో లంక ఓపెనర్ ఉపుల్ తరంగ అర్థ సెంచరీ సాధించాడు. టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా వేసిన 8 ఓవర్లో వరుసగా 5 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో శ్రీలంక 9 ఓవర్లలోపే 65 పరుగులు చేసింది. ఈ ఓవర్‌కు ముందు లంక స్కోర్ 45/1 ఉండగా.. అనంతరం తరంగ 20 పరుగుల పిండుకోవడంతో 65 పరుగులకు చేరింది. ఈ దశలోనే తరంగ 36 బంతుల్లో 10 ఫోర్లతో కెరీర్లో 36వ అర్ధ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం 12 ఓవర్లకు లంక స్కోర్ 73/1. క్రీజులో తరంగ(50)తొ పాటు సమరవిక్రమా(10)లున్నారు. -
పాండ్యా బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఐదు ఫోర్లు
-
విశాఖ వన్డే రద్దు
న్యూఢిల్లీ: భారత్, వెస్టిండీస్‌ల మధ్య మంగళవారం వైజాగ్‌లో జరగాల్సిన మూడో వన్డే రద్దయింది. ‘హుదూద్' తుఫాన్ కారణంగా అతలాకుతలమైన విశాఖలో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని బీసీసీఐ వెల్లడించింది. ఈ మ్యాచ్‌ను మరో తేదీకి మార్చాల్సిన అవసరం కూడా లేదని బోర్డు నిర్ణయించడంతో ఐదు వన్డేల సిరీస్ ఇప్పుడు నాలుగు మ్యాచ్‌లకే పరిమితమైంది. ‘ప్రతికూల వాతావరణం కారణంగా తర్వాతి వన్డే జరగడం లేదు. భారత జట్టు సోమవారం మధ్యాహ్నం వైజాగ్ వెళ్లాల్సి ఉన్నా ఇప్పుడు ఆ అవసరం లేదు. జట్టు ఢిల్లీలోనే ఉండబోతోంది’ అని టీమ్ మీడియా మేనేజర్ ఆర్ఎన్ బాబా ప్రకటించారు. అంతకు ముందు వైజాగ్‌లో వాతావరణ పరిస్థితులను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ), బీసీసీఐకి వెల్లడించింది. ‘తాజా పరిస్థితిని మేం బోర్డుకు వివరించాం. ఆదివారం మధ్యాహ్నం తీవ్ర గాలి వేగానికి పిచ్‌పై కవర్లు కొట్టుకుపోయాయి. స్టేడియంలో ఎలాంటి నష్టం జరిగిందో కనీసం వెళ్లి చూసే పరిస్థితి కూడా లేదు. మా గ్రౌండ్ సిబ్బంది పరిస్థితిపై కూడా ఆందోళనగా ఉన్నాం. ఏ రకంగా చూసినా మ్యాచ్ సాధ్యం కాదు’ అని ఏసీఏ మీడియా మేనేజర్ సీఆర్ మోహన్ చెప్పారు. షెడ్యూల్ ప్రకారం నాలుగో వన్డే శుక్రవారం ధర్మశాలలో జరుగుతుంది. ఏర్పాట్లలో సమస్యల కారణంగా ఈ మ్యాచ్ నిర్వహణకు బీసీసీఐ వెనక్కి తగ్గిందని వార్తలు వచ్చినా... అన్నీ సమసిపోవడంతో ధర్మశాలలోనే నాలుగో వన్డే జరగనుంది. ప్రస్తుతం సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.