వైజాగ్‌ వన్డే.. భారత జట్టు ఇదే | BCCI Announced Team India For 2nd ODI In Visakhapatnam | Sakshi
Sakshi News home page

Oct 23 2018 3:21 PM | Updated on Oct 23 2018 3:21 PM

BCCI Announced Team India For 2nd ODI In Visakhapatnam - Sakshi

టీమిండియా

భారత్‌ బుధవారం 950వ వన్డే ఆడనుంది. ఈ మైలురాయిని అందుకోనున్న తొలి జట్టుగా

ముంబై : విశాఖపట్నం వన్డే మ్యాచ్‌లో బరిలో దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. వెస్టిండీస్‌తో ఐదువన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే విశాఖ పట్నంవేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి వన్డే గెలిచి ఉత్సాహంగా ఉన్న టీమిండియా అచ్చొచ్చిన వైజాగ్‌ వేదికగా మరో విజయాన్ని నమోదు చేయాలని భావిస్తోంది. ఇటీవల మ్యాచ్‌కు ఒక రోజు ముందే 12 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించే కొత్త సంప్రదాయానికి తెరలేపిన బీసీసీఐ వైజాగ్‌ వన్డే జట్టును కూడా ప్రకటించింది.

తొలి వన్డే జట్టునే ప్రకటించిన జట్టుమేనేజ్‌మెంట్‌ కొత్తగా కుల్దీప్‌ పేరును చేర్చింది. అయితే తుది జట్టులో కుల్దీప్‌ ఆడుతాడా లేక వేరే ఆటగాడు బెంచ్‌కు పరిమితం అవుతాడన్న విషయం మ్యాచ్‌రోజే తెలియనుంది. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే మాత్రం కుల్దీప్‌ మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఒక వేళ కెప్టెన్‌ కోహ్లి ముగ్గురు స్పిన్నర్లకు మొగ్గు చూపితే ఉమేశ్‌ లేక యువ బౌలర్‌ కలీల్‌ బెంచ్‌కు పరిమితం అవుతారు. ఇక భారత్‌ బుధవారం 950వ వన్డే ఆడనుంది. ఈ మైలురాయిని అందుకోనున్న తొలి జట్టుగా రికార్డు సృష్టించనుంది.

బీసీసీఐ ప్రకటించిన జట్టు: విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, అంబటి రాయుడు, రిషభ్‌ పంత్‌, ఎంఎస్‌ ధోని, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చహల్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, ఖలీల్‌ అహ్మద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement