హెట్‌మైర్‌ ఔట్‌.. ఊపిరి పీల్చుకున్న భారత్‌ | Shimron Hetmyer Hitting Against India In Vizag ODI | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 24 2018 8:10 PM | Last Updated on Wed, Oct 24 2018 8:22 PM

Shimron Hetmyer Hitting Against India In Vizag ODI - Sakshi

సాక్షి, విశాఖపట్నం : వచ్చి రావడంతోనే వరుస సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడిన హెట్‌మైర్‌ ఔటయ్యాడు. దీంతో కోహ్లి సేన ఊపిరి పీల్చుకుంది. 64 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 94 పరుగులు చేసిన హెట్‌మైర్‌ తృటిలో శతకన్ని చేజార్చుకున్నాడు. చహల్‌ బౌలింగ్‌లో అనవసరం షాట్‌కు ప్రయత్నించి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి చిక్కాడు. ఇక భారీ లక్ష్య చేధనకు బరిలోకి దిగిన విండీస్‌కు ఓపెనర్లు దాటిగా ఆడి మంచి శుభారంభం అందించారు.

గత మ్యాచ్‌లో సెంచరీ సాధించి హెట్‌మైర్‌ ఈ మ్యాచ్‌లోను దాటిగా ఆడి విండీస్‌ను విజయం దిశగా నడిపించాడు. అతనికి తోడుగా హోప్‌ నిలవడంతో విండీస్‌ విజయం ఖాయమని అందరూ భావించారు. కానీ హెట్‌మైర్‌ వికెట్‌ కోల్పోవడంతో భారత శిభిరంలో ఆశలు రేకెత్తాయి. విండీస్‌ విజయానికి ఇంకా 100 పరుగుల దూరంలో ఉంది. క్రీజులో హోప్‌ 63(74 బంతులు, 7ఫోర్లు, 1 సిక్స్‌), రోవ్‌మెన్‌ పోవెల్‌(0)లున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement