
ఇక్కడ ఆడిన ఐదు వన్డే మ్యాచ్‌ల్లో 118, 117, 99, 65, 157 నాటౌట్..
సాక్షి, విశాఖపట్నం : వెస్టిండీస్‌తో రెండో వన్డేతో పాటు విశాఖ మైదానం భారత సారథి విరాట్ కోహ్లికి మరుపురానివిగా మిగిలాయి. ఇక్కడ ఇప్పటికే ఆడిన నాలుగు వన్డే మ్యాచ్‌ల్లో 118, 117, 99, 65 పరుగులు చేసిన కోహ్లి... తాజాగా (157 నాటౌట్) మరో శతకం బాదేశాడు. అంతేకాకుండా అచ్చొచ్చిన ఈ మైదానంలోనే చిరస్మరణీయమైన 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా తన ఆరాధ్య క్రికెటరైన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. ఒకే క్యాలండర్ ఇయర్‌లో వేగంగా 1000 పరుగులు సాధించిన ఆటగాడిగా.. వరుసగా మూడేళ్లు 1000కిపైగా పరుగులు సాధించిన ఆటగాడిగా కూడా కోహ్లి చరిత్ర సృష్టించాడు. (చదవండి: కోహ్లి కొట్టేశాడు.. సచిన్ రికార్డు బ్రేక్)
ఈ మ్యాచ్‌తో వెస్టిండీస్‌పై అధిక సెంచరీలు(6) సాధించిన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఒక్క మిర్పూర్‌లోనే కోహ్లి 13 ఇన్నింగ్స్‌లో నాలుగు సెంచరీలు బాదగా.. వైజాగ్‌లో మాత్రం ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు.. రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. అందుకే విశాఖ అంటే అమితమైన ప్రేమ కోహ్లికి. వైజాగ్ చేరుకోగానే ట్విటర్‌లో ఇదే విషయాన్ని ప్రస్తావించాడు కూడా. (చదవండి: విరాట్ వీర విహారం.. విండీస్‌కు భారీ లక్ష్యం)
What a stunning place.👌 Love coming to Vizag. 😎✌ pic.twitter.com/ACxmWHoBte
— Virat Kohli (@imVkohli) October 23, 2018