![IND VS AUS Vizag ODI Match Tickets Sold Out With In No Time - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/15/Untitled-8.jpg.webp?itok=A4WLYTbp)
విశాఖ స్పోర్ట్స్: భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా ఈనెల 19న విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరగనున్న రెండో వన్డేకు సంబంధించిన టికెట్లు మంగళవారం హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. స్టేడియం సామర్థ్యం 27 వేలు కాగా.. పేటీఎం సంస్థ ఈ నెల 10, 11, 12 తేదీల్లో రూ.600 నుంచి రూ.6 వేల వరకు వివిధ విభాగాల్లో 70 శాతం టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించింది.
మిగిలిన 30 శాతం టికెట్లను స్థానిక అభిమానులను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్ స్టేడియంతో పాటు మరో రెండు సెంటర్లలో ఏసీఏ నిర్వాహక కమిటీ మంగళవారం అందుబాటులో పెట్టింది. వీటి కోసం తెల్లవారుజాము నుంచే క్రికెట్ అభిమానులు ‘క్యూ’లు కట్టారు. దీంతో టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. కాగా, సిరీస్‌లో తొలి వన్డే 17వ తేదీన ముంబైలో, మూడో వన్డే 22న చెన్నైలో జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment